Feeds:
Posts
Comments

Archive for November, 2007

నిజాం పాలన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య, ఆ తరువాత ఆయన, ఆయన సహచరులు దాన్ని సమర్థించుకుంటున్న తీరు, వివిధ రాజకీయ పక్షాల స్పందన మన రాజకీయ రంగంలోని దివాళాకోరుతనానికి అద్దం పడుతున్నాయి. హైదరాబాదు రాజ్య చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ వర్ధంతి సందర్భంగా ఒక రాజకీయ మర్యాదగా హాజరు కావడం, మిగిలిన గతకాలపు పాలకులందరినీ గౌరవించినట్టే గౌరవించడం ఒక ఎత్తు. కాని ఆ పాలకుడికి సంబంధించిన [...]

Read Full Post »

ఈ సంవత్సరం కూడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికలు రాష్ట్రప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుపట్టాయి. ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి గురించి చాలమంది చాలరోజులుగా మాట్లాడుతున్న విషయాలనే కాగ్ నివేదికలు మరొకసారి నిర్ధారించాయన్నమాట. అధికారపక్షాన్ని విమర్శించడానికి ఏ ఆధారం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు అయాచితంగా ఒక అవకాశం దొరికింది. రెండురోజులుగా ప్రచార సాధనాలనిండా కాగ్ నివేదికల మీద దుమారమే రేగుతోంది.

Read Full Post »

బుద్ధదేవుని భూమిలో, తమను తాము కమ్యూనిస్టులమనీ, మార్క్సిస్టులమనీ పిలుచుకునేవారి పాలనలో నందిగ్రాంలో మళ్లీ హింస చెలరేగింది. ఈ సంవత్సరం జనవరి, మార్చిలలో జరిగిన పోలీసు కాల్పులలో, అధికార సిపిఎం కు చెందిన సాయుధ బలగం హర్మత్ వాహిని కార్యకర్తలు జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోగా, ఈసారి హింసాకాండ పూర్తిగా సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరిగింది. కాల్పులు, దాడులు, గృహదహనాలు, స్త్రీలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరిగాయి. గత హింసాకాండ సమయంలో ఆ ప్రాంతం [...]

Read Full Post »

- N. VENUGOPAL (Visakhapatnam)
The Grey Hounds, Andhra Pradesh’s anti-Naxal task force, are accused of raping tribal women. But nobody’s been booked

Shocked The men had gone out for work when the village was raided by the Grey Hounds
ANGER AND DESPAIR pervade the otherwise cool and serene setting in this part of the Eastern Ghats. The eyes [...]

Read Full Post »

గత గురువారం న్యూఢిల్లీలో పదకొండవ పంచవర్ష ప్రణాళికను ఆమోదించడానికి ఏర్పాటయిన సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ దేశంలో ఆహారానికి, ఎరువులకు, పెట్రోలియం ఉత్పత్తులకు ఇస్తున్న సబ్సిడీల భారం పెరిగిపోతున్నదన్నారు. ఈ సంవత్సరం అది లక్షకోట్ల రూపాయలకు చేరిందని వాపోయారు. ఈ సబ్సిడీలను తగ్గించే విషయమై మంత్రివర్గ సహచరులు, ప్రణాళికాసంఘం సభ్యులు ఆలోచించాలని ఉద్బోధించారు. ఈ సబ్సిడీల భారాన్ని భరించడమంటే అర్థం తక్కువ పాఠశాలలు, తక్కువ ఆస్పత్రులు, తక్కువ స్కాలర్ షిప్పులు, తక్కువ వ్యవసాయ [...]

Read Full Post »

ప్రభుత్వాలు తీసుకునే రాజకీయార్థిక విధానాలు, నిర్ణయాలు దేశప్రజలందరి జీవితాలమీద తీవ్రమైన ప్రభావాన్ని వేస్తాయి. కొందరికి మేలు కలిగిస్తాయి, కొందరికి కీడుకలిగిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును మార్చివేస్తాయి. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో అప్పటివరకూ ఉన్న స్థితిని మంచివైపుకో, చెడువైపుకో తోస్తాయి. అవి ఇంత ప్రభావశీలమైనవి అయినప్పటికీ వాటి గురించి జరగవలసినంత పెద్ద ఎత్తున చర్చ జరగదు.

Read Full Post »

నిరాశనూ నిరుత్సాహాన్నీ పెంచడానికి కాదు గాని, ఏ బలమైన కారణమూ లేకుండా సెన్సెక్స్ రోజు రోజూ పైకి పైపైకి పరుగులు పెడుతుంటే భయం కలుగుతున్నది. సెన్సెక్స్ పైకి పోతున్న ఆ గ్రాఫు మనకు కనబడుతున్న పటాన్ని కూడ దాటి ఫ్రేము పగలగొట్టుకుని ఆకాశంలోకి దూసుకుపోతుంటే ఏదో తెలియని భయం వ్యాపిస్తోంది.

Read Full Post »