Feeds:
Posts
Comments

Archive for the ‘Articles’ Category

అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు తగననీ, ఇది తాను చేసిన పనికి గుర్తింపుగా కన్న చేయవలసిన పనికి ప్రేరణగా భావిస్తున్నాననీ స్వయంగా ఒబామానే అన్నాడు.

Read Full Post »

‘ఆయన లేని లోటు పూడ్చలేనిది’ అనే మాట వినీ వినీ అరిగిపోయింది గాని ఆ మాట అక్షరాలా వర్తించే, సంపూర్ణంగా నిజమయ్యే మనిషి కె. బాలగోపాల్ (1952-2009). నిజంగా తెలుగు సమాజానికీ, ప్రజాఉద్యమాలకూ, ప్రజల హక్కుల పరిరక్షణకూ, తెలుగునాట మేధోకృషికీ ఆయన మరణం తీరని లోటు. ప్రజల సమస్యలను ఆయన పట్టించుకున్నంత తీవ్రంగా పట్టించుకునే, ఆయన ఆలోచించినంత సమగ్రంగా ఆలోచించే, ఆయన పనిచేసినంత సమర్థంగా పనిచేసే మనుషులు తయారు కావడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేము.

Read Full Post »

ఒక వస్తువు, ఒక పరిణామం తన స్థలానికీ కాలానికీ ఎంత గాఢంగా బద్ధమైతే అంతగా సార్వజనీనం, సార్వకాలికం అవుతుందని తత్వశాస్త్రంలో ఒక భావన ఉంది. జూన్ 20, 1952న పుట్టి, అక్టోబర్ 8, 2009 న మరణించిన, ఆంధ్రప్రదేశ్ అనే నిర్దిష్టమైన స్థలంలో, 1980 నుంచి 2009 దాకా అనే స్పష్టమైన కాలంలో పనిచేసిన డా. కందాళ బాలగోపాల్ అనే స్థల కాలబద్ధుడైన వ్యక్తి సాగించిన కృషి నిజంగానే ఆయన జీవితాచరణను ఎల్లకాలానికీ ఒక ఆదర్శంగా, చెరగని [...]

Read Full Post »

IT WAS on May 23, 2008. After a tiring yet fascinating Village Walking Tour in New York’s Greenwich Village, the three of us (my poet friend Narayana Swamy, my companion Vanaja and I) engrossed ourselves in seeing places where 19-year-old Bob Dylan first sang, the pub Dylan Thomas used to frequent, 1969 Stonewall Rebellion where [...]

Read Full Post »

తెలుగు సమాజం మీద చైనీస్ సాహిత్య ప్రభావం గత అరవై సంవత్సరాలకుపైగా చాల ఎక్కువగానే ఉంది. అసలు భారత సమాజంమీదనే ఈ ప్రభావం బలంగా ఉండడానికి చాల కారణాలున్నాయి. విముక్తి పూర్వ చైనా ప్రజల కడగండ్లతో సమానమైన వేదన భారత ప్రజానీకంలో కూడ ఉండడం కావచ్చు. చైనాలో ఉండిన అర్ధభూస్వామ్య, అర్ధ వలస రాజకీయార్థిక, సామాజిక స్థితే ఇక్కడ కూడ ఉండడం కావచ్చు.

Read Full Post »

ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు.

Read Full Post »

ఆగస్ట్ 29, 2009 సాక్షి దినపత్రికలో వచ్చిన ఫీచర్

Read Full Post »

విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి

అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ [...]

Read Full Post »

మంత్రనగరి సరిహద్దులలో
కవీ, నీ పాటల్…
హనుమకొండలో 1973లో మొదటిసారి చూసినప్పటినుంచి గుడివాడలో 1981లో చివరిసారి చూసినప్పటిదాకా ఆ తొమ్మిది సంవత్సరాలలో మహాకవి శ్రీశ్రీని అయిదారుసార్లు కొన్నిసార్లు కొంత దగ్గరిగానూ, కొన్నిసార్లు దూరంగానూ చూసి ఉంటాను.
శ్రీశ్రీ గీతాలు చదువుకోవడం, కంఠతాపట్టి గొంతెత్తి చదవడం పదో ఏటికే మొదలయినప్పటికీ ఆయనను మొదటిసారి చూసింది పన్నెండో ఏట. నేను ఏడో తరగతిలో ఉండగా 1973లో హనుమకొండలో విప్లవ రచయితల సంఘం మొదటి సాహిత్య పాఠశాల జరిగింది.

Read Full Post »

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్ష స్థానానికి జూన్ 12 న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏడు కోట్ల జనాభాలో నాలుగుకోట్ల అరవైలక్షల మంది వోటర్లుండగా ఎనబై శాతం మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. ఎతెలాఫ్ ఆబాద్ గరాన్ ఎ ఈరాన్ ఎ ఇస్లామీ (ఇస్లామిక్ ఇరాన్ నిర్మాతల ఐక్య వేదిక – ఆబాద్ గరాన్ అని పిలుస్తారు) తరఫున మహ్మూద్ అహ్మదినెజాద్, ఎతెమాద్ ఎ మెల్లి (జాతీయ విశ్వాస పార్టీ) తరఫున మెహ్దీ కర్రౌబీ, [...]

Read Full Post »

Older Posts »