తప్పిపోయిన ఎన్‌కౌంటర్

ఒక ఎన్‌కౌంటర్ హత్య తప్పిపోయింది. గురువారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో సిపిఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్నను, ఆయనతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశామని యాభై ఆరుగంటల తర్వాత శనివారం సాయంత్రం పోలీసులు ప్రకటించారు. అటువంటి సందర్భాలలో వందలాదిసార్లు చేసినట్టుగా తమ అధీనంలో ఉన్నవారిని కాల్చిచంపి ఎన్‌కౌంటర్ కథ అల్లకుండా ఈ సారికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమకు చట్టబద్ధపాలన అనేది ఏడాదికోసారయినా గుర్తుకొస్తుందని చూపుకున్నారు. అయితే ఇప్పటికీ ఈ ఉదంతంలో అడగవలసిన ప్రశ్నలెన్నో మిగిలే ఉన్నాయి.

మొట్టమొదట, సిపిఐ (ఎంఎల్) జనశక్తి నిషిద్ధపార్టీ కాదు. గత సంవత్సరం రాష్ట్రంలో సిపిఐ (మావోయిస్టు)ను, మరికొన్ని ప్రజాసం ఘాలను నిషేధించినప్పుడు కూడా జనశక్తిని నిషేధించలేదు. అలా నిషేధం లేనిపార్టీమీద రాష్ట్రాలకు రాష్ట్రాలు వెంటాడి వేధించడం ఏ చట్ట ప్రకారం చెల్లుతుంది? జనశక్తిపార్టీమీద నిషేధం లేకపోయినా, విడిగా వ్యక్తుల మీద ఎవయినా నేరారోపణలుంటే, వారు తప్పించుకుని తిరు గుతుంటే వెంటాడి పట్టుకోవచ్చు గాని ఇప్పుడు అరెస్టయిన ఐదుగురి లో కనీసం నలుగురిమీద ఇంతకుముందు కేసులు లేవు.

జనశక్తిపార్టీ ఒకప్పుడు సిపిఐ (ఎంఎల్) విమోచనగా ఉన్న రోజుల నుంచీ విద్యావంతులలో, మేధావివర్గంలో బలమైన ప్రభావం చూ పింది. 1970లలో సిరిసిల్ల రైతాంగపోరాటాన్ని నిర్మించింది. గోదావరి లోయలో ప్రతిఘటనోద్యమాన్ని నిర్మించింది. ఎమర్జెన్సీ తరువాత పార్లమెంటరీ వేదికలను ఉపయోగించుకోవాలనే ఆలోచనతో శాసన సభ, లోక్‌సభ ఎన్నికలలో పాల్గొంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక టికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. స్వయంకృతమైన చీలికల వల్లనో, ప్రభుత్వ నిర్బంధం వల్లనో కొంత బలహీనపడినట్టు కనిపిం చినప్పటికీ 2004 అక్టోబర్‌లో మావోయిస్టు పార్టీతో కలిసి ప్రభుత్వంతో శాంతిచర్చలలో పాల్గొంది. చర్చలు విఫలమయిన తరువాత, ప్రతి నిధిగా పాల్గొన్న రియాజ్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి కరీంనగర్ జిల్లాకు తీసుకుపోయి కాల్చిచంపినప్పటికీ, పార్టీమీద నిషేధం విధిం చాలని ప్రభుత్వం అనుకోలేదు.

ఇక ఆ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శిని కలవడానికి వెళ్ళి అరెస్టయి ఇప్పుడు అనేక కేసులలో ఇరికించబడుతూ ఆరోపణలు ఎదుర్కొం టున్న ఎర్రంరెడ్డి నరసింహారెడ్డి జీవితమంతా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. బాధ్యతాపరుడైన సామాజిక ఆలోచనాపరుడుగా ఉపా ధ్యాయ ఉద్యమంలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్య క్షుడిగా చాలా కాలంపాటు బాధ్యతలు నిర్వహించారు. కొన్ని వేల మంది ఉపాధ్యాయులకు నాయకుడుగా ఉన్నారు. ఉపాధ్యాయ సమ స్యల పరిష్కారంకోసం అన్ని పార్టీల రాజకీయ నాయకులను, విద్యా మంత్రులను, ముఖ్యమంత్రులను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది సమావేశాలలో పాల్గొని ఉపన్యసించారు.

