Feeds:
Posts
Comments

Archive for December, 2007

‘బస్సుచక్రం ప్రజాప్రగతికి చిహ్నం’ అనే మాట చూడని వారెవరూ మన రాష్ట్రంలో ఉండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే బస్సులమీద ఉండే ఆ సంస్థ చిహ్నంలో ఈమాట ఉంటుంది. ఈ సంస్థ 1950 రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆక్ట్ ప్రకారం 1958 జనవరి 11 న పుట్టింది. ఇంకొక రెండువారాల్లో యాభయవ పడిలో పడబోతున్న ఈ సంస్థ తాను ఎందుకు పుట్టానో మరిచిపోతున్నట్టుంది. దాని పుట్టుకకు కారణమైన చట్టం ప్రయాణికుల రవాణా బాధ్యత [...]

Read Full Post »

పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాను జాతీయ అభివృద్ధి మండలి ఎట్టకేలకు బుధవారం నాడు ఆమోదించింది. నూతన ఆర్థిక విధానాల తర్వాత అసలు మన రాజకీయార్థిక పాలనా విధానాలలో ప్రణాళికల పద్ధతే నిర్లక్ష్యానికి గురవుతున్నది గనుక, ప్రణాళికలలో ఏమి రాసినా వాటిని పాటించడం లేదు గనుక ఈ ఆమోదాన్ని ‘ఎట్టకేల’కు అనవలసి వస్తున్నది. అంతేకాదు, ఈ పదకొండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా మీద కసరత్తు చాల రోజులుగా సాగుతున్నది, ఒక నెల కిందనే కేంద్ర మంత్రివర్గం దీన్ని ఆమోదించింది, [...]

Read Full Post »

వరి మద్దతుధర గురించి ఆందోళనలకు పరిష్కారం దొరకకముందే చెరకు ధర గురించి రైతుల ఆందోళన మొదలు కాబోతున్నది. ఇప్పటికే జహీరాబాద్ ప్రాంతానికి చెందిన చెరకు రైతు దశరథ్ గత సంవత్సరం కర్మాగారానికి తోలిన చెరకుకు ఇప్పటికీ చెల్లింపులు జరగక ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యేకించి చెరకు రైతుల సమస్యల గురించి, మొత్తంగా రైతాంగ సమస్యల గురించి పాలకుల దృష్టికి తేవడం కోసం డి వసంత్ కుమార్ జహీరాబాద్ నుంచి ఢిల్లీ దాకా పాదయత్ర జరిపి అక్కడ అన్ని రాజకీయ [...]

Read Full Post »

జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిథ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్రనుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిథ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్టున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకెత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, చారానా దావత్ కూ బారానా టాంగా అన్నట్టు ఆ పావలా విందుకోసం [...]

Read Full Post »