అణుఒప్పందం వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయి లోక్ సభలో అవిశ్వాస తీర్మానం దగ్గరికి వచ్చింది. ఈ రసవత్తర నాటకంలో గుర్తించవలసిన, ఆలోచించవలసిన అంశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ప్రభుత్వపక్షాల వైఖరి దగ్గరి నుంచి అన్ని పార్లమెంటరీ రాజకీయ పక్షాల వరకూ, పార్లమెంటు సభ్యుల వ్యక్తిగత ప్రవర్తన వరకూ ఎన్నో అంశాలు వివరంగా చర్చించవలసి ఉన్నాయి.
Archive for the ‘ParamarthaSatyam’ Category
ప్రజా ప్రయోజనాలా? స్వార్థమా?
Posted in ParamarthaSatyam, Telugu on July 18, 2008 | Leave a Comment »
అణు ఒప్పందం అసలు సమస్యలు
Posted in ParamarthaSatyam, Telugu on July 10, 2008 | 1 Comment »
పరమార్థసత్యం జూలై 10, 2008
అణు ఒప్పందం అసలు సమస్యలు
అణుఒప్పందం వ్యవహారంలో అమెరికా షరతులను అంగీకరిస్తూ ముందుకుసాగడానికి ప్రభుత్వం నిర్ణయించుకోవడం, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యుపిఎ భాగస్వామ్యపక్షాలయిన వామపక్షాలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోవడం ఇవాళ్టి వార్త. ఇది ప్రధానంగా రాజకీయ సంక్షోభంగానో, భారత సార్వభౌమాధికార సమస్యగానో కనబడుతున్నది. ఇంకా కొంచెం ముందుకు వెళితే అది అణువిద్యుత్తు కు సంబంధించిన సాంకేతిక అంశంగా కూడ చూపి ఆ సాంకేతిక నిపుణులు తప్ప మరెవరూ ఆ విషయంలో నోరెత్తడానికి వీలులేదన్న వ్యాఖ్యలూ వినబడుతున్నాయి.
రాజకీయం, ఆర్థికం, అవకాశవాదం
Posted in ParamarthaSatyam, Telugu on May 21, 2008 | Leave a Comment »
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా ‘మీట్ ద ప్రెస్’ సమావేశాలలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు తమ అభిప్రాయాలను ప్రకటిస్తున్నారు. ఆ అభిప్రాయాలలో ఎక్కువభాగం ఊకదంపుడు మాటలు, ఎంతమాత్రమూ నమ్మని, ఆచరణలో పెట్టదలచుకోని ఆదర్శాలు, ఆత్మస్తుతి, పరనింద ఉంటాయి గనుక వాటిని పట్టించుకోనవసరం లేదు. కాని ఆ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు భారత
నాలుగేళ్లలో సాధించిందేమిటి?
Posted in Articles, ParamarthaSatyam, Telangana, Telugu on May 14, 2008 | Leave a Comment »
రాష్ట్రంలో డా. వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 మే 14 న అధికారం చేపట్టిన ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పాలనను పూర్తిచేసుకున్నది. ఈ నాలుగు సంవత్సరాలలో చాల లోతయిన రాజకీయ, సామాజిక పరిణామాలే జరిగాయి. రాజకీయంగా ఐక్యసంఘటన ప్రభుత్వంగా, మిశ్రమ మంత్రివర్గంగా మొదలయినదల్లా రెండుసంవత్సరాలు తిరగకుండానే ఏకపార్టీ పాలనగామారిపోయింది.
పందికొక్కుల ప్రేలాపనలు
Posted in ParamarthaSatyam, Telugu on May 7, 2008 | 1 Comment »
భారతీయులు ఎక్కువ తింటూ ఉండడం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా ఆహారపదార్థాల ధరల పెరుగుదల సంక్షోభం వచ్చిందని అమెరికన్ పాలకవర్గ ప్రతినిధులు కొత్తపాట ఎత్తుకున్నారు. నిజానికి ప్రపంచ జనాభాలో ఐదు శాతం కన్న తక్కువ ఉన్న అమెరికన్లు ప్రపంచవనరులలో 25 శాతం పైగా వాడుకుంటూ ఉండడంవల్ల, అమెరికన్లు తినగామిగిలి పారవేసే, తినడానికి పనికివచ్చే ఆహారపదార్థాలే రోజుకు రెండు లక్షల టన్నులు ఉండడం వల్ల, ఆహారపంటలకు వ్యతిరేకంగా అన్ని మూడో ప్రపంచదేశాలమీద రుద్దిన ప్రపంచీకరణ విధానాలవల్ల ఇవాళ్టి ఆహారకరువు ఏర్పడుతున్నదనే అసలు వాస్తవాన్ని దాచడానికి ఇతరులమీద ఇటువంటి దురహంకారపు నిందలు మోపడం అమెరికన్ పాలకవర్గాలకు అలవాటే.
