జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిథ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్రనుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిథ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్టున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకెత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, చారానా దావత్ కూ బారానా టాంగా అన్నట్టు ఆ పావలా విందుకోసం [...]
‘Vartamaanam’ అనే వర్గంలోని టపాలు
ఆ చరిత్ర పీడకలే
Posted in Telangana, Telugu, Vartamaanam on డిసెంబరు 4, 2007 | 1 అభిప్రాయం »
బుద్ధదేవుని భూమిలో…
Posted in Telugu, Vartamaanam on నవంబరు 20, 2007 | 1 అభిప్రాయం »
బుద్ధదేవుని భూమిలో, తమను తాము కమ్యూనిస్టులమనీ, మార్క్సిస్టులమనీ పిలుచుకునేవారి పాలనలో నందిగ్రాంలో మళ్లీ హింస చెలరేగింది. ఈ సంవత్సరం జనవరి, మార్చిలలో జరిగిన పోలీసు కాల్పులలో, అధికార సిపిఎం కు చెందిన సాయుధ బలగం హర్మత్ వాహిని కార్యకర్తలు జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోగా, ఈసారి హింసాకాండ పూర్తిగా సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరిగింది. కాల్పులు, దాడులు, గృహదహనాలు, స్త్రీలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరిగాయి. గత హింసాకాండ సమయంలో ఆ ప్రాంతం [...]
ఆదివాసుల దారి
Posted in Telugu, Vartamaanam on అక్టోబర్ 23, 2007 | Leave a Comment »
రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం [...]
విద్యే మహావ్యాపారం
Posted in Telugu, Vartamaanam on అక్టోబర్ 10, 2007 | Leave a Comment »
“చదవనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్” అని ఆరుశతాబ్దాలకిందనే చదువుకూ వివేకానికీ మధ్య సంబంధాన్ని ప్రకటించిన జాతి మనది. ఇవాళ “చదువంటే వ్యాపారము, చదువుపేర కోట్లు కోట్లు దండుకోదగున్” అని ఆ వివేకాన్ని మార్చిన చతురత మన పాలకులది. ఇన్నాళ్లకివాళ ఏలినవారిదయవల్ల చదువుకు నిర్వచనం మారుతున్నట్టున్నది. ఈ అత్యాధునిక యుగంలో మనం ప్రజలను అజ్ఞులను చేసే, సదసద్వివేక చతురత కలగకుండాచేసే చదువుల వైపు మళ్లుతున్నట్టున్నది.
సమాల్ సవాళ్లెవరికి?
Posted in Telugu, Vartamaanam on సెప్టెంబరు 25, 2007 | 1 అభిప్రాయం »
భారతీయుల వాదవినోద కౌశలం గురించి పుస్తకమే రాసిన అమర్త్యసేన్ కూడ ఆశ్చర్యపోయే రీతిలో విలువైన సమయాన్నీ, శక్తినీ ఖర్చు చేస్తూ సేతుసముద్రం – రామసేతు వివాదం జరుగుతున్నది. ఇటువంటి పనికిరాని వివాదాలవల్ల వాస్తవంగా జరిగేదేమంటే అవి సమాజానికి నిజంగా అవసరమైన చర్చలకూ, సమాజం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికీ సమయమూ స్థలమూ మిగలకుండా చేస్తాయి.