అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో,
Archive for April, 2008
పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?
Posted in ParamarthaSatyam, Telugu on April 23, 2008 | Leave a Comment »
ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?
Posted in ParamarthaSatyam, Telugu on April 16, 2008 | 2 Comments »
ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి.
బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం
Posted in ParamarthaSatyam, Telugu on April 10, 2008 | 4 Comments »
రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది. మహా ఆర్భాటంగా, ఎన్నికల ఎత్తుగడగా, ప్రతిపక్షాల విజయావకాశాలను చెదరగొట్టే అస్త్రంగా ఉనికిలోకి వస్తున్న ఈ పథకానికి రెండు వైపుల నుంచీ అతిశయోక్తులతో కూడిన ప్రశంసలూ విమర్శలూ చెలరేగుతున్నాయి. ఎద్దుల కుమ్ములాటలో లేగదూడల కాళ్లు విరిగినట్టు ఈ అతిశయోక్తుల యుద్ధంలో వాస్తవాలు, సరయిన విశ్లేషణలు, పథకపు అవసరం, పథకాన్ని విస్తరించవలసిన అవసరం అంతర్ధానమవుతున్నాయి.
కొత్త నిజాములది ఎవడబ్బ సొమ్ము?!
Posted in ParamarthaSatyam, Telugu on April 1, 2008 | 1 Comment »
రెండు మూడు రోజుల కింద పత్రికల్లో ఒక చిన్న వార్త వచ్చింది. లోపలిపేజీల్లో అప్రధానంగా వచ్చిన ఆ వార్త పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో పనిచేసిన ఒక మాజీ అత్యున్నతాధికారి రాజధానీ నగరంలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ లో తన చేతిగడియారం పోగొట్టుకున్నారట.