Feeds:
Posts
Comments

Archive for May, 2009

వేలుపిళ్లై ప్రభాకరన్ (1954 – 2009) ఒక సజీవ వ్యక్తిగా శ్రీలంక రాజకీయాలలో పాల్గొన్న యుగం ముగిసింది. ఒక జ్ఞాపకంగా, వీరోచిత పోరాటపు ప్రతీకగా, అమరస్మృతిగా, భవిష్యత్తు పోరాటాలకు ప్రేరణగా శ్రీలంక తమిళ సమాజంలో ప్రభాకరన్ యుగం బహుశా ఎప్పటికీ ముగియదు. స్పార్టకస్ ను మానవజాతి ఎప్పటికీ మరిచిపోనట్టుగా, భగత్ సింగ్ ను భారత సమాజం ఎన్నటికీ మరిచిపోనట్టుగా, అరాఫత్ ను పాలస్తీనీయులు మరిచిపోనట్టుగా శ్రీలంక తమిళ సమాజం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడినన్ని [...]

Read Full Post »

మరొకసారి కన్నీళ్లతో
శ్రీలంక తమిళుల కోసం
 
జనవరి చివరినుంచి ఏప్రిల్ మూడోవారానికి, అంటే నిండా మూడు నెలలు నిండకుండానే, ఎనబై రోజులలోపలే శ్రీలంకలో ఆరువేల ఐదువందలమంది తమిళులు బాంబుదాడులలో, కాల్పులలో మరణించారు. ఇప్పటికీ విదేశీ, స్వతంత్ర పాత్రికేయులను, పరిశీలకులను ఆ ప్రాంతాలలోకి అనుమతించడం లేదు గనుక, ప్రకటిస్తున్న సంఖ్య కన్న నిజంగా జరిగిన హత్యాకాండ ఎంత విస్తృతమైనదో, ప్రాణనష్టం, ఆస్తి నష్టం ఎంత జరిగిందో చెప్పలేం. కనీసంగా చూసినా శ్రీలంక ఉత్తరాదిన దాదాపు రోజుకు వెయ్యి మంది తమిళుల ప్రాణాలు [...]

Read Full Post »

లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్ టి టి ఇ) అనేది తీవ్రవాద సంస్థనా, దాని మూడు దశాబ్దాల రక్తసిక్త చరిత్రలో చేసిన ఘోరమైన రాజకీయ, సాంస్కృతిక, సైనిక తప్పిదాలకు అది ఇప్పుడు మూల్యం చెల్లిస్తోందా, అసలు శ్రీలంకలో నివసిస్తున్న ఇరవైలక్షల పైచిలుకు తమిళులందరికీ ఎల్ టి టి ఇ ప్రాతినిధ్యం వహిస్తుందాలేదా, శ్రీలంక తమిళ సమస్యల పరిష్కారానికి ఎల్ టి టి ఇ హింసాత్మక, సాయుధపోరాట మార్గం ఎంచుకోవడం సరయినదేనా, వగైరా ఎన్ని ప్రశ్నలయినా [...]

Read Full Post »

మూతబడని కనురెప్పలు
ముప్పయ్యేళ్ల ఎదురుచూపుల కనులు
ఆఖరి క్షణానికీ సాకారంకాని స్వప్నం
నేలను చెరబట్టి హింసించి ధ్వంసించి
అపహాస్యంగా ముద్దాడే అహంకారం వాడిది

Read Full Post »

[అరుణతార కొరకు]
పతంజలిగారూ,
మీరు అత్యద్భుత ఐంద్రజాలిక కాల్పనిక కళా దృష్టితో ఊహించిన అలమండ తగువు నిజంగానే మొదలయింది.
అలమండ పెదరామకోవెలలో అటువంటి తగువును మీరు నిజంగా చూశారో లేదో! అందులో గోపాత్రుడూ ఫకీర్రాజూ రొంగలి అమ్మన్నా విరుపుల అప్పన్నా రంగరాజు మాష్టారూ ఉప్పలపాటి చినబాబూ గాజుల పాపయ్యా తెలకలి గురయ్యా బొబ్బిలీ పోలీసులూ మెజస్ట్రీటూ వగైరా వగైరా నిర్వహించిన పాత్రలను మీరు స్వయంగా చూశారో లేదో! కాని ఇప్పుడు ఆ పాత్రలన్నిటినీ, ఆ పాత్రల సమానులందరినీ, వారి వ్యాఖ్యానాలన్నిటినీ మేం [...]

Read Full Post »

సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితం: ప్రతి మనిషికీ సామాజిక జీవితం ఉంటుంది. సామాజిక జీవితం ఎంతమాత్రమూ లేని, ఒంటరి ద్వీపంలాగ బతికే మనిషిని ఊహించడమే అసాధ్యం. మనిషి సంఘజీవి అనేది శుష్కమైన పదబంధం కాదు. సంఘం లేకుండా, తోటి మనుషులు లేకుండా, మానవ సంబంధాలు లేకుండా మనిషి జీవించడమే అసాధ్యం.

Read Full Post »