ఈ శీర్షిక మీరు చదువుతున్న సమయానికి లోక్ సభలో విశ్వాస తీర్మానం మీద వోటింగ్ వ్యవహారం ముగిసిపోయి కాయో పండో తేలి ఉంటుంది. డా. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఇంకొక ఎనిమిదినెలలో, ఎన్నికలదాకానో కొనసాగవచ్చునా లేదా, ఇప్పుడే కూలిపోవాలా తేలిపోయి ఉంటుంది.
Archive for July, 2008
అవకాశవాదమే రాజకీయం
Posted in Prativadam, Telugu, tagged డా. మన్మోహన్ సింగ్, రాజకీయం, విశ్వాస తీర్మానం, India, UPA on July 26, 2008 | Leave a Comment »
బానిసలు కానిదెన్నడు?
Posted in Prativadam, Telugu on July 19, 2008 | 1 Comment »
కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తున్నదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అక్షర సత్యమే గాని ఆయన నోట రావడమే కొంచెం ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉన్నది. రాష్ట్రప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు ఎట్లా నడవాలో ప్రపంచబ్యాంకు రాసి ఇచ్చిన పత్రాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఆయనది.
ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికన్ ఏజెంటులాగ వ్యవహరిస్తున్నారని అణు ఒప్పందం వ్యవహారం మొదలయినప్పటినుంచీ వామపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు కూడ అటువంటివే. ఆయనను ప్రధానిగా అంగీకరించి మద్దతు ఇస్తూవచ్చినప్పుడూ, అసలు [...]
ప్రజా ప్రయోజనాలా? స్వార్థమా?
Posted in ParamarthaSatyam, Telugu on July 18, 2008 | Leave a Comment »
అణుఒప్పందం వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం దగ్గరికి వచ్చింది. ఈ రసవత్తర నాటకంలో గుర్తించవలసిన, ఆలోచించవలసిన అంశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రభుత్వపక్షాల వైఖరి దగ్గరి నుంచి అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల వరకూ, పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత ప్రవర్తన వరకూ ఎన్నో అంశాలు వివరంగా చర్చించవలసి ఉన్నాయి.
అణు ఒప్పందం అసలు సమస్యలు
Posted in ParamarthaSatyam, Telugu on July 10, 2008 | 1 Comment »
పరమార్థసత్యం జూలై 10, 2008
అణు ఒప్పందం అసలు సమస్యలు
అణుఒప్పందం వ్యవహారంలో అమెరికా షరతులను అంగీకరిస్తూ ముందుకుసాగడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుపిఎ భాగస్వామ్యపక్షాలయిన వామపక్షాలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోవడం ఇవాళ్టి వార్త. ఇది ప్రధానంగా రాజకీయ సంక్షోభంగానో, భారత సార్వభౌమాధికార సమస్యగానో కనబడుతున్నది. ఇంకా కొంచెం ముందుకు వెళితే అది అణువిద్యుత్తు కు సంబంధించిన సాంకేతిక అంశంగా కూడ చూపి ఆ సాంకేతిక నిపుణులు తప్ప మరెవరూ ఆ విషయంలో నోరెత్తడానికి వీలులేదన్న వ్యాఖ్యలూ వినబడుతున్నాయి.