బట్టతలా మోకాలూ ఒకే శరీర భాగాలయినప్పటికీ ఆ రెంటికీ ముడిపెట్టడం అసంబద్ధమైన విషయమని మామూలు లోకజ్ఞానం చెపుతుంది. అయినా ఒక ఆర్థిక సంస్థ చట్టవ్యతిరేక, మోసపూరితచర్యలనూ పత్రికా స్వేచ్ఛనూ ముడిపెట్టడానికి దేశంలోని విజ్ఞులెందరో ప్రయత్నిస్తున్నారు. పెసరుచేను నుంచే పప్పు తయారయినప్పటికీ, పెసరు చేన్లో పోగొట్టుకున్న కడియాన్ని పప్పుదాకలో వెతకడం తెలివితక్కువతనమని మన ప్రాచీన వివేకం ఒక సామెతలో ప్రకటించింది. కాని ఆర్థికలావాదేవీలలో అక్రమాలవల్ల కోల్పోతున్న పరువును అక్షరాల గౌరవనీయతలో వెతికి పట్టుకుందామని విజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. పత్రికాస్వేచ్ఛను మట్టుపెట్టే [...]
Archive for February, 2007
పత్రికాస్వేచ్ఛా బట్టతలా మోకాలూ
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on February 27, 2007 | Leave a Comment »
అక్షరాల దారుశిల్పి
Posted in Book Reviews on February 23, 2007 | Leave a Comment »
దేవేంద్ర తన కథల పుస్తకానికి నాలుగుమాటలు రాయమని నన్ను అడగడం నామీద తనకున్న అభిమానం వల్లనే గాని నా శక్తిసామర్థ్యాలవల్లకాదు. ఎండి సారం పోగొట్టుకున్న చెట్టుకొమ్మకు మళ్లీ ప్రాణం అద్ది అద్భుత శిల్పంగానో, జీవితావసర వస్తువుగానో, పనిముట్టుగానో మలచగలిగిన ఆ అపురూప హస్తకళానైపుణ్యం ముందర, ఆ ప్రాచీన జ్ఞానసంపదను తరిగి కుప్పలుపోస్తున్న ఆధునికత్వపు దూగోడా చప్పుడును అక్షరాలకెక్కించాలని ఆరాటపడుతున్న ఆ జీవితానుభవం ముందర నాబోటి బుద్ధిజీవి వినమ్రంగా తలవంచుకోవలసిందే. దేవేంద్ర చేతులకు శ్రమలో సౌందర్యం సృష్టించడమూ తెలుసు, [...]
సెప్టెంబర్ 17 ‘విమోచన’ – తెలంగాణ ఆకాంక్షలు
Posted in Articles, Telangana, Telugu on February 12, 2007 | 1 Comment »
september 17 vimochana telangana aakankshalu
సెప్టెంబర్ 17 ‘విమోచన’ – తెలంగాణ ఆకాంక్షలు
ఒక ప్రాంతీయ ఉద్యమం వికసించేటప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర పట్ల ప్రగాఢమైన శ్రద్ధాసక్తులు వ్యక్తం కావడం, చరిత్రను తవ్వితీసి తమ అస్తిత్వపు ప్రత్యేకతకు ఆధారాలను, సమర్థనలను వెతుక్కోవడం, చరిత్ర పునాదిపైననే తమ ఉద్యమానికి మద్దతునూ, సాధికారతనూ సాధించుకోవడానికి ప్రయత్నించడం సహజమైన అంశాలు. అయితే చరిత్ర అనేది ఒక నిరపేక్షమైన ముద్ద కాదు గనుక, అందులో వ్యాఖ్యాత దృక్పథాన్నిబట్టి, ఇష్టాయిష్టాలనుబట్టి వాస్తవాల ఎంపికకూ, విస్మరణకూ, వక్రీకరణకూ అవకాశం ఉంటుంది గనుక, తీవ్రమైన భావోద్వేగాలు నెలకొని ఉన్నసమయంలో తమకు నచ్చినదానినే, తమకు అనుకూలమైనదానినే వాస్తవ చరిత్రగా భావించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. నిజంగా ఏమి జరిగి ఉన్నా, తమకు అవసరమైనట్టుగా జరిగిఉంటే బాగుండునని భావించడం, తమకు అనుకూలంగానే జరిగిందని ప్రచారం చేయడం సహజమే.