ఎట్టకేలకు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉనికిలోకి వచ్చింది. నెలరోజుల అలక తర్వాత, కాగితంమీదనైనా కొన్ని ఎక్కువ అధికారాల, నిధులు అందిన తర్వాత ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి మండలి అధ్యక్ష పదవిని చేపట్టారు. తెలంగాణ ప్రాంతీయ మండలితోపాటుగానే ఉనికిలోకి వచ్చిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతీయ మండలుల అధ్యక్షులు ఇంకా తమ బాధ్యతలు చేపట్టవలసే ఉన్నది. అయితే ఈ ప్రతిపాదిత అధ్యక్షులు తమ పదవీ బాధ్యతలు చేపడతారాలేదా అనే వివాదం రగిలుతున్నంతగా, అసలు ఆ మండలుల లక్ష్యాలు [...]
Archive for May, 2007
ఎవరి మేలు కొరకీ ప్రాంతీయ మండలి ?
Posted in Telangana, Telugu, Vartamaanam on May 29, 2007 | Leave a Comment »
మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు : సమాధానాలు
Posted in Telugu, Vartamaanam on May 24, 2007 | 10 Comments »
మిత్రులారా,
ప్రత్యేకించి మిత్రులు సత్యసాయి గారు, టి బాలసుబ్రహ్మణ్యం గారు, లలిత గారు, రాజేశ్ గారు,
ఆంధ్రజ్యొతిలో నా మంగళవారం శీర్షిక ‘వర్తమానం’ లో ఏప్రిల్ మొదటివారంలో రాసిన ‘మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు’ మీద మీరు చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. జవాబివ్వడానికి చాల ఆలస్యం చేసినందుకు క్షమించండి. పనుల ఒత్తిడి వల్ల కొంత, చర్చించవలసిన విషయాలు చాల లోతయినవి కావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది.
ఇప్పటికైనా మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కదానికి జవాబు చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మనం తీసుకునే [...]
అనుమానం తయారీ
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on May 22, 2007 | 4 Comments »
హిందూ పూజాస్థలం సాయిబాబా గుడిమీద దాడి జరిగినా, ముస్లిం ప్రార్థనాస్థలం మక్కామసీదుమీద దాడి జరిగినా, లౌకిక రాజ్యపు ప్రజాప్రతినిధుల సభాస్థలంమీద దాడి జరిగినా అనుమానం ఒకవైపే ఎక్కుపెట్టబడుతుంది. కనీసం ఒకరి మీద జరిగిన దాడికి వారి ప్రత్యర్థులమీదికి అనుమానం పోవాలనే సహజసూత్రం కూడా మారిపోతున్న సందర్భం ఇది. సహజసూత్రం మారిపోవడం కాదేమో, బలవంతాన మన అనుమానాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతున్నదేమో. అనుమానబీజాలు నాటడం జరుగుతున్నదేమో. తీవ్రంగా, నిశితంగా పరిశోధించి అనుమానితుల పేర్లు ప్రకటించవలసిన సంస్థలు అటువంటి పరిశోధన [...]
ఈ ఇంద్రధనుస్సు రంగేమిటి?
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on May 15, 2007 | Leave a Comment »
దేశమంతా ఉత్కంఠతో నిరీక్షించిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాజకీయ పండితుల, పరిణామాల జ్యోతిష్యుల అంచనాలను తలకిందులు చేస్తూ మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌పార్టీ సొంతంగా ప్రభుత్వం స్థాపించగల జనాదేశాన్ని పొందింది. మాయవతి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవిని అధిరోహించారు. గతంలో మూడుసార్లు మిశ్రమ, ఐక్యసంఘటన ప్రభుత్వాల్లో వరుసగా నాలుగు నెలలు, ఆరునెలలు, పదిహేను నెల లు ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించిన మాయావతి ఈసారి సం పూర్ణ బహుమతి వల్ల పూర్తికాలం కొనసాగవచ్చు. తొలి దళితమహిళా ముఖ్యమంత్రిగా 1995లో [...]
