Feeds:
Posts
Comments

Archive for the ‘Reviews’ Category

ఆ విధంగా చూసినప్పుడు తాను పుట్టిన కులానికి, వర్గానికి, మతానికి, లింగానికి, ప్రాంతానికి, భాషకు భిన్నమైన ఆలోచనలు, ఆచరణలు, విలువలు ఉన్న మనుషులు మనచుట్టూ ఎంతోమంది ఉన్నారు. వారి పుట్టుకతో ఉండగల అవలక్షణాలను వదుల్చుకొమ్మని వారిని నిరంతరం హెచ్చరిస్తూనే, ఎప్పుడైనా అటువంటి అవలక్షణాలు పొడసూపితే వాటిని ఖండిస్తూనే, వారి ఆచరణను బట్టి, విలువలను బట్టి వారిని అంచనా వేయవలసిఉంటుంది. వారి ఆచరణతో, విలువలతో సంబంధంలేకుండా, దుడ్డుకర్ర పట్టుకుని కూచుని “ఫలాని కులంలో పుట్టినవాళ్లందరూ చెడ్డవాళ్లు, ఫలాని కులంలో [...]

Read Full Post »

ఇరవయోశతాబ్ది తెలుగు సాహిత్య విమర్శకు నిస్సందేహంగా అద్భుతమైన కానుకలు అందించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య గురించి రాయవలసినదీ విశ్లేషించవలసినదీ ఎంతో ఉందనీ, అదంతా ఒక చిన్న సంస్మరణ వ్యాసంలో సాధ్యంకాదనీ తెలిసినా ఇరవై ఏళ్ల పరిచయం, కనీసం పది సంవత్సరాల సాన్నిహిత్యం, చివరి రెండు నెలల ఆత్మీయతలతో అందుకు పూనుకుంటున్నాను.

Read Full Post »

telangana vaithalikudigaa vattikota aalvaruswami
తెలంగాణ వైతాళికుడుగా వట్టికోట ఆళ్వారుస్వామి – ఎన్ వేణుగోపాల్

ఆళ్వారుస్వామికి పూర్వరంగం భూస్వామ్య, రాచరిక సమాజాలలో భూస్వామినీ రాజునూ మేల్కొలపడానికి స్తోత్రపాఠాలు పాడే వ్యక్తిగా ఉనికిలోకి వచ్చిన వృత్తి వైతాళికుడు. ఆ పదాన్నే ఆధునిక సమాజాలలో ప్రజలను చైతన్యపరచిన తొలితరం ఆలోచనాపరులను, మేధావులను, ప్రచారకులను, సామాజిక కార్యకర్తలను, ప్రజానాయకులను ఉద్దేశించి కూడ వాడడం జరుగుతున్నది. సర్వసాధారణంగా భూస్వామ్య, రాచరిక, మధ్యయుగ సమాజాలు పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలుగా మారే పురుటినొప్పులు పడుతున్నప్పుడు ఆ మార్పును త్వరితంచేసిన, గానంచేసిన, ఆ మార్పుకు విస్తృత ప్రజాసంఘీభావం సమకూర్చిపెట్టిన మేధావులను, బుద్ధిజీవులను, సృజనకర్తలను వైతాళికులని పిలవడం జరుగుతున్నది.

Read Full Post »

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఆరు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉంది. 1930ల మధ్యనుంచీ తెలుగు సాహిత్యంలోకి మార్క్సిస్టు భావాల ప్రవేశం ఉన్నప్పటికీ, 1930లలోనే కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు, జి.వి.కృష్ణారావు రాసిన వ్యాసాలు, ‘కావ్యజగత్తు’ పుస్తకం ఉన్నప్పటికీ, మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944లో అచ్చయిన రెండు వ్యాసాలను తెలుగులో మెరుగయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ప్రారంభంగా గుర్తించవచ్చు.

Read Full Post »