Feeds:
Posts
Comments

Archive for the ‘Andhra Jyothy’ Category

సెప్టెంబర్‌ 17, 1948 ని ‘హైదరాబాద్‌ విమోచన దినం’అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలం గాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు

Read Full Post »

- మహమూద్‌ దర్వీష్‌ (తెలుగు: ఎన్‌.వేణుగోపాల్‌)

Janma Bhumi

నేనొచ్చింది అక్కడి నుంచే
నా మదినిండా అక్కడి జ్ఞాపకాలే
మనుషులందరికీ ఉన్నట్టే నాకూ
జన్మనిచ్చిన తల్లీ కిటికీలు తెరుచుకున్న ఇల్లూ
రెక్కల్లో రెక్కలయిన అన్నదమ్ములూ
మనసు నిండిన సావాసగాళ్లూ

Read Full Post »

మహమూద్‌ దర్వీష్‌ చనిపోయాడని చదివినప్పుడు అత్యంత ఆత్మీయుడైన తెలుగు కవి చనిపోయినట్టే అనిపించింది. జీవితమంతా మాతృభూమిలో దుర్మార్గ పరాయి పాలనను అనుభవిస్తూనో, రచనలోనూ ఆచరణలోనూ ఆ పాలకులను ధిక్కరిస్తూ ప్రవాసంలోనో గడిపిన పాలస్తీనియన్‌ మహాకవి మహమూద్‌ దర్వీష్‌ పాడిన పాటలన్నీ మన ఆవేదనకు అక్షర రూపాలేననిపిస్తాయి. ఆ వేలమైళ్ల అవతలి భావుకుడు మనలోలోపలి ఆందోళనలకే కవితారూపమిస్తున్నాడా అనిపిస్తుంది

Read Full Post »

చిరకాల మిత్రుడు, పాత్రికేయవృత్తిలో సహాధ్యాయి, తెలంగాణ చరిత్ర గురించీ, భాష గురించీ, సంస్కృతి గురించీ గణనీయమైన కృషి చేసిన పరిశోధకుడు, సాహిత్య విమర్శకుడు, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్ జైలుపాలు కావడం తీవ్రంగా ఆందోళనపరుస్తున్నది. అదికూడ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని దూషించాడనే, అగౌరవపరిచాడనే తప్పుడు ఆరోపణపై నిర్బంధానికి గురికావడం మరింత విచారకరంగా ఉన్నది. ముప్పైఏళ్లుగా వివిధ సాహిత్య, సామాజిక ప్రజా ఉద్యమాలలో భాగస్వామిగా నాకు తెలిసిన శ్రీనివాస్ దళితులపట్ల, పీడితులపట్ల అగౌరవం ప్రకటించాడనడం కన్న దారుణమైన అవాస్తవం మరొకటి ఉండదు. మరి కె. శ్రీనివాస్ మీద ఆ ఆరోపణ చేసిన మందకృష్ణ మాదిగ మన సమాజంలో ఒక ముఖ్యమైన దళిత వర్గానికి ప్రతినిధి. ఆ వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఎంతోకాలంగా పోరాడుతున్న గౌరవనీయమైన నాయకుడు. ఈ ఇద్దరూ ఎదురుబొదురుగా నిలవవలసి రావడమే ఒక విషాదం.

Read Full Post »

జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిథ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్రనుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిథ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్టున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకెత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, చారానా దావత్ కూ బారానా టాంగా అన్నట్టు ఆ పావలా విందుకోసం [...]

Read Full Post »

బుద్ధదేవుని భూమిలో, తమను తాము కమ్యూనిస్టులమనీ, మార్క్సిస్టులమనీ పిలుచుకునేవారి పాలనలో నందిగ్రాంలో మళ్లీ హింస చెలరేగింది. ఈ సంవత్సరం జనవరి, మార్చిలలో జరిగిన పోలీసు కాల్పులలో, అధికార సిపిఎం కు చెందిన సాయుధ బలగం హర్మత్ వాహిని కార్యకర్తలు జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోగా, ఈసారి హింసాకాండ పూర్తిగా సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరిగింది. కాల్పులు, దాడులు, గృహదహనాలు, స్త్రీలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరిగాయి. గత హింసాకాండ సమయంలో ఆ ప్రాంతం [...]

Read Full Post »

రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం [...]

Read Full Post »

“చదవనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్” అని ఆరుశతాబ్దాలకిందనే చదువుకూ వివేకానికీ మధ్య సంబంధాన్ని ప్రకటించిన జాతి మనది. ఇవాళ “చదువంటే వ్యాపారము, చదువుపేర కోట్లు కోట్లు దండుకోదగున్” అని ఆ వివేకాన్ని మార్చిన చతురత మన పాలకులది. ఇన్నాళ్లకివాళ ఏలినవారిదయవల్ల చదువుకు నిర్వచనం మారుతున్నట్టున్నది. ఈ అత్యాధునిక యుగంలో మనం ప్రజలను అజ్ఞులను చేసే, సదసద్వివేక చతురత కలగకుండాచేసే చదువుల వైపు మళ్లుతున్నట్టున్నది.

Read Full Post »

భారతీయుల వాదవినోద కౌశలం గురించి పుస్తకమే రాసిన అమర్త్యసేన్ కూడ ఆశ్చర్యపోయే రీతిలో విలువైన సమయాన్నీ, శక్తినీ ఖర్చు చేస్తూ సేతుసముద్రం – రామసేతు వివాదం జరుగుతున్నది. ఇటువంటి పనికిరాని వివాదాలవల్ల వాస్తవంగా జరిగేదేమంటే అవి సమాజానికి నిజంగా అవసరమైన చర్చలకూ, సమాజం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికీ సమయమూ స్థలమూ మిగలకుండా చేస్తాయి.

Read Full Post »

‘వాకపల్లిలో అత్యాచారాలు జరగలేదు, పోలీసులను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమది’ అని ఆ నేరం జరిగిన మరుక్షణమే నేరస్తులకు క్లీన్ చిట్ ఇచ్చినవాళ్లే, ‘వాకాడు నేరస్తులను వదిలిపెట్టం’ అని ఈ నేరస్తుల గురించి మాత్రం భీషణప్రతిజ్ఞలు చేయడం, రాజ్యం అన్ని వర్గాలమధ్య సమన్యాయం పాటించి, చట్టం ఎదుట అందరినీ సమానంగా చూస్తుందనే కనీస ప్రజాస్వామ్యసూత్రానికి అపహాస్యం.

Read Full Post »

Older Posts »