Feeds:
Posts
Comments

Archive for the ‘Vartamaanam’ Category

జేమ్స్ జాయిస్ నవల ‘యులిసెస్’ లో ఒక పాత్ర ‘చరిత్ర నేను మేల్కొనదలచుకున్న ఒక పీడకల’ అంటుంది. ‘చరిత్రంటే జనం అంగీకరించడానికి ఇష్టపడే మిథ్య’ అన్నాడట నెపోలియన్. ఇవాళ పీడకల అయిన చరిత్రనుంచి మేల్కొనడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ మిథ్య అయిన చరిత్రలోకి ప్రయాణిస్తున్నట్టున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఏ కారణంతో ఈ వివాదం రేకెత్తించారో, ఆ కారణం ఫలిస్తుందో లేదో తెలియదు గాని, చారానా దావత్ కూ బారానా టాంగా అన్నట్టు ఆ పావలా విందుకోసం [...]

Read Full Post »

బుద్ధదేవుని భూమిలో, తమను తాము కమ్యూనిస్టులమనీ, మార్క్సిస్టులమనీ పిలుచుకునేవారి పాలనలో నందిగ్రాంలో మళ్లీ హింస చెలరేగింది. ఈ సంవత్సరం జనవరి, మార్చిలలో జరిగిన పోలీసు కాల్పులలో, అధికార సిపిఎం కు చెందిన సాయుధ బలగం హర్మత్ వాహిని కార్యకర్తలు జరిపిన కాల్పులలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు బలి అయిపోగా, ఈసారి హింసాకాండ పూర్తిగా సిపిఎం కార్యకర్తల ఆధ్వర్యంలోనే జరిగింది. కాల్పులు, దాడులు, గృహదహనాలు, స్త్రీలపై అత్యాచారాలు విచ్చలవిడిగా జరిగాయి. గత హింసాకాండ సమయంలో ఆ ప్రాంతం [...]

Read Full Post »

రాష్ట్రంలో ప్రతిఒక్కరి మనసుమీద ప్రశ్నగా వేలాడుతూ నిరంతరం ఆలోచింపజేస్తున్న నక్సలైటు ఉద్యమానికి ఈవారంలో నలభైసంవత్సరాలు నిండుతాయి. తెలుగుసమాజం మీద అసాధారణమైన ప్రభావంవేసిన శ్రీకాకుళ గిరిజన ఉద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి అక్టోబర్ 31, 1967. ఆరోజున అప్పటి అవిభక్త శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం తాలూకా (ప్రస్తుత విజయనగరం జిల్లా కురుపాం మండలం) లేవిడి గ్రామంలో గిరిజనుల మీద తొలిసారి భూస్వాముల తుపాకులు పేలాయి. ఆరిక కోరన్న, కొండగొర్రి మంగన్న అనే ఇద్దరు గిరిజనులు మరణించారు. నక్సలైటు ఉద్యమం [...]

Read Full Post »

“చదవనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గలుగున్” అని ఆరుశతాబ్దాలకిందనే చదువుకూ వివేకానికీ మధ్య సంబంధాన్ని ప్రకటించిన జాతి మనది. ఇవాళ “చదువంటే వ్యాపారము, చదువుపేర కోట్లు కోట్లు దండుకోదగున్” అని ఆ వివేకాన్ని మార్చిన చతురత మన పాలకులది. ఇన్నాళ్లకివాళ ఏలినవారిదయవల్ల చదువుకు నిర్వచనం మారుతున్నట్టున్నది. ఈ అత్యాధునిక యుగంలో మనం ప్రజలను అజ్ఞులను చేసే, సదసద్వివేక చతురత కలగకుండాచేసే చదువుల వైపు మళ్లుతున్నట్టున్నది.

