రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం [...]
Archive for October, 2007
ఆదివాసుల దారి
Posted in Telugu, Vartamaanam on October 23, 2007 | Leave a Comment »
జీవితమే అర్థసత్యం
Posted in Surya, Telugu on October 11, 2007 | Leave a Comment »
అర్ధసత్యం అనే మాటకు సగం సత్యం అనే వాచ్యార్థం కాక, అసత్యం అనే రూఢ్యర్థం కూడ ఉంది. సంపూర్ణ సత్యంలోని ఒకముక్కను చూపడమంటే ఒకరకమైన అసత్యమే గనుక ఆ అర్థం వచ్చిఉంటుంది. సత్యం ఒకటే అయినా చూసేవారి చూపును బట్టి దానిలో ఏదో ఒక పార్శ్వాన్నే పైకెత్తిచూపినప్పుడు, ఆ ఒక్కపార్శ్వమే సంపూర్ణం కాదుగనుక, అసలది ఆ మొత్తం సత్యంలో ఒకానొక పిపీలికంమాత్రమే కావచ్చుగనుక అర్ధసత్యం అసత్యం కావడానికే అవకాశం ఎక్కువ.
విద్యే మహావ్యాపారం
Posted in Telugu, Vartamaanam on October 10, 2007 | Leave a Comment »
“చదవనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్” అని ఆరుశతాబ్దాలకిందనే చదువుకూ వివేకానికీ మధ్య సంబంధాన్ని ప్రకటించిన జాతి మనది. ఇవాళ “చదువంటే వ్యాపారము, చదువుపేర కోట్లు కోట్లు దండుకోదగున్” అని ఆ వివేకాన్ని మార్చిన చతురత మన పాలకులది. ఇన్నాళ్లకివాళ ఏలినవారిదయవల్ల చదువుకు నిర్వచనం మారుతున్నట్టున్నది. ఈ అత్యాధునిక యుగంలో మనం ప్రజలను అజ్ఞులను చేసే, సదసద్వివేక చతురత కలగకుండాచేసే చదువుల వైపు మళ్లుతున్నట్టున్నది.