అమెరికా అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామాకు 2009 నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 9 న చేసిన ప్రకటన ఎంతమందికి సంతోషం కలిగించిందో చెప్పలేము గాని అంతకన్న ఎక్కువమందికి విచారాన్నీ, ఇంకా ఎక్కువమందికి ఆశ్చర్యాన్నీ కలిగించి ఉంటుంది. తనకు ఈ బహుమానం ప్రకటించడం తనను కూడ ఆశ్చర్య పరచిందనీ, తాను అందుకు తగననీ, ఇది తాను చేసిన పనికి గుర్తింపుగా కన్న చేయవలసిన పనికి ప్రేరణగా భావిస్తున్నాననీ స్వయంగా ఒబామానే అన్నాడు.
Archive for the ‘Ee Bhoomi’ Category
అమెరికా అధినేత శాంతిదూతేనా?
Posted in Articles, Ee Bhoomi, Telugu on November 3, 2009 | 3 Comments »
ఇరుగుపొరుగుతో ఎందుకీ యుద్ధోత్సాహం?
Posted in Articles, Ee Bhoomi, Telugu on October 1, 2009 | 7 Comments »
ఇరుగుపొరుగుదేశాలతో యుద్ధం జరపాలని నిర్ణయాలు తీసుకునేవాళ్లు, యుద్ధం జరగాలని కోరుకునేవాళ్లు, యుద్ధానికి ఆయుధ సంపత్తి సమకూర్చేవాళ్లు, యుద్ధాన్ని సమర్థిస్తూ, యుద్ధానికి కారణాలు చూపిస్తూ వాదనలు చేసేవాళ్ళు చాలమందే ఉంటారు. కాని వాళ్లు ఎప్పుడూ ఎక్కడా ఏయుద్ధంలోనూ పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్లో, వాళ్ల కుటుంబ సభ్యులో మరణించడం గురించీ, నష్టపోవడం గురించీ ప్రశ్నించవలసిన అవసరమే లేదు.
రాజకీయ చదరంగంలో బలోచీల స్వేచ్ఛాకాంక్ష
Posted in Ee Bhoomi, Telugu on August 25, 2009 | Leave a Comment »
ఇరుగుపొరుగు దేశాల ప్రభుత్వాధినేతలిద్దరు విడుదలచేసిన సంయుక్త ప్రకటనలోని పదహారు పదాల చిన్న వాక్యం ఒకటి వారాల తరబడి చర్చకూ రచ్చకూ పార్లమెంటు సమావేశాల వాయిదాలకూ ఉద్రిక్తతలకూ దారి తీయగలదా? ఆ రెండు దేశాల మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉన్నప్పుడు అది సాధ్యం కావచ్చు. లేదా ఆ రెండు దేశాల నాయకులూ తమ ప్రజలు నిత్యజీవిత జీవన్మరణ సమస్యలమీద ఆలోచించగూడదని ఉద్దేశ్యపూర్వకంగానే అటువంటి ఉద్రిక్తతను రెచ్చగొట్టినపుడూ ఆలా జరగవచ్చు.
రాజపక్షె రక్తసిక్త ప్రవచనాలు
Posted in Articles, Ee Bhoomi, Telugu on July 28, 2009 | 1 Comment »
విరగబూసిన ఆపిల్ చెట్టు సౌందర్యానికీ
ఇళ్లకు తారుపూసే వాడి ఉపన్యాసాల బీభత్సానికీ
మధ్య నా హృదయం లోలోపల ఘర్షణ
కాని ఆ ఉపన్యాసాలే నాచేత కవిత్వం రాయిస్తాయి
అన్నాడు జర్మన్ మహాకవి బెర్టోల్ట్ బ్రెహ్ట్. నాజీల దుర్మార్గాల మీద రాసిన కవిత్వంలో ఎన్నోచోట్ల హిట్లర్ కు పర్యాయపదంగా ‘ఇళ్లకు తారుపూసేవాడు’ అని వాడేవాడు బ్రెహ్ట్. ఆ కవిత్వం వెలువడి ఏడెనిమిది దశాబ్దాలు దాటినతర్వాత మన కళ్ల ఎదురుగా మరొక హిట్లర్ తిరుగాడుతున్నాడు. పేరుకు శాంతి అహింసల బౌద్ధ మతాన్ని అవలంబిస్తున్నట్టు చెప్పుకునే ఈ [...]