Read Full Post »

భారతీయుల వాదవినోద కౌశలం గురించి పుస్తకమే రాసిన అమర్త్యసేన్ కూడ ఆశ్చర్యపోయే రీతిలో విలువైన సమయాన్నీ, శక్తినీ ఖర్చు చేస్తూ సేతుసముద్రం – రామసేతు వివాదం జరుగుతున్నది. ఇటువంటి పనికిరాని వివాదాలవల్ల వాస్తవంగా జరిగేదేమంటే అవి సమాజానికి నిజంగా అవసరమైన చర్చలకూ, సమాజం ముందున్న తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడానికీ సమయమూ స్థలమూ మిగలకుండా చేస్తాయి.

Read Full Post »

‘వాకపల్లిలో అత్యాచారాలు జరగలేదు, పోలీసులను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమది’ అని ఆ నేరం జరిగిన మరుక్షణమే నేరస్తులకు క్లీన్ చిట్ ఇచ్చినవాళ్లే, ‘వాకాడు నేరస్తులను వదిలిపెట్టం’ అని ఈ నేరస్తుల గురించి మాత్రం భీషణప్రతిజ్ఞలు చేయడం, రాజ్యం అన్ని వర్గాలమధ్య సమన్యాయం పాటించి, చట్టం ఎదుట అందరినీ సమానంగా చూస్తుందనే కనీస ప్రజాస్వామ్యసూత్రానికి అపహాస్యం.

Read Full Post »

ఆరుపదులు నిండిన స్వతంత్రభారతం గురించి మురిసిపోవడానికేమున్నది? ఈ దేశ ప్రజలు ఏ ఆశలతో, కలలతో బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టే మహోజ్వలపోరాటాలు నడిపారో ఆ ఆశలన్నీ అడియాసలయిన, ఆ కలలన్నీ కల్లలయిన అరవైగ్రీష్మాలను చూసి గర్వపడడానికి ఏమున్నది?

Read Full Post »

ఈ దేశంలో పేదప్రజల ప్రాణాలు కారుచౌక అయిపోయాయి. ఎక్కడ పోలీసు తుపాకి గర్జించినా పోయేవి అమాయక, నిస్సహాయ పేదప్రజల ప్రాణాలే. ఎక్కడ పాలక దుర్మార్గపు కాల్పులు జరిగినా వినబడే సమర్థన ఒకటే. ఎక్కడ రాజ్య దౌర్జన్యానికి అమాయకులు అసువులు బాసినా కనబడేవి నిజాయితీ లేని రాజకీయ నాయకుల పలకరింపులే, పరామర్శలే, గ్లిసరిన్ కన్నీళ్లే.

Read Full Post »

“ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, తుపాకి రాజ్యం” అనే నినాదం ఈ రాష్ట్రంలో మార్మోగడం 1970ల చివరలోనో 1980ల మొదట్లోనో ప్రారంభమయింది. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్ ఎస్ యు), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) వంటి విప్లవ విద్యార్థిసంఘాల ద్వారా, మొత్తంగా నక్సలైటు రాజకీయాల ద్వారా ఆ నినాదం చలామణీలోకి వచ్చింది. అప్పుడు ప్రధానంగా ఈ నినాదం ఇస్తుండిన సంఘాలలో కొన్ని ఇప్పుడు నిషేధంలో ఉన్నాయి, కొన్ని [...]

Read Full Post »

జీవో 610 వివాదం మళ్ళీ ఒకసారి రాజుకుంటున్నది. ఒకసారి విషాదం గా ముగిసిన చరిత్ర మరొకసారి హాస్యాస్పదంగా పునరావృత్తమవుతుందని అన్నట్టు ఈసారి విషాదమూ ప్రహసనమూ కలగలిసి సాగుతున్నాయి. ఈసారి ప్రధాన చర్చ ఆ జీవోను అమలు చేయడమా చేయకపోవడమా అనికాదు. ఆ జీవో అసలేమిటో తెలుసునా అని జరుగుతున్నది.

Read Full Post »

Older Posts »