Posted in Articles, Ee Bhoomi, Telugu on July 28, 2009 | 1 Comment »
విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి
అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ [...]
Read Full Post »
Posted in Articles, Telugu on July 6, 2009 | 2 Comments »
మంత్రనగరి సరిహద్దులలో
కవీ, నీ పాటల్…
హనుమకొండలో 1973లో మొదటిసారి చూసినప్పటినుంచి గుడివాడలో 1981లో చివరిసారి చూసినప్పటిదాకా ఆ తొమ్మిది సంవత్సరాలలో మహాకవి శ్రీశ్రీని అయిదారుసార్లు కొన్నిసార్లు కొంత దగ్గరిగానూ, కొన్నిసార్లు దూరంగానూ చూసి ఉంటాను.
శ్రీశ్రీ గీతాలు చదువుకోవడం, కంఠతాపట్టి గొంతెత్తి చదవడం పదో ఏటికే మొదలయినప్పటికీ ఆయనను మొదటిసారి చూసింది పన్నెండో ఏట. నేను ఏడో తరగతిలో ఉండగా 1973లో హనుమకొండలో విప్లవ రచయితల సంఘం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది.
Read Full Post »
Posted in Articles, Telugu on July 2, 2009 | 1 Comment »
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్ష స్థానానికి జూన్ 12 న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏడు కోట్ల జనాభాలో నాలుగుకోట్ల అరవైలక్షల మంది వోటర్లుండగా ఎనబై శాతం మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎతెలాఫ్ ఆబాద్ గరాన్ ఎ ఈరాన్ ఎ ఇస్లామీ (ఇస్లామిక్ ఇరాన్ నిర్మాతల ఐక్య వేదిక – ఆబాద్ గరాన్ అని పిలుస్తారు) తరఫున మహ్మూద్ అహ్మదినెజాద్, ఎతెమాద్ ఎ మెల్లి (జాతీయ విశ్వాస పార్టీ) తరఫున మెహ్దీ కర్రౌబీ, [...]
Read Full Post »
(అరుణతార పత్రికలో ప్రచురితం)
పతంజలిగారిని మొదటిసారి చూసి దాదాపు ముప్పై ఏళ్లు కావస్తోంది.
సృజన అక్టోబర్ 1980 సంచిక అచ్చువేయించడానికి బెజవాడ వెళ్లి కృష్ణక్క వాళ్లింట్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆయనను చూశాను. అప్పుడు వేణుగోపాల రావు గారు సిద్ధార్థ కాలేజికి ప్రిన్సిపాల్ గా ఉన్నారు. బెంజి సర్కిల్ కు ఇటువైపు కృష్ణక్క వాళ్లిల్లు. అటువైపు ఈనాడు ఆఫీసు. పతంజలి గారు అప్పటికి ఈనాడులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఒక మధ్యాహ్నం వాసు (కె. వాసుదేవరావు) గారితో కలిసి పతంజలి [...]
Read Full Post »