తెలంగాణ జనహృదయ వ్యక్తీకరణ

తెలంగాణ ప్రజానీకంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలున్నాయా లేవా అని ఢిల్లీలో కూచున్న దిగ్విజయ్‌సింగ్ నుంచి హైదరా బాదు చుట్టుపట్ల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలున్న వాళ్ళవరకూ అనేక మంది తమ అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. అటు హస్తినాపురి నుంచీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి కూడా ఎందరో విశ్లేషకులు, ఎప్పు డూ తెలంగాణ ముఖమైనా చూసి ఉండనివాళ్ళూ, కళ్ళకు గంతలు కట్టుకుని కండక్టెడ్ యాత్రలలో తిరిగిపోయేవాళ్ళూ అసలు తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయని చెప్పలేమని ప్రకటిస్తున్నారు.

తెలంగాణపట్ల తెలంగాణ వాసులలో ఎంత ప్రేమాభిమానాలున్నా యో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో తొమ్మిదిజిల్లాలలోనూ స్వయంగా చూసి, అనుభవించి వచ్చిన తరు వాత ఆ నాయకుల, విశ్లేషకుల అభిప్రాయాలు వింటుంటే నవ్వుపుడు తోంది. జీవో నెం. 610 మీద గిర్‌గ్లానీ కమిషన్ సిఫారసుల మీదా తన సభ్యులకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసు కున్న తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మార్చి 25న ప్రారంభించి ఆగస్టు 11 వరకు తొమ్మిది జిల్లాలలోను జిల్లాస్థాయి సద స్సులు నిర్వహించింది. మార్చి 25న సంగారెడ్డిలో, ఏప్రిల్ 4న మహ బూబ్‌నగర్‌లో, ఏప్రిల్ 20న వికారాబాద్‌లో, మే 17న కరీంనగర్‌లో, జూన్8న నల్లగొండలో, జూన్ 22న ఖమ్మంలో, జూలై 6న నిజామా బాదులో, జూలై 13న హనుమకొండలో, ఆగస్టు 11న ఆదిలాబాదులో ఈ సదస్సులు జరిగాయి. టిఎన్‌జివోస్ యూనియన్ అధ్యక్ష, కార్యద ర్శులు సుధాకర్ స్వామిగౌడ్, తెలంగాణ మేధావులు జయశంకర్, శ్రీధరస్వామి, కోదండరామ్, లక్ష్మణ్, సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, సంధ్య తదితరులతోపాటు ఈ తొమ్మిది సభలలో ఎనిమిదింటిలో పాల్గొని ఉపన్యసించే అవకాశం నాకు దొరికింది. ఆ అన్ని సభలలోనూ ప్రభుత్వోద్యోగులతోపాటు విద్యార్థి, యువజనులు, రైతులు, కార్మికులు, స్త్రీలు కూడా ఎందరో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా కనీసం ముప్ఫైవేల మంది ఆ సదస్సులలో పాల్గొని ఉంటారు.

అటువంటి ప్రతి సభలోనూ తెలంగాణ ఆకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ అనే పదం వినిపిస్తేనే సభ అంతా విద్యుచ్ఛకితం అయి పోవడం, రక్తం పోట్లేత్తేలా నినాదాలు పెల్లుబకడం కళ్ళారా చూశాను. దాదాపు ప్రతి సదస్సూ గంటలపాటు- ఒక సందర్భంలో ఏడెనిమిది గంటలు జరిగినా సభికులు అత్యంత శ్రద్ధతో తెలంగాణకు జరిగిన అన్యాయాలను వినడం, ఆ అన్యాయాలకు పరిష్కార మార్గాల గురించి ఆలోచించడం, ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారమని నినదించడం చూశాను. ఒక సభలో ఒక గాయకుడు పొరపాటున ఐక్యత గురించి ఒక చరణం పాడితే సభికులందరూ ఒక్కుమ్మడిగా లేచి అతణ్ని దించేశారు. దేశపతి శ్రీనివాస్, సంధ్యలు తెలంగాణ పాటలు పాడుతుంటే సభ మొత్తం కోరస్ ఇచ్చి తెలంగాణ ఆకాంక్షల బృందగానాలు వినిపించారు.

ప్రధానంగా ఉద్యోగుల సభలుగా, ఉద్యోగులకు పరిమితమైన ఒక జీవో గురించీ, ఆ జీవో అమలు కోసం వేసిన అధికార కమిషన్ సిఫా రసుల గురించీ మాట్లాడుకునే సదస్సులుగా మొదలయినవల్లా అన్ని చోట్లా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాంఛా ప్రకటన సభలు ముగిశాయి.