ఇరవైఐదుసంవత్సరాల తెలుగుదేశం ఉత్థానపతనాలు
Posted in Articles, Telugu, Veekshanam on May 12, 2007 | Leave a Comment »
అప్పటికి ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో తిరుగులేని అభిమాన నాయకుడిగా, దైవపాత్రలు పోషించి దైవసమానుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారకరామారావు 1982 మార్చ్ 29 న తెలుగుదేశం అనే ప్రాంతీయ రాజకీయపక్షాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించినప్పుడు అది ఎక్కువకాలం మనబోయే ప్రతిపాదన కాదని చాలమంది విశ్లేషకులు భావించారు. ఒక సినిమాతార పట్ల ప్రజలలో ఉండే వేలంవెర్రి అభిమానం వేరని, అది రాజకీయ నాయకత్వానికి పనికి రాదని చాలమంది భావించారు. కాని ఆ రాజకీయపక్షం తొమ్మిదినెలల కాలంలోనే, [...]
మన గీతాజోహ్రీ ఎక్కడ?
Posted in Andhra Jyothy, Telugu, Vartamaanam on May 8, 2007 | Leave a Comment »
యునాని చికిత్స కోసం భార్య కౌసర్ బీని హైదరాబాద్‌నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తీసుకువెళుతున్న ఒక సాధారణ ముస్లిం యువకుడు సొహ్రాబుద్దీన్ షేక్‌ను 2005 నవంబర్ 22 రాత్రి మార్గమధ్యంలో ఆగంతకులు అడ్డుకున్నారు. వారివెంట ఉన్న సొహ్రాబుద్దీన్ స్నేహితుడు తులసీరాం ప్రజాపతిని కూడా పట్టుకుపోయారు. ఆ ఆగంతకులు తాము పోలీసులమని చెప్పినమాట మినహా వారు నిజంగా ఎవరో, ఆ ముగ్గురినీ ఎక్కడికి పట్టుకుపోయారో అప్పటికి ఎవరికీ తెలియదు. కాని మూడు రోజుల తర్వాత సొహ్రాబుద్దీన్ అహ్మదాబాద్ శివార్లలో ఎన్‌కౌంటర్‌లో [...]
తెరాసకు కొన్ని ప్రశంసలు, కొన్ని ప్రశ్నలు
Posted in Articles, Telangana, Telugu on May 7, 2007 | 1 Comment »
ఏప్రిల్ 27న తన ఆరవ వార్షికోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్లులో విశ్వరూప ప్రదర్శన జరుపుకుంటున్నది. మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజల ప్రగాఢ ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా రూపొందిన తెలంగాణ రాష్ట్రసమితి బతికి బట్టకట్టి ఆరుసంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవసంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, సానుభూతిపరులకు హృదయపూర్వక అభినందనలు తెలపవలసిఉంది.
తీహార్ లో ఆ సభ, చెర్లపల్లిలో ఈ సభ !
Posted in Telugu on May 4, 2007 | 4 Comments »
“మన జైళ్లలో ఉన్న చాలామంది అక్కడ ఉండవలసినవాళ్లు కాదు. చాలమంది అక్కడ ఉండవలసిన వాళ్లు బయటి ప్రపంచంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు.”
“భారత ప్రధానులుగా పూర్తికాలం పదవిలో ఉన్నవారు నలుగురు. వారిలో ప్రతిఒక్కరి పాలనాకాలంలో అవినీతి ఒక ప్రత్యేకదశకు ఎదిగింది. అందరిలోకీ నీతిమంతుడైన నెహ్రూ మంత్రుల అవినీతిపట్ల సంపూర్ణ సహనం వహించి అవినీతికి సాధికారత కల్పించాడు. ఇందిరాగాంధీ అయితే తన యుద్ధనిధులఖజానాను నింపుకునే క్రమంలో రాజకీయ అవినీతిని వ్యవస్థీకరించింది. రాజీవ్ గాంధీ ఆ పనిని ఎంతదూరం తీసుకుపోయాడంటే, వ్యక్తిగతస్థాయిలో కూడ [...]