‘విరబూసే ఆపిల్ చెట్లు కాదు
సత్యానికి తారుపూస్తున్న
హిట్లర్ ఉపన్యాసాలు
నాచేత పాటలురాయిస్తున్నాయి’ అన్నాడు ఏడుదశాబ్దాలకింద జర్మన్ కవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. లక్షలాదిమందిని ఊచకోతకోసిన హిట్లర్ నాజీ పాలన చీకటిరోజుల్లో తన సృజనను వ్యక్తీకరిస్తూ ‘చీకటి రోజుల్లో పాటలుంటాయా’ అని అడిగి ‘ఉంటాయి’ అని తనకు తాను ఆశ్వాసం చెప్పుకుని ఆ పాటలు ‘చీకటి రోజులగురించే’నని వెలుగంత తేటతెల్లంగా చెప్పాడు బ్రెహ్ట్.
Archive for June, 2007
మళ్లీ ఎన్కౌంటరయిన సత్యం
Posted in Telugu, Vartamaanam on June 26, 2007 | Leave a Comment »
వల్లంపాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? (part 2 of 2)
Posted in Reviews, Telugu on June 21, 2007 | 1 Comment »
ఆ విధంగా చూసినప్పుడు తాను పుట్టిన కులానికి, వర్గానికి, మతానికి, లింగానికి, ప్రాంతానికి, భాషకు భిన్నమైన ఆలోచనలు, ఆచరణలు, విలువలు ఉన్న మనుషులు మనచుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారి పుట్టుకతో ఉండగల అవలక్షణాలను వదుల్చుకొమ్మని వారిని నిరంతరం హెచ్చరిస్తూనే, ఎప్పుడైనా అటువంటి అవలక్షణాలు పొడసూపితే వాటిని ఖండిస్తూనే, వారి ఆచరణను బట్టి, విలువలను బట్టి వారిని అంచనా వేయవలసిఉంటుంది. వారి ఆచరణతో, విలువలతో సంబంధంలేకుండా, దుడ్డుకర్ర పట్టుకుని కూచుని “ఫలాని కులంలో పుట్టినవాళ్లందరూ చెడ్డవాళ్లు, ఫలాని కులంలో [...]
వర్గీకరణలో ప్రాంతీయ ప్రత్యేకత
Posted in Telugu, Vartamaanam on June 19, 2007 | 2 Comments »
షెడ్యూల్డ్ కులాలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను ఆ షెడ్యూల్డ్ కులాలలోనే కొన్ని వర్గాలు తమ జనాభా నిష్పత్తికన్న ఎక్కువగా వినియోగించుకుంటున్నందువల్ల, మరికొన్ని వర్గాలు తమ న్యాయమైన వాటాను పొందలేకపోతున్నాయనే వాదనతో, రిజర్వేషన్ల కల్పనలో షెడ్యూల్డ్ కులాల మధ్య కూడ వర్గీకరణను అమలు చేయాలని మొదలయిన మాదిగ దండోరా ఉద్యమం పదమూడు సంవత్సరాల కాలంలో అనేకమలుపులు తిరిగింది. మాదిగ దండోరా నాయకత్వం అప్పుడప్పుడు అవకాశవాద వైఖరి అవలంబించినా, పాలకవర్గ ముఠా తగాదాల్లో తెలిసో తెలియకనో భాగమయిపోయినా, ఆ ఉద్యమపు [...]
శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’
Posted in Book Reviews on June 16, 2007 | Leave a Comment »
సామాజిక జీవన వైవిధ్య దృశ్యాల సంపుటి
పైపైచూపులకు శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’ చాల చిన్న, మామూలు కవితల సంపుటం. ముప్పై కవితలు, ఎనభై పుటలు – అంతే. కాని లోతులకు వెళ్లిచూస్తే ఆ ముప్పై కవితలూ విభిన్నదృశ్యాలలో అపార సామాజిక జీవన వైవిధ్యాన్ని గ్రహించి కవితాత్మకంగా వ్యక్తీకరించినవి. ఒకానొక ప్రత్యేక సామాజిక సందర్భానికి సున్నిత భావుక స్పందనలుగా అక్షరీకరణ పొందినవి. ఆ కవితలలో రూపు కట్టించిన తెలుపు నలుపుల, రంగుల చిత్రాలు జీవితం గురించి మనకు ఇంతవరకూ తెలియని, [...]
వల్లంపాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? (part 1 of 2)
Posted in Reviews, Telugu on June 14, 2007 | Leave a Comment »
ఇరవయోశతాబ్ది తెలుగు సాహిత్య విమర్శకు నిస్సందేహంగా అద్భుతమైన కానుకలు అందించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య గురించి రాయవలసినదీ విశ్లేషించవలసినదీ ఎంతో ఉందనీ, అదంతా ఒక చిన్న సంస్మరణ వ్యాసంలో సాధ్యంకాదనీ తెలిసినా ఇరవై ఏళ్ల పరిచయం, కనీసం పది సంవత్సరాల సాన్నిహిత్యం, చివరి రెండు నెలల ఆత్మీయతలతో అందుకు పూనుకుంటున్నాను.
జీవోమీదజీవోమీదజీవో…
Posted in Telugu, Vartamaanam on June 12, 2007 | 1 Comment »
జీవో 610 మీద మరొక సారి వివాదం మొదలయింది. ఇరవైరెండు సంవత్సరాల కాలయాపన చేసిన ప్రభుత్వం నెలరోజులలోపల అమలు చేస్తానని పారదర్శకంగా అబద్ధమని తేలిపోయే ప్రగల్భాలు పలుకుతున్నది. ఆ అమలుకోసమేననే పేరుతో మరొక జీవో తెచ్చింది. కోస్తాంధ్రకు, రాయలసీమకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తమకు తాము చెప్పుకునే నాయకులు ఆ జీవోను అమలు చేయనేగూడదని ప్రకటిస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడు మరొక అడుగు ముందుకువేసి తెలంగాణ దయ్యం పట్టిందని, దాన్ని వదిలించే భూత వైద్యం జరగాలని అన్నారు. [...]
భూపోరాటంలో పొల్లూ నెల్లూ
Posted in Telugu, Vartamaanam on June 5, 2007 | Leave a Comment »
కొద్దివారాలుగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఇళ్లస్థలాలకోసం నిర్వాసిత పేదలు, గ్రామీణ ప్రాంతాలలో సాగుభూమికోసం భూమిలేని నిరుపేదలు బ్రహ్మాండమైన భూపోరాటం జరుపుతున్నారు. ప్రధానంగా పట్టణప్రాంతాలలో ఇళ్లస్థలాల కోసం ప్రారంభమైన భూపోరాటం క్రమంగా తక్కువగానే అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు కూడ విస్తరించింది. వందలాదిగా, వేలాదిగా ప్రజలు ఈపోరాటాలలో, భూ ఆక్రమణలలో పాల్గొంటున్నారు.
మాట్లాడకుండా ఉండగలనా?
Posted in Poetry, Telugu on June 3, 2007 | 3 Comments »
ప్రతి ఊరూ ఒక దుఃఖపు జ్ఞాపకం
నేలనేలంతా కన్నీటిచెమ్మ
విషాదాక్షరాలతో స్నానమాడుతున్న చరిత్ర
ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడే ఇక్కడ ఇక్కడ…