ఇదంతా ఉట్టి, భావోద్వేగమని, రెచ్చగొట్టే ఉపన్యాసాలుంటే మామూలు సభలు కూడా ఇట్లా మారవచ్చునని శంకించేవాళ్ళూ ఉండ వచ్చు. కానీ ఈ తొమ్మిది సభల్లో మొత్తం సాగిన దాదాపు యాభై ఉప న్యాసాలలో పదిశాతం కూడా రెచ్చగొట్టే ఉద్రేకపూరిత, ఉద్వేగభరిత వ్యాఖ్యలు లేవు. వక్త తరువాత వక్త చరిత్రతో, గణాంకాలతో, అన్యా యాల, ఉల్లంఘనల వివరాలతో తెలంగాణ పట్ల అనులయిన వివక్షను వివరించారు. యాభై సంవత్సరాల చరిత్రలో సాగిన అక్రమాలను చెప్పారు. పెద్ద మనుషుల ఒప్పందంతో పుట్టిన రాష్ట్రంలో ఎన్ని హామీ లను, ఒప్పందాలను ఉల్లంఘించడం జరిగిందో చెప్పారు. ఒక్క మాట లో చెప్పాలంటే అవి వక్తలకూ, శ్రోతలకూ కూడా అవగాహనా సదస్సులే.

అసలు 1969 ఉద్యమానికీ, ప్రస్తుతం సాగుతున్న ఉద్యమానికీ గుణాత్మకమైన తేడా అదే. గతంలో ఎక్కువ భావోద్వేగపూరితంగా జరి గిన ఉద్యమం ఇప్పుడు ఆలోచనలను పెంచుకుంటోంది. పదును పెట్టుకుంటోంది. విస్తరించుకుంటోంది. విశ్లేషణతో ముందుకు సాగు తోంది.
అందువల్లనే 1969 ఉద్యమం ప్రధానంగా విద్యార్థులలో, ఉద్యోగు లలో మాత్రమే రగలగా ఈసారి దానికి అన్నివర్గాల లోను, అన్ని సమస్యల మీద, అన్ని జీవన రంగాలలో వ్యాప్తి దొరికింది. ప్రత్యేక రాష్ట్ర వాంఛకు ఎన్నెన్ని కోణాలలో వ్యక్తీకరణకు అవకాశం ఉందో అన్ని కోణా ల వ్యక్తీకరణ సాగుతోంది. ఆలోచన, ఆవేశం సమ పాళ్ళలో ఉండవలసినంతగా ఉన్న ఉద్యమం ఇది.

అసలు 1996నుంచి సాగుతున్న ప్రస్తుత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వెలికివస్తున్న సాంస్క¬ృతిక ప్రజ్వలనాన్ని చూస్తే దాని విస్త¬ృతి తెలుస్తుంది. ఈ ఉద్యమం ఎంతమంది కవులను, రచయితలను, కళా కారులను, గాయకులను, ఉపన్యాసకులను, విశ్లేషకు లను బైటికి తీసుకువచ్చిందో చూస్తే, ఈ ఉద్యమం ఏమి సాధించినా సాధించకపోయినా ఈ నేలమీద గొప్ప సృజనాత్మక వికాసానికి కారణమయిందని పిస్తుంది.

ఇదంతా ఇంత నిజమయితే ఎన్నికల ఫలితాలలోకి ఎందుకు తర్జు మా కాలేదు అని దిగ్విజయ్‌సింగ్ అడుగుతున్నారు. ఈ దేశంలో నిజమైన ప్రజాసమస్యలు, ఆ సమస్యల పరిష్కారాలు ఎన్నికల ఎజెం డా మీదికి రావడం, వ్యక్తీకరణ పొందడం ఎప్పుడన్నా పూర్తిగా జరి గిందా? ఎన్నికల ఫలితాలు నిజమైన ప్రజాభిప్రాయ సూచికలుగా ఉన్నాయా? డబ్బు, మద్యం, కులం, పెత్తందారీతనం, హింస, రిగ్గింగ్ అనే జల్లెడల వెనుక ఆగిపోతున్న ప్రజాభిప్రాయం ఎంత? అందులో నూ తెలంగాణ ఆకాంక్షలకు గుత్తెదారులమని చెప్పుకుంటున్న పార్టీల పనితీరు అసంతృప్తికరంగా ఉన్నవేళ ఎన్నికల ఫలితాల ద్వారా తెలం గాణ ఆకాంక్షల బలాన్ని కొలవజూడడం, నిర్ధారణలు ప్రకటించడం ఎంత లౌక్యం! నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలేమిటో తెలుసుకోవాలంటే, అర్థం చేసుకోవాలంటే తెలంగాణ జన హృదయాన్ని చదవాలి. ఎన్జీ వోల సంఘం సదస్సుల మినీ జైత్రయాత్రలో వ్యక్తమయింది ఆ జన హృదయమే.

( ఆంధ్రజ్యోతి మంగళవారం ఆగస్ట్ 15 ‘ 2006 )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s