Feeds:
Posts
Comments

Archive for April, 2007

పాత హైదరాబాదు రాష్ట్రంలోని దుర్భిక్ష మరాఠ్వాడ ప్రాంతానికి చెందిన నాందేడ్ జిల్లా బాబ్లీ దగ్గర మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఒక ఆనకట్ట నుంచి ఆ ప్రాంతానికి నీళ్లు ప్రవహిస్తాయో లేదో గాని ఇప్పటికైతే అనేక వివాదాలు, రాజకీయాలు, అబద్ధాలు, అతిశయోక్తులు, మోసాలు, హామీలు, ఉల్లంఘనలు, మొసలి కన్నీళ్లు, శవదహనాలమీద పేలాలు వేయించుకు తినడాలు ఉరవడిగా ప్రవహిస్తున్నాయి. రెండు రాష్ట్రాలమధ్య రెండు దేశాల మధ్య జరిగినంత కల్లోలం జరుగుతున్నది.

Read Full Post »

చెట్లను మరింత మరింత దగ్గరిగా చూడడంలో మైమరిచిపోతూ అడవిని చూడాలనేది విస్మరించడం, దోమలను పట్టుకోవడంలో తలమునకలయిపోతూ ఏనుగులుదూరే కంతలను వదిలివేయడం మనకు ఎంత బాగా అలవాటయిపోయిందో ఇటీవల బయటపడుతున్న ఒక కుంభకోణం తెలియజేస్తోంది. జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డిపెప్), సర్వశిక్షా అభియాన్ అనే ప్రభుత్వ కార్యక్రమాలలో జరిగిన అవినీతి కథ అది. చిన్నారి పిల్లలకు విద్యావకాశాలు పెంచడానికి, అనేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంతరాలవల్ల చదువుకు దూరమవుతున్న బాలబాలికలకు చదువునివ్వడానికి, చూపునివ్వడానికి ఉద్దేశించిన పథకాలకు తూట్లు [...]

Read Full Post »

..అటువంటి పని ఒక్కసారి కూడా చేయడం అలవాటు లేని పోలీసులు, ఎంతో కాలంగా తాము కక్షపెట్టుకుని ఉన్న ఒకవ్యక్తి పెళ్ళి ఖర్చులకోసం ఇంట్లోడబ్బు ఉన్నదని తెలుసుకుని దాడిచేసి, ఆ డబ్బుకు రంగు అంటగట్టడం, దాని ఆధారంగా నేరారోపణ చేయడం కక్ష సాధింపే అవుతుంది తప్ప చట్టబద్ధపాలన కాదు.
ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒకపక్కన అమాయకులైన సాధారణ ప్రజానీకంమీదా, భిన్నమైన రాజకీయ, తాత్విక అభిప్రాయాలున్న వాళ్ళమీదా నేరారోపణలూ బెదిరింపులూ విచారణలూ శిక్షలూ కక్షలూ నిరాటంకంగా సాగిపోతున్నాయి.మరోపక్కన నిజమైన నేరస్తులు [...]

Read Full Post »

దేశంలోని అసంఖ్యాక జనబాహుళ్యంపట్ల వర్ణాశ్రమధర్మ దుర్మార్గాన్ని సైద్ధాంతీకరించిన మనుస్మృతికీ, సమసమాజ భావనను, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించిన రాజ్యాంగం కింద నడవవలసిన సుప్రీంకోర్టుకూ ఏమీ తేడా లేదని గత శుక్రవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రకటిస్తున్నాయి. శూద్రులకు విద్యను నిషేధించిన రెండువేల ఏళ్లకింది మనుస్మృతినే మరొక మాటల్లో అనుసరించిన ఆధునిక, సర్వసత్తాక, ప్రజాస్వామిక, లౌకిక రాజ్యపు సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నత విద్యావకాశాలమీద గుత్తాధిపత్యం అగ్రవర్ణాలదేనని మరొకసారి చెప్పింది. జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌, [...]

Read Full Post »