మన రాజకీయ వ్యవస్థలో వివాదాలలో మొట్టమొదట అంతమైపోయేది సత్యం. ప్రత్యర్థులు అతిశయోక్తులతో, అబద్ధాలతో, అర్ధ సత్యాలతో, వక్రీకరణలతో హోరాహోరీ పోరాడుకునేటప్పుడు ఆ సంరంభంలో సత్యం వేదిక మీద నుంచి చల్లగా జారుకుంటుంది. కానీ ఈ పద్ధతి మతావేశాల ఘర్షణకు సరిపోతుందేమో గానీ ప్రజాస్వామ్యానికి సరిపోదు. ప్రజాస్వామ్యానికి ఉన్న అనేక నిర్వచనాలలో సంపూర్ణ సమాచారంతో జరిగే చర్చ అని ఒక నిర్వచనం ఉంది. మన రాజకీయ చర్చలను, వివాదాలను, ఘర్షణలను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఆచరించడం లేదనడానికి మరొక [...]
Archive for August, 2006
ఇంత అజ్ఞానంతో చర్చ సాగేనా?
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on August 31, 2006 | Leave a Comment »
నాయకులకు కన్నీళ్ళు రావా?
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on August 22, 2006 | Leave a Comment »
వర్షాకాలం ప్రవేశించి ఆరు వారాలు గడిచినా చాలా ప్రాంతాలలో వర్షాభావం నెలకొని ఈసారి కాలం కాదేమో అని భయపడుతున్నప్పుడు, కాలం కావడం మాత్రమే కాదు, కానికాలం కూడా వరదలా తోసుకొచ్చింది. రాష్ట్రంలోనూ, ఎగువ రాష్ట్రాలలోనూ కుండపోత వర్షా లు కురిసి నాగావళి, వంశధార, గోదావరి, కృష్ణ పొంగిపొర్లాయి. నీటిచుక్కలో దాగిన విధ్వంసం, బీభత్సం రాష్ట్రంలోని పదమూడు, పద్నాలుగు జిల్లాలను ముంచెత్తాయి. నెల రోజులకు పైగా ఈ వరద బీభ త్సం, దానికి ఎంతమాత్రం స్పందించని పాలకుల నిర్లక్ష్యం, [...]
తెలంగాణ జనహృదయ వ్యక్తీకరణ
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on August 15, 2006 | Leave a Comment »
తెలంగాణ ప్రజానీకంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలున్నాయా లేవా అని ఢిల్లీలో కూచున్న దిగ్విజయ్‌సింగ్ నుంచి హైదరా బాదు చుట్టుపట్ల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలున్న వాళ్ళవరకూ అనేక మంది తమ అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. అటు హస్తినాపురి నుంచీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి కూడా ఎందరో విశ్లేషకులు, ఎప్పు డూ తెలంగాణ ముఖమైనా చూసి ఉండనివాళ్ళూ, కళ్ళకు గంతలు కట్టుకుని కండక్టెడ్ యాత్రలలో తిరిగిపోయేవాళ్ళూ అసలు తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయని చెప్పలేమని ప్రకటిస్తున్నారు.
జీవో నెంబర్ 5 కోరలు తీయని పాము
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on August 8, 2006 | Leave a Comment »
అరవై నాలుగు వేలమంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఊడ్చుకుపోదలచిన జీవో నెం.5 అనే వరద గురించి పూర్తిస్థాయి చర్చ జరగకముం దే రాష్ట్రంలోనే చిన్నా పెద్దా నదులన్నిటికీ వరదలు వచ్చి ఆ చర్చను ఊడ్చేశాయి. ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఒక విశిష్టత ఇది. సమస్యల మీద సమస్యలు ఎంత పెద్ద ఎత్తున వెల్లువలా ముంచెత్తుతున్నాయంటే ఒక సమస్య దగ్గర ఆగి దాన్ని కూలంకషంగా చర్చించి నిజమైన, దీర్ఘకాలికమైన పరిష్కారాలు ఆలోచించే వ్యవధి దొరకడం లేదు.
ప్రభుత్వమా, అమానుషత్వమా?
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on August 1, 2006 | Leave a Comment »
‘రాక్షసీ, నీ పేరు రాజకీయమా?’ అని ఆదివిష్ణు నాలుగు దశాబ్దాల వెనుక ఒక నవల రాశారు. ఆ శీర్షికను వర్తమానానికి అన్వయిస్తే ‘అమానుషత్వమా, నీ పేరు ప్రభుత్వమా?’ అనో, లేదా దానినే తిరగేసి ‘ప్రభుత్వమా, నీ పేరు అమానుషత్వమా?’ అనో అనవలసి వచ్చేటట్టుంది.గత ఆదివారం ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం సమీపంలో జరిగిందని చెప్పబడుతున్న ఎన్‌కౌంటర్‌లో మృతుల పార్థివ శరీరాల పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి ఈ వ్యాఖ్యకు కారణం. ఆ వైఖరి ప్రభుత్వంలోని వ్యక్తులు ఎవరో ఒకరిద్దరు [...]