పోలేపల్లి విషాదగాథల బాధ్యులెవరు?
Posted in ParamarthaSatyam, Telugu on April 23, 2008 | Leave a Comment »
అభివృద్ధిపథం అనబడేదానిమీద సరికొత్తవెలుగులు అందుకుంటున్నదెవరు? మరింత చీకట్లోకి కుంగిపోతున్నదెవరు? హైదరాబాదు అలంకరించుకున్న సరికొత్తనగ అనీ, హైదరాబాదును అంతర్జాతీయ స్థాయికి ఎగరేయబోతున్న అత్యాధునిక నిర్మాణమనీ ఊదరకొడుతున్న శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో,
ధరలు పైపైకి ఎక్కడికి వెళతాయి?
Posted in ParamarthaSatyam, Telugu on April 16, 2008 | 2 Comments »
ఎన్నికల సంవత్సరం మొదలయింది గనుక రాజకీయ పక్షాలన్నిటికీ ప్రజల మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకువస్తోంది. ప్రజాసమస్యల మీద ఆందోళనలకు దిగడమూ, ఆ సమస్యల పరిష్కారానికి చిట్కాలు తమదగ్గర మాత్రమే ఉన్నాయనీ, అవతలిపక్షం ఆ సమస్యలను పరిష్కరించజాలదనీ అనడమూ రోజురోజుకూ ధరల లాగ, పాపంలాగ పెరిగిపోతున్నాయి.
బియ్యం పథకం ఔదార్యం కాదు, అనివార్యం
Posted in ParamarthaSatyam, Telugu on April 10, 2008 | 4 Comments »
రాష్ట్రప్రభుత్వం మళ్లీ ఒకసారి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఇరవై ఐదు సంవత్సరాల కింద కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశిస్తూ ఎన్ టి రామారావు ప్రారంభించిన ఈ పథకం అప్పటినుంచి ఇప్పటివరకు అనేకమంది ముఖ్యమంత్రుల కింద అనేక రకాలుగా మారుతూ వచ్చి డా. వై ఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో మళ్లీ మొదటికి వచ్చింది. మహా ఆర్భాటంగా, ఎన్నికల ఎత్తుగడగా, ప్రతిపక్షాల విజయావకాశాలను చెదరగొట్టే అస్త్రంగా ఉనికిలోకి వస్తున్న ఈ పథకానికి రెండు వైపుల నుంచీ అతిశయోక్తులతో కూడిన ప్రశంసలూ విమర్శలూ చెలరేగుతున్నాయి. ఎద్దుల కుమ్ములాటలో లేగదూడల కాళ్లు విరిగినట్టు ఈ అతిశయోక్తుల యుద్ధంలో వాస్తవాలు, సరయిన విశ్లేషణలు, పథకపు అవసరం, పథకాన్ని విస్తరించవలసిన అవసరం అంతర్ధానమవుతున్నాయి.
కొత్త నిజాములది ఎవడబ్బ సొమ్ము?!
Posted in ParamarthaSatyam, Telugu on April 1, 2008 | 1 Comment »
రెండు మూడు రోజుల కింద పత్రికల్లో ఒక చిన్న వార్త వచ్చింది. లోపలిపేజీల్లో అప్రధానంగా వచ్చిన ఆ వార్త పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించి ఉండకపోవచ్చు. రాష్ట్రంలో పనిచేసిన ఒక మాజీ అత్యున్నతాధికారి రాజధానీ నగరంలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్ లో తన చేతిగడియారం పోగొట్టుకున్నారట.
గాలిమోటర్లఅడ్డా నిండా గాలి!
Posted in ParamarthaSatyam, Telugu on March 19, 2008 | 1 Comment »
హైదరాబాదులో ఏడు దశాబ్దాలుగా పనిచేస్తున్న బేగంపేట గాలిమోటర్ల అడ్డాను తోసిరాజంటూ కొత్త అడ్డా వచ్చింది. వారం రోజుల కింద యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ అధినేత్రి సోనియాగాంధీ ప్రారంభించిన ఆ అడ్డా అధికారిక పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. నిర్మాణ వ్యయం రు. 1418 కోట్ల అంచనాతో మొదలయి, త్వరలోనే రు. 1760 కోట్ల వ్యయ అంచనాకు చేరినాక పనులు మొదలయి, ప్రస్తుతానికి రు. 2,478 కోట్ల వ్యయంతో ముగిసింది.