Feeds:
Posts
Comments

Archive for the ‘Prativadam’ Category

వివిధ రాజకీయ పక్షాలు ఎన్నికలకోసం తమ తమ కార్యక్రమాలు ప్రకటించడం, ప్రజలకు భారీ వాగ్దానాలు చేయడం, ఏయే రాజకీయ పక్షాలతో తమకు ఎన్నికల పొత్తులు ఉండబోతున్నాయో సూచించడం, తమ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయో కొంత కొంతగా బయట పెట్టడం జరుగుతున్నాయి. మహారాజకీయసర్కస్ లో తొలి అంకంలోని పిల్లి మొగ్గలు, రంగులు మార్చడాలు, ఒక ఊయలమీదినుంచి మరో ఊయలమీదికి గెంతడాలు, ఒకరిమీద మరొకరు ఉత్తుత్తి కత్తులు దూయడాలు యథావిథిగా జరిగిపోతున్నాయి. ఇదంతా రాజకీయక్రీడ అనడానికేమీలేదు. అసలిందులో రాజకీయాలు, ప్రజలకు మేలు చేసే రాజకీయాలు ఉన్నాయా అనేది అనుమానమే.

Read Full Post »

ఆ తేదీకి అరవైరెండు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఉత్సవాలు జరుపుకున్న తర్వాత ఐదురోజులు తిరగకుండానే ఆ స్వాతంత్ర్యం ఈ దేశంలో అట్టడుగు మనిషికి ఏమి ఇచ్చిందో, ఇవ్వలేదో చూసే అవకాశాన్ని మన రాష్ట్ర పోలీసులు నాకు కలిగించారు.

Read Full Post »

అవినీతి మీద నడిచే రాజకీయ వ్యవస్థను మార్చబోను, అవినీతిని తగ్గిస్తాను, దోపిడీ పీడనలమీద నడిచే వ్యవస్థను మార్చబోను, వాటికి అతుకులూ మాట్లూ వేస్తాను, అసమానతలను తొలగించబోను, ఆ అసమానతలను, దుఃఖాన్ని, వేదనను, ఆకలిని మరచిపోవడానికి కొన్ని కలలు మాత్రం అమ్ముతాను లాంటి వాగ్దానాలను గతంలో చాలమంది చేశారు. ఇవే మన కొత్త నాయకుడి రాజకీయాలయితే చిరునామాలు మారవచ్చునేమోగాని వ్యవస్థ మాత్రం మారదు.

Read Full Post »

రవాణా కమిషనర్ కార్యాలయంలో ఒక మంత్రి సోదరుడు, ఒక రవాణాకంపెనీ యజమాని చేసిన రభస మీద సామాజికకోణంలో చాలా చర్చ జరిగింది. అది జరగవలసిందే. కాని అంతకన్న ఎక్కువగా ఈ ఉదంతంతో మన సామాజిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, ప్రభుత్వ కార్యాలయాల గురించీ, అవినీతి గురించీ ఎన్నో కీలకమైన అంశాలను చర్చకు తేవలసి ఉండింది.

Read Full Post »

సెజ్ పేరిట దేశదేశాల సంపన్నుల ప్రయోజనాలకోసం తమ భూములనూ జీవనోపాధినీ జీవనాన్నీ కోల్పోయిన పోలేపల్లి గ్రామ ప్రజలు తెలిసో తెలియకో మన రాజకీయ పక్షాల, నాయకుల రంగులు బయటపెడుతున్నారు. ఒక అమాయక, బాధిత గ్రామంలో ఒక ముఖ్యమైన రాజకీయ నిర్ధారణ ఈ విధంగా వెల్లువెత్తడం ఆశ్చర్యమేమీ కాదు. ఇదివరకు అనేక గ్రామాలు, అనేక పరిణామాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. కాని ఇది మరొకసారి మనపక్కనే, హైదరాబాదుకు కూతవేటు దూరంలో నిరూపించబడుతున్నది

Read Full Post »

ఈ శీర్షిక మీరు చదువుతున్న సమయానికి లోక్ సభలో విశ్వాస తీర్మానం మీద వోటింగ్ వ్యవహారం ముగిసిపోయి కాయో పండో తేలి ఉంటుంది. డా. మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి ప్రభుత్వం ఇంకొక ఎనిమిదినెలలో, ఎన్నికలదాకానో కొనసాగవచ్చునా లేదా, ఇప్పుడే కూలిపోవాలా తేలిపోయి ఉంటుంది.

Read Full Post »

కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తున్నదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అక్షర సత్యమే గాని ఆయన నోట రావడమే కొంచెం ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉన్నది. రాష్ట్రప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు ఎట్లా నడవాలో ప్రపంచబ్యాంకు రాసి ఇచ్చిన పత్రాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఆయనది.
ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికన్ ఏజెంటులాగ వ్యవహరిస్తున్నారని అణు ఒప్పందం వ్యవహారం మొదలయినప్పటినుంచీ వామపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు కూడ అటువంటివే. ఆయనను ప్రధానిగా అంగీకరించి మద్దతు ఇస్తూవచ్చినప్పుడూ, అసలు [...]

Read Full Post »