Feeds:
Posts
Comments

Archive for March, 2007

నక్సలైటు ప్రభావిత ప్రాంతాలలో పని చేసే పోలీసులకు సత్వర పదోన్నతులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంచుకున్న పద్ధ్దతిని దేశం లోని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. జస్టిస్‌ ఎకె. మాధుర్‌, జస్టిస్‌ తరుణ్‌ చటర్జీలతో కూడిన బెంచ్‌ మొన్నటి శుక్రవారం ప్రకటించిన ఈ తీర్పుకు మామాలు మాటల్లో అర్థం చె ప్పాలంటే ఎంత ఎక్కువ మంది నక్సలైట్లను చంపితే అంతతొందరగా పదోన్నతులు సంపాదించుకొని, పైపైకి ఎగబాకి పోవడం సమర్థనీయమేనని, అలా ఎక్కువ మందిని చంపిన వారికి సత్వర పదోన్నతి [...]

Read Full Post »

దేశంలోకెల్లా నిజమైన ఏకైక వామపక్షమని తనకుతాను కితాబులిచ్చుకుంటున్న పార్టీ నాయకులు ఏమన్నారో సరిగ్గా అవే మాటలను ఆ రాష్ట్రపు పోలీసు ఉన్నతాధికారులు కూడా అంటున్నారంటే అది ఆ పోలీసధికారులు వామపక్ష భావజాలం నేర్చుకున్నందుకు గుర్తా?
పశ్చిమబెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లా నందిగ్రామ్‌లో తమ భూమిని మరొకరు ఆక్రమించకూడదన్నందుకు, ఆ ఆకాంక్షను సమరశీలంగా ప్రకటించినందుకు రైతుకూలీల నెత్తురు చిందింది. హల్దీనదికి దక్షిణభాగం నుంచి ఒక కొన్నెత్తుటి నది ఉప నదిగా చేరింది. ప్రభుత్వం చెబుతున్నట్టు పదకొండు మందా, పద్నాలుగుమందా, [...]

Read Full Post »

ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
పోచయ్య అక్కయ్య పుట్టుకనాటినుంచీ బాపుకూ తనకూ ఉన్న సంబంధాన్ని, బాపు తనపట్ల కనబరచిన నమ్మకాన్ని, ప్రేమను తలచుకుని చెపుతూ ఏడుస్తూ ఉండిపోయాడు. అమ్మచనిపోవడానికి ఐదారేళ్లముందే వ్యవసాయం కుప్పకూలింది గనుక జీతగాడి అవసరమే లేకపోయింది. అంటే పోచయ్యతో మా ఇంటి సంబంధం తెగిపోయి దాదాపు ముప్పైఏళ్లయి ఉంటుంది. కాని ఆ మూడు దశాబ్దాల వెనుకటి కథలనూ గాథలనూ పోచయ్య నిన్నమొన్నటి సంగతులలాగ తవ్విపోస్తున్నాడు.
ఎడ్ల యాదగిరి అయితే మేం ఊరు వదిలేనాటికి పుట్టిఉన్నాడోలేదో గాని [...]

Read Full Post »

ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
అప్పుడు రాజారం పోయివచ్చినప్పటినుంచీ, రాజారం మా అందరి ఆలోచనలను మరింత ఎక్కువగా ఆక్రమించడం మొదలుపెట్టింది. రాజారానికి తిరిగివెళ్తే ఎట్లా ఉంటుందనీ, అమ్మ-బాపుల జ్ఞాపకంగా తిరిగి ఇల్లయినా ప్రభాకరరెడ్డి నుంచి వెనక్కి తీసుకుంటే ఎట్లాఉంటుందనీ ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఆలోచనలు ఎట్లా ఉన్నా, కనీసం అందరమూ తీరిగ్గా రాజారం వెళ్లాలనీ, ఆ ఇంట్లో, అమ్మ, బాపుల జ్ఞాపకాలు నెమరువేసుకోవాలనీ అనుకున్నాం. సరిగ్గా సద్దుల బతుకమ్మ నాడు రాజారం చేరి చెరువు దగ్గరికి వెళ్లి [...]

Read Full Post »

ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
అమ్మలేని ఆ ఊరిని చూడగలమా, ఆ ఊరికి మళ్లీ ఎప్పుడైనా వెళ్తామా, వెళ్లగలమా అనుకుంటూ వదిలేసివచ్చిన ఇరవైఐదుఏళ్లకు, బాపు బతికిఉన్నన్నాళ్లూ ఆయననుకూడ అటువైపు వెళ్లవద్దని కట్టడిచేసిన మాకు గత కొంతకాలంగా మా ఊరిమీదికి గాలితిరుగుతోంది. మా పుట్టినఊరు రాజారంను మళ్లీ ఒకసారి చూడాలని, మా అందరి బాల్య కౌమారాలు, అక్కయ్యలిద్దరికీ అన్నయ్యకూ యవ్వనం కూడ గడిచిన ఆ ఇంట్లో, ఆ వీథుల్లో ఒక్కసారి తిరగాడాలని మేం ఆరుగురమూ కొంతకాలంగా అనుకుంటున్నాం. మా [...]

Read Full Post »

ప్రపంచబ్యాంకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వానికి అందనున్న ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థా సంస్కరణల రుణం మూడవ విడత గురించి ఒక్కొక్క వివరమూ క్రమక్రమంగా బయటపడుతున్నాయి. తనకు ముందరి ఏలికను “ప్రపంచబ్యాంకు జీతగాడి”గా అభివర్ణించి, గంభీరోపన్యాసాలుచేసి అధికారపీఠం అధిరోహించినవారు మరెంత పెద్ద డిటో గా మారుతున్నారో ఆ వివరాలు రుజువుచేస్తున్నాయి.
1996 సెప్టెంబర్ లో రహస్య పత్రంగా తయారయి, 1997 జనవరిలో బహిరంగంగా వెలువడిన ‘ఆంధ్రప్రదేశ్ – ఎజెండా ఫర్ ఎకనమిక్ రిఫార్మ్స్’ అనే పత్రంద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం [...]

