ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
పోచయ్య అక్కయ్య పుట్టుకనాటినుంచీ బాపుకూ తనకూ ఉన్న సంబంధాన్ని, బాపు తనపట్ల కనబరచిన నమ్మకాన్ని, ప్రేమను తలచుకుని చెపుతూ ఏడుస్తూ ఉండిపోయాడు. అమ్మచనిపోవడానికి ఐదారేళ్లముందే వ్యవసాయం కుప్పకూలింది గనుక జీతగాడి అవసరమే లేకపోయింది. అంటే పోచయ్యతో మా ఇంటి సంబంధం తెగిపోయి దాదాపు ముప్పైఏళ్లయి ఉంటుంది. కాని ఆ మూడు దశాబ్దాల వెనుకటి కథలనూ గాథలనూ పోచయ్య నిన్నమొన్నటి సంగతులలాగ తవ్విపోస్తున్నాడు.
ఎడ్ల యాదగిరి అయితే మేం ఊరు వదిలేనాటికి పుట్టిఉన్నాడోలేదో గాని [...]
Archive for the ‘Compilations’ Category
ఒక నెమలీకకోసం అన్వేషణ – మూడవ భాగం
Posted in Anveshana, Telugu on March 18, 2007 | Leave a Comment »
ఒక నెమలీకకోసం అన్వేషణ – రెండవ భాగం
Posted in Anveshana, Telugu on March 17, 2007 | Leave a Comment »
ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
అప్పుడు రాజారం పోయివచ్చినప్పటినుంచీ, రాజారం మా అందరి ఆలోచనలను మరింత ఎక్కువగా ఆక్రమించడం మొదలుపెట్టింది. రాజారానికి తిరిగివెళ్తే ఎట్లా ఉంటుందనీ, అమ్మ-బాపుల జ్ఞాపకంగా తిరిగి ఇల్లయినా ప్రభాకరరెడ్డి నుంచి వెనక్కి తీసుకుంటే ఎట్లాఉంటుందనీ ఆలోచనలు మొదలయ్యాయి. ఆ ఆలోచనలు ఎట్లా ఉన్నా, కనీసం అందరమూ తీరిగ్గా రాజారం వెళ్లాలనీ, ఆ ఇంట్లో, అమ్మ, బాపుల జ్ఞాపకాలు నెమరువేసుకోవాలనీ అనుకున్నాం. సరిగ్గా సద్దుల బతుకమ్మ నాడు రాజారం చేరి చెరువు దగ్గరికి వెళ్లి [...]
ఒక నెమలీకకోసం అన్వేషణ – ఒకటవ భాగం
Posted in Anveshana, Telugu on March 15, 2007 | 6 Comments »
ఇరవైఐదేళ్ల తర్వాత రాజారం ప్రయాణం
అమ్మలేని ఆ ఊరిని చూడగలమా, ఆ ఊరికి మళ్లీ ఎప్పుడైనా వెళ్తామా, వెళ్లగలమా అనుకుంటూ వదిలేసివచ్చిన ఇరవైఐదుఏళ్లకు, బాపు బతికిఉన్నన్నాళ్లూ ఆయననుకూడ అటువైపు వెళ్లవద్దని కట్టడిచేసిన మాకు గత కొంతకాలంగా మా ఊరిమీదికి గాలితిరుగుతోంది. మా పుట్టినఊరు రాజారంను మళ్లీ ఒకసారి చూడాలని, మా అందరి బాల్య కౌమారాలు, అక్కయ్యలిద్దరికీ అన్నయ్యకూ యవ్వనం కూడ గడిచిన ఆ ఇంట్లో, ఆ వీథుల్లో ఒక్కసారి తిరగాడాలని మేం ఆరుగురమూ కొంతకాలంగా అనుకుంటున్నాం. మా [...]