ఎంతచెడ్డా శాసనసభలకు ఏదో ఒక స్థాయిలో ప్రజలతో సంబంధం, ఐదేళ్లకొకసారి ప్రజలముందుకు పోవలసి వస్తుందనే భయం అయినా ఉన్నాయి. అటువంటి సంబంధంగానీ, భయంగానీ లేని వ్యవస్థ చేతికి ఇంత నిరంకుశ అధికారం ఇవ్వడం సమంజసమేనా?
ప్రత్యక్షంగా రాజ్యాంగంలోని ఒక షెడ్యూల్‌మీదా, పరోక్షంగా రిజ ర్వేషన్లమీదా, భూ సంస్కరణలమీదా- ఒక్కమాటలో చెప్పాలం టే, సామాజిక న్యాయంమీదా కొరడా ఝుళిపిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రపంచీకరణ యుగంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత ప్రజావ్యతిరేకంగా, ఎంత దుర్మార్గంగా ఆలోచించగలదో, తీర్పులు [...]
Archive for January, 2007
కత్తి ఎత్తిందెవరిమీద?
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on January 23, 2007 | Leave a Comment »
వర్తమానం : మరలనిదేల ఎస్సార్సీ?
Posted in Andhra Jyothy, Telangana, Telugu, Vartamaanam on January 9, 2007 | 1 Comment »
- ఎన్. వేణుగోపాల్
ఆ రావణకాష్టం ఈ దేశంలో ఎప్పటికీ చల్లారదనే స్పష్టమైన అవగాహనతోనే, ‘మరలనిదేల రామాయణంబన్న’ అని తానే ప్రశ్న వేసుకుని ‘తినిన అన్నమే తినినయట్లు, చేసిన సంసారమే చేసినయట్లు’ అని జవాబు చెప్పుకుని రామాయణ కల్పవృక్షం రాశారు విశ్వనాథ సత్యనారాయణ. విలీనానికి ముందునుంచీ, 1952 నుంచీ రగులుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎప్పటికీ ఆరిపోదనే స్పష్టమైన అవగాహనతోనే, ఆ మంటమీద దొరికిన చన్నీళ్లు నాలుగు చిలకరిద్దామనే సాచివేత ఎత్తుగడలో భాగంగానే ‘మరలనిదేల ఎస్సార్సీ’ అని [...]