హైదరాబాదులో ఏడు దశాబ్దాలుగా పనిచేస్తున్న బేగంపేట గాలిమోటర్ల అడ్డాను తోసిరాజంటూ కొత్త అడ్డా వచ్చింది. వారం రోజుల కింద యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించిన ఆ అడ్డా అధికారిక పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నిర్మాణ వ్యయం రు. 1418 కోట్ల అంచనాతో మొదలయి, త్వరలోనే రు. 1760 కోట్ల వ్యయ అంచనాకు చేరినాక పనులు మొదలయి, ప్రస్తుతానికి రు. 2,478 కోట్ల వ్యయంతో ముగిసింది.
Archive for March, 2008
గాలిమోటర్లఅడ్డా నిండా గాలి!
Posted in ParamarthaSatyam, Telugu on March 19, 2008 | 1 Comment »
అబ్బ, రైతులకు ఎన్నివేల కోట్లు !?
Posted in ParamarthaSatyam, Telugu on March 12, 2008 | Leave a Comment »
రైతులకు రుణమాఫీ, రుణాల చెల్లింపులో రాయితీల పద్దు కింద ఈ ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ లో అరవైవేల కోట్ల రూపాయల సహాయం అందించబోతున్నామని, ఇంతటి మహత్కార్యానికి దేశమంతా నీరాజనాలు పలకవలసి ఉందని బడ్జెట్ ఉపన్యాసంలో కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం అన్నారు. పైపైన చూస్తే, అరవైవేలకోట్ల రూపాయలు అనే పెద్దఅంకెచూస్తే అదేదో రైతులకు, దేశ వ్యవసాయరంగానికి చేస్తున్న గొప్ప మేలు లాగనే కనబడుతుంది. కాని తీగలాగి డొంక కదిలిస్తే ఈ ప్రకటన బండారం బయటపడుతుంది.
లక్ష్య ప్రకటనలు పెదాలమీదనేనా?
Posted in ParamarthaSatyam, Telugu on March 5, 2008 | Leave a Comment »
కేంద్ర ఆర్థిక మంత్రి పళనియప్పన్ చిదంబరం స్థానిక వివేకానికి తిరువళ్లువార్ నూ, దేశభక్తికి సుబ్రహ్మణ్య భారతినీ ఉటంకిస్తూ బడ్జెట్ ఉపన్యాసం చదువుతారని గతవారం నేను చేసిన ఊహాగానంలో సగమే నిజమయింది. ఆయన తిరువళ్లువార్ ను ఉటంకించారు గాని ఆ రెండువేలసంవత్సరాల కిందటి మహాకవి నుంచి సుపరిపాలన నిర్వచనాన్ని అరువు తెచ్చుకున్నారు.