Read Full Post »

తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ అవసరం సమస్యలు, అవకాశాలు – ఎన్ వేణుగోపాల్

తెలంగాణ హిస్టరీ సొసైటీ ఇంకా రూపొందలేదనే వివరణను ఇప్పటికే వివేక్ గారు, లోకేశ్వర్ గారు ఇచ్చి ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రయత్నం ఏమంటే, తెలంగాణ మీద చాల ప్రేమతో కొన్ని అవగాహనలతో ఒక ప్రయత్నం మొదలయింది. ఆ అవగాహనలు: “చరిత్ర రచనలో తెలంగాణ ఇప్పటికి చాల అన్యాయాన్ని ఎదుర్కొన్నది. తెలుగుజాతి చరిత్ర అని వచ్చినవిగాని, ఆంధ్రప్రదేశ్ చరిత్ర అని వచ్చినవి గాని, తెలంగాణ ప్రాంత చరిత్రను తమలో సంపూర్ణంగా భాగం చేసుకోలేదు. ఈ తొమ్మిది పది జిల్లాల చరిత్రను, ఇక్కడి ప్రజల చరిత్రను, ఇక్కడి ప్రజల సంస్కృతిని ఎక్కడో ఒక అధోజ్ఞాపికగానే చూశాయిగాని, మొత్తంగా చూడలేదు, అన్యాయం చేశాయి, లేదా అధ్యాయాలకు అధ్యాయాలు రాయవలసిన చరిత్రను ఎక్కడో ఒకటి రెండు వాక్యాలలో కుదించాయి. ఒకటి రెండు పరిచ్ఛేదాలలో ముగించేశాయి, వక్రీకరించాయి.” ఈ అవగాహనతో, తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ చరిత్రను పునర్నిర్మించడానికి ఒక ప్రయత్నం ఇప్పుడు ప్రారంభమవుతున్నది. జరిగిన అన్యాయాన్ని కొంతమేరకైనా సరిదిద్దగలమా, విస్మరణకూ వివక్షకూ వక్రీకరణకూ గురైన చరిత్రను పునర్నిర్మించగలమా అనే తపనతో ఈ ప్రయత్నం జరుగుతున్నది.

Telangana charithra punarnirmanam avasaram samasyalu avakaashalu

Read Full Post »

telangana vaithalikudigaa vattikota aalvaruswami
తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి – ఎన్ వేణుగోపాల్

ఆళ్వారుస్వామికి పూర్వరంగం భూస్వామ్య, రాచరిక సమాజాలలో భూస్వామినీ రాజునూ మేల్కొలపడానికి స్తోత్రపాఠాలు పాడే వ్యక్తిగా ఉనికిలోకి వచ్చిన వృత్తి వైతాళికుడు. ఆ పదాన్నే ఆధునిక సమాజాలలో ప్రజలను చైతన్యపరచిన తొలితరం ఆలోచనాపరులను, మేధావులను, ప్రచారకులను, సామాజిక కార్యకర్తలను, ప్రజానాయకులను ఉద్దేశించి కూడ వాడడం జరుగుతున్నది. సర్వసాధారణంగా భూస్వామ్య, రాచరిక, మధ్యయుగ సమాజాలు పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలుగా మారే పురుటినొప్పులు పడుతున్నప్పుడు ఆ మార్పును త్వరితంచేసిన, గానంచేసిన, ఆ మార్పుకు విస్తృత ప్రజాసంఘీభావం సమకూర్చిపెట్టిన మేధావులను, బుద్ధిజీవులను, సృజనకర్తలను వైతాళికులని పిలవడం జరుగుతున్నది.

Read Full Post »

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఆరు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉంది. 1930ల మధ్యనుంచీ తెలుగు సాహిత్యంలోకి మార్క్సిస్టు భావాల ప్రవేశం ఉన్నప్పటికీ, 1930లలోనే కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు, జి.వి.కృష్ణారావు రాసిన వ్యాసాలు, ‘కావ్యజగత్తు’ పుస్తకం ఉన్నప్పటికీ, మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944లో అచ్చయిన రెండు వ్యాసాలను తెలుగులో మెరుగయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ప్రారంభంగా గుర్తించవచ్చు.

Read Full Post »

పాపం ఎప్పటికయినా పండుతుందంటారు. ఎట్టకేలకు కాశ్మీర్ లో అబ్దుల్ రహమాన్ పద్దర్ ను చంపేసి, దానికి ఎన్ కౌంటర్ అని పేరు పెట్టిన వీరులమీద హత్యకేసు నమోదయింది. ఈ దేశంలో ప్రభుత్వ సాయుధబలగాలు పథకం ప్రకారం, ఉద్దేశ్యపూర్వక పాలనా విధానంగా ఎన్ కౌంటర్ల పేరిట రాజకీయ ప్రత్యర్థులమీద, ప్రజలమీద జరుపుతున్న హత్యలను మిగిలిన సాధారణమైన హత్యలలాగనే పరిగణించి న్యాయస్థానాలలో విచారణ జరపాలని ఎన్నోసంవత్సరాలుగా వినిపిస్తున్న డిమాండ్ కు చిట్టచివరికి జవాబు దొరికింది. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు, జాతీయ మానవహక్కులసంఘం, [...]

Read Full Post »

Older Posts »