అటువంటి పార్టీ నాయకులను, అటువంటి ఉపాధ్యాయ నాయకు డిని ముందస్తుగా ఏ నేరారోపణా లేకుండా వెంటాడడం, ఎక్కడో మరె వరికీ సమాచారం అందకుండా పట్టుకోవడం, కళ్ళకు గంతలు కట్టి, ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియకుండా తిప్పడం…ఇవన్నీ ఏ చట్టం నిర్దేశించిన పనులో పోలీసులు వివరించవలసి ఉంటుంది. వాళ్ళు అరె స్టయిన వార్త బైటకిపొక్కి ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన ప్రారంభమయిన తరువాతగాని పోలీసులు ఎన్‌కౌంటర్ ఆలోచన విరమించుకున్నట్టు లేరు. అరెస్టయి తమ నిర్బంధంలో ఉన్నవారిని చంపివేయకుండా న్యాయస్థానం ముందు హాజరుపరచాలని బంధుమిత్రులు కోరితే, ‘వారికి ప్రాణహాని జరగదని నేను హామీ ఇచ్చాక పోలీసులేమయినా పిచ్చిపని చేస్తే ఎలా?’ అని హోంమంత్రి అన్నారని పత్రికలు రాశాయి. అంటే ఒక శాఖమంత్రిమాట వినని స్థితిలో ఆ శాఖ ఉద్యోగులు ఉన్నా రన్నమాట. ఇది నక్సలైట్ల సమస్య కాదు, మన పార్లమెంటరీ ప్రజాస్వా మ్యంలో రాజకీయ నాయకుల సాధికారత సమస్య!

ఇంక, అంతకన్న ప్రమాదకరంగా-న్యాయస్థానంలో హాజరుపరచ మని కోరడాన్ని -పోలీసు అధికారుల సంఘం తప్పుపట్టింది. పోలీసు వ్యవస్థ బాధ్యత నేరపరిశోధన, నేర విచారణ, నేర నిరూపణ మాత్రమే గాని శిక్షవిధింపు కాదు. రాజ్యాంగం ఆ బాధ్యతను న్యాయవ్యవస్థకు ఇచ్చింది. కాని పోలీసు వ్యవస్థ తానే న్యాయవ్యవస్థ అధికారాలను కైవ సం చేసుకుని, నేర పరిశోధన, నిరూపణ ఏమీ లేకుండానే ఎంతోమం దికి మరణశిక్ష విధించి అమలు చేస్తోంది. బారా బంకి ఖైదీల విషయంలో కూడ అలా జరుగుతుం దేమోనని ఆందోళన పడటం సహజమే. అది అన వసర జోక్యం కాదు. ఎవరి బాధ్యతలను వారికి గుర్తుచేయడం. బాధ్యతలను విస్మరించే వారికే మరొకరు గుర్తుచేసినప్పుడు ఉక్రోషం వస్తుంది.

ఈ అరెస్టు వ్యవహారంలో మరొక విచిత్రం కూడా జరిగింది. శనివారం సాయంత్రం పత్రికా సమావేశంలో అరెస్టు విషయాన్ని ప్రకటించిన పోలీసులు అప్పటికి రోజున్నరముందు ప్రజాసం ఘాలు చెప్పిన అరెస్టు సమయాన్ని, స్థలాన్ని ధ్రు వీకరించారు. ఈ ధ్రువీకరణ వల్ల అరెస్టయిన వారి ని యాభైగంటలకు పైగా తమ అదుపులో ఉంచు కున్నట్టు చెప్పకనే చెప్పారు. కానీ రాజ్యాంగం 22వ అధికరణ -పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న ఏ వ్యక్తినయినా 24 గంటలలోపు ‘అత్యంత సమీపం లోని’ మేజిస్ట్రేటు ముందర హాజరు పరచాలని- నిర్దేశిస్తోంది. బారాబంకిలోనో, లక్నోలోనో మేజిస్ట్రేటు ముందర హాజ రుపరచరడానికి వారిమీద కేసులేవీ లేవు గనుక, అప్పటికప్పుడు సృష్టించలేరు కనుక, ఇంతకూ దారిలో ఎక్కడో వారిని చంపివేయాలని కూడా అనుకున్నారు గనుక- ఆ సమీపంలోని మేజిస్ట్రీటు ముందర హాజరు పరచలేదు. ఈ లోగా అరెస్టు వార్త బైటికి పొక్కి ఆందోళన ప్రారంభమైయింది కనుక ఇక తప్పనిపరిస్థితులలో అరెస్టు ప్రకటిం చారు.

ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీ కేంద్రకమిటీ నాయకుడి విషయం లో, విస్త¬ృత ప్రజాజీవనం ఉన్న ఒక ప్రధాన ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడి విషయంలోనే ఇంతగా ఉల్లంఘనకు, వక్రీకరణకు గురవు తున్న చట్టబద్ధపాలన, ఏ ఆధారమూ లేని కోట్లాదిమంది అమాయక ప్రజలకు అందుతుందనుకోగలమా?

( ఆంధ్రజ్యోతి మంగళవారం, 05 సెప్టెంబర్ 2006 )

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s