Feeds:
Posts
Comments

Archive for the ‘Book Reviews’ Category

సామాజిక జీవన వైవిధ్య దృశ్యాల సంపుటి
పైపైచూపులకు శీలా వీర్రాజు ‘ఎర్రడబ్బారైలు’ చాల చిన్న, మామూలు కవితల సంపుటం. ముప్పై కవితలు, ఎనభై పుటలు – అంతే. కాని లోతులకు వెళ్లిచూస్తే ఆ ముప్పై కవితలూ విభిన్నదృశ్యాలలో అపార సామాజిక జీవన వైవిధ్యాన్ని గ్రహించి కవితాత్మకంగా వ్యక్తీకరించినవి. ఒకానొక ప్రత్యేక సామాజిక సందర్భానికి సున్నిత భావుక స్పందనలుగా అక్షరీకరణ పొందినవి. ఆ కవితలలో రూపు కట్టించిన తెలుపు నలుపుల, రంగుల చిత్రాలు జీవితం గురించి మనకు ఇంతవరకూ తెలియని, [...]

Read Full Post »

దేవేంద్ర తన కథల పుస్తకానికి నాలుగుమాటలు రాయమని నన్ను అడగడం నామీద తనకున్న అభిమానం వల్లనే గాని నా శక్తిసామర్థ్యాలవల్లకాదు. ఎండి సారం పోగొట్టుకున్న చెట్టుకొమ్మకు మళ్లీ ప్రాణం అద్ది అద్భుత శిల్పంగానో, జీవితావసర వస్తువుగానో, పనిముట్టుగానో మలచగలిగిన ఆ అపురూప హస్తకళానైపుణ్యం ముందర, ఆ ప్రాచీన జ్ఞానసంపదను తరిగి కుప్పలుపోస్తున్న ఆధునికత్వపు దూగోడా చప్పుడును అక్షరాలకెక్కించాలని ఆరాటపడుతున్న ఆ జీవితానుభవం ముందర నాబోటి బుద్ధిజీవి వినమ్రంగా తలవంచుకోవలసిందే. దేవేంద్ర చేతులకు శ్రమలో సౌందర్యం సృష్టించడమూ తెలుసు, [...]

Read Full Post »