అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు తగననీ, ఇది తాను చేసిన పనికి గుర్తింపుగా కన్న చేయవలసిన పనికి ప్రేరణగా భావిస్తున్నాననీ స్వయంగా ఒబామానే అన్నాడు.
Archive for the ‘News Archives’ Category
అమెరికా అధినేత శాంతిదూతేనా?
Posted in Articles, Ee Bhoomi, Telugu on November 3, 2009 | 3 Comments »
చెరగని హక్కుల స్ఫూర్తి బాలగోపాల్
Posted in Articles, Surya, Telugu, tagged బాలగోపాల్, BalaGopal on October 22, 2009 | 5 Comments »
ఒక వస్తువు, ఒక పరిణామం తన స్థలానికీ కాలానికీ ఎంత గాఢంగా బద్ధమైతే అంతగా సార్వజనీనం, సార్వకాలికం అవుతుందని తత్వశాస్త్రంలో ఒక భావన ఉంది. జూన్ 20, 1952న పుట్టి, అక్టోబర్ 8, 2009 న మరణించిన, ఆంధ్రప్రదేశ్ అనే నిర్దిష్టమైన స్థలంలో, 1980 నుంచి 2009 దాకా అనే స్పష్టమైన కాలంలో పనిచేసిన డా. కందాళ బాలగోపాల్ అనే స్థల కాలబద్ధుడైన వ్యక్తి సాగించిన కృషి నిజంగానే ఆయన జీవితాచరణను ఎల్లకాలానికీ ఒక ఆదర్శంగా, చెరగని [...]
The Anguish Of A Forlorn Child
Posted in Articles, English, Tehelka on October 9, 2009 | 1 Comment »
IT WAS on May 23, 2008. After a tiring yet fascinating Village Walking Tour in New York’s Greenwich Village, the three of us (my poet friend Narayana Swamy, my companion Vanaja and I) engrossed ourselves in seeing places where 19-year-old Bob Dylan first sang, the pub Dylan Thomas used to frequent, 1969 Stonewall Rebellion where [...]
తెలుగు సమాజంపై చైనా సాహిత్య ప్రభావం
Posted in Articles, Telugu, Vaartha on October 3, 2009 | 1 Comment »
తెలుగు సమాజం మీద చైనీస్ సాహిత్య ప్రభావం గత అరవై సంవత్సరాలకుపైగా చాల ఎక్కువగానే ఉంది. అసలు భారత సమాజంమీదనే ఈ ప్రభావం బలంగా ఉండడానికి చాల కారణాలున్నాయి. విముక్తి పూర్వ చైనా ప్రజల కడగండ్లతో సమానమైన వేదన భారత ప్రజానీకంలో కూడ ఉండడం కావచ్చు. చైనాలో ఉండిన అర్ధభూస్వామ్య, అర్ధ వలస రాజకీయార్థిక, సామాజిక స్థితే ఇక్కడ కూడ ఉండడం కావచ్చు.
ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం?
Posted in Articles, Ee Bhoomi, Telugu on October 1, 2009 | 7 Comments »
ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు.
రాజకీయ చదరంగంలో బలోచీల స్వేచ్ఛాకాంక్ష
Posted in Ee Bhoomi, Telugu on August 25, 2009 | Leave a Comment »
ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాధినేతలిద్దరు విడుదలచేసిన సంయుక్త ప్రకటనలోని పదహారు పదాల చిన్న వాక్యం ఒకటి వారాల తరబడి చర్చకూ రచ్చకూ పార్లమెంటు సమావేశాల వాయిదాలకూ ఉద్రిక్తతలకూ దారి తీయగలదా? ఆ రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పుడు అది సాధ్యం కావచ్చు. లేదా ఆ రెండు దేశాల నాయకులూ తమ ప్రజలు నిత్యజీవిత జీవన్మరణ సమస్యలమీద ఆలోచించగూడదని ఉద్దేశ్యపూర్వకంగానే అటువంటి ఉద్రిక్తతను రెచ్చగొట్టినపుడూ ఆలా జరగవచ్చు.
రాజపక్షె రక్తసిక్త ప్రవచనాలు
Posted in Articles, Ee Bhoomi, Telugu on July 28, 2009 | 1 Comment »
విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి
అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ [...]
మరణం లేని జాతి స్వేచ్ఛాకాంక్ష
Posted in Articles, News Archives, Telugu, tagged ప్రభాకరన్, వేలుపిళ్లై, Elam, LTTE, Prabhakaran, SriLanka, Tamil, Velupillai on May 25, 2009 | 4 Comments »
వేలుపిళ్లై ప్రభాకరన్ (1954 – 2009) ఒక సజీవ వ్యక్తిగా శ్రీలంక రాజకీయాలలో పాల్గొన్న యుగం ముగిసింది. ఒక జ్ఞాపకంగా, వీరోచిత పోరాటపు ప్రతీకగా, అమరస్మృతిగా, భవిష్యత్తు పోరాటాలకు ప్రేరణగా శ్రీలంక తమిళ సమాజంలో ప్రభాకరన్ యుగం బహుశా ఎప్పటికీ ముగియదు. స్పార్టకస్ ను మానవజాతి ఎప్పటికీ మరిచిపోనట్టుగా, భగత్ సింగ్ ను భారత సమాజం ఎన్నటికీ మరిచిపోనట్టుగా, అరాఫత్ ను పాలస్తీనీయులు మరిచిపోనట్టుగా శ్రీలంక తమిళ సమాజం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడినన్ని [...]
విమోచన అంటే చరిత్ర నవ్వదా?
Posted in Andhra Jyothy, Telangana, Telugu, tagged తెలంగాణ, విమోచన, హైదరాబాద్ on September 17, 2008 | 1 Comment »
సెప్టెంబర్ 17, 1948 ని ‘హైదరాబాద్ విమోచన దినం’అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలం గాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు
అవకాశవాదమే రాజకీయాలుగా…
Posted in Prativadam, Telugu, tagged కాంగ్రెస్, చిరంజీవి, తెలుగు, ప్రజారాజ్యం, రాజకీయాలు, శాసనసభ, సమాజ్ వాదీ, Chiranjeevi, Chiru, Praja Rajyam on September 13, 2008 | 2 Comments »
వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికలకోసం తమ తమ కార్యక్రమాలు ప్రకటించడం, ప్రజలకు భారీ వాగ్దానాలు చేయడం, ఏయే రాజకీయ పక్షాలతో తమకు ఎన్నికల పొత్తులు ఉండబోతున్నాయో సూచించడం, తమ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయో కొంత కొంతగా బయట పెట్టడం జరుగుతున్నాయి. మహారాజకీయసర్కస్ లో తొలి అంకంలోని పిల్లి మొగ్గలు, రంగులు మార్చడాలు, ఒక ఊయలమీదినుంచి మరో ఊయలమీదికి గెంతడాలు, ఒకరిమీద మరొకరు ఉత్తుత్తి కత్తులు దూయడాలు యథావిథిగా జరిగిపోతున్నాయి. ఇదంతా రాజకీయక్రీడ అనడానికేమీలేదు. అసలిందులో రాజకీయాలు, ప్రజలకు మేలు చేసే రాజకీయాలు ఉన్నాయా అనేది అనుమానమే.