మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు

దేశంలోని అసంఖ్యాక జనబాహుళ్యంపట్ల వర్ణాశ్రమధర్మ దుర్మార్గాన్ని సైద్ధాంతీకరించిన మనుస్మృతికీ, సమసమాజ భావనను, సామాజిక న్యాయాన్ని ప్రతిపాదించిన రాజ్యాంగం కింద నడవవలసిన సుప్రీంకోర్టుకూ ఏమీ తేడా లేదని గత శుక్రవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రకటిస్తున్నాయి. శూద్రులకు విద్యను నిషేధించిన రెండువేల ఏళ్లకింది మనుస్మృతినే మరొక మాటల్లో అనుసరించిన ఆధునిక, సర్వసత్తాక, ప్రజాస్వామిక, లౌకిక రాజ్యపు సుప్రీంకోర్టు ఈ దేశంలో ఉన్నత విద్యావకాశాలమీద గుత్తాధిపత్యం అగ్రవర్ణాలదేనని మరొకసారి చెప్పింది. జస్టిస్‌ అరిజిత్‌ పసాయత్‌, జస్టిస్‌ లోకేశ్వర్‌ సింగ్‌ పంతా తమ మధ్యంతర ఉత్తర్వులద్వారా సుప్రీంకోర్టుకు ఈ దేశ చరిత్రతో, సామాజిక న్యాయ భావనతో, సహజ న్యాయసూత్రాలతో, చివరికి రాజ్యాంగ స్ఫూ ర్తితో కూడా ఏమీ సంబంధం లేదని ప్రకటించుకున్నారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారంనాడు ఇచ్చిన ఉత్తర్వులు 2006లో పార్లమెంటు ఆమోదించిన ‘ది సెంట్రల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ (రిజర్వేషన్‌ ఇన్‌ అడ్మిషన్‌) ఆక్ట్‌’లో ఆరవ సెక్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేయడానికి ఉద్దేశించినవి. ఆ తాత్కాలిక నిలిపివేతకు వారు ఏవో తమకు తోచిన కారణాలు కూడా చెప్పారు. కానీ ఆ కారణాలేవీ వాదనకు నిలిచేవికావు. సెక్షన్‌ 6 అనేది 2007 విద్యాసంవత్సరం నుం చి ఉన్నత విద్యాసంస్థలలో రిజర్వేషన్‌ అమలు చేయడానికి ప్రతిపాదించింది గనుక ఆ సెక్షన్‌ను మాత్రం నిలిపివేయమని ఆదేశిస్తున్నామని, మొత్తం చట్టం మీద, ప్రత్యేకించి షెడ్యూల్డ్‌ కులాలకు, షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్‌ ఇవ్వడం మీద తమకు ఏమీ అభ్యంతరం లేదని, వారికి రిజర్వేషన్‌ ఇవ్వడం రాజ్యాంగబద్ధమని, 1931 జనగణన తర్వాత వెనుకబడిన తరగతుల సంఖ్య కచ్చితంగా లేదుగనుక వెనుకబడిన తరగతుల రిజర్వేషన్‌ మీద ఆంక్షలు విధిస్తున్నామని న్యాయమూర్తులు అన్నారు.

ఈ మధ్యంతర ఉత్తర్వులకు దారితీసినవి కొన్ని ప్రజాప్రయోజనవ్యాజ్యాలు. ఒక న్యాయవాది, అఖిలభారత వైద్యశాస్త్రాల సంస్థ, మౌలానా ఆజాద్‌ వైద్యకళాశాలలకు చెందిన వైద్యుల సంఘాలు, ‘యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ’ అనే సంస్థలు వేసిన వ్యాజ్యాలివి. ఒక సుప్రీంకోర్టు న్యాయవాది, దేశ రాజధానిలోని రెండు ప్రతిష్ఠాత్మక వైద్యశాలల వైద్యులు, సమానత్వం కోసం పోరాడే యువకులమని తమను తాము పిలుచుకుంటున్న యువకులు ఇంత దుర్మార్గంగా, సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే వివాదాన్ని రేకెత్తిస్తున్నారంటే, దేశంలో మానవీయ విలువలు ఎట్లా చివికిపోతున్నాయో అర్థమవుతుంది.

పైకి చూడడానికి ఇదేదో న్యాయపరమైన చిక్కుగానూ, చాల సాంకేతికమైన వ్యవహారంగానూ అనిపిస్తుందిగాని వాస్తవంగా ఇది ఈ దేశ చరిత్రలో వేల ఏళ్లుగా సాగుతున్న దుర్మార్గానికి కొనసాగింపు మాత్రమే. ఉన్నత స్థానాలలో ఉన్నవారిలో గూడుకట్టుకుని ఉన్న అగ్రవర్ణ ఆధిపత్య భావజాలానికి ఇది ఒక సూచన మాత్రమే. నిజం గా ఈ దేశ చరిత్రనూ సంస్క­ృతినీ నిర్మించినవారిపట్ల నిరాదరణ చూపాలనీ, వారికి న్యాయంగా దక్కవలసిన సామాజిక అభివృద్ధిఫలాల వాటాను నిరాకరించాలనీ, వారికి వేల ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే కనీస చర్యలు కూడా చేపట్టగూడదనీ ఆ అగ్రవర్ణ భావజాలం భావిస్తుంది. అందుకే ఆ భావజాలం రిజర్వేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తుంది.

నిజానికి రిజర్వేషన్‌ విధానం పేరుమీద కొనసాగుతున్నది రిజర్వేషన్‌ కాదు. అది వేల ఏళ్లుగా అగ్రవర్ణాలకు కొనసాగుతున్న రిజర్వేషన్‌ను సరిచేసే డిరిజర్వేషన్‌ విధా నం అవుతుంది. ఇన్నాళ్లూ విద్యనూ, ఉద్యోగాలనూ, సంపదనూ, అధికారాన్నీ హక్కుభుక్తం చేసుకుని కూచున్న పిడికెడు మంది అగ్రవర్ణాలకు జనాభా నిష్పత్తిలో వారివాటా వారికి ఉంచి, ఇన్నాళ్లూ తమ న్యాయమైన భాగం పొందలేకపోయిన వర్గాలకు ఆ వాటా అందించడమే రాజ్యాంగం ఆమోదించిన రిజర్వేషన్‌ విధాన స్ఫూర్తి. దళితులకూ, ఆదివాసులకూ అయితే వారి జనాభా నిష్పత్తిని బట్టి రాజ్యాం గమే నేరుగా 15 శాతం, 7.5 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. సామాజికంగా, ఆర్థికం గా వెనుకబడిన తరగతుల గురించి మాత్రం స్థూలంగా ఆదేశిక సూత్రాలలోని అధికరణం 46లోనూ, నిర్దిష్టంగా అధికరణం 340లోనూ ప్రస్తావించడం జరిగింది.

రాజ్యాంగం కూడా ‘వెనుకబడిన కులాలు’ అనకుండా ‘వెనుకబడిన తరగతలు’ అనడంలో కొంత అస్పష్టత ఉందిగాని, నిజానికి ఈ మాటకింద రాజ్యాంగ నిర్మాతలు ప్రధానంగా సూచించదలచుకున్నది చాతుర్వర్ణ వ్యవస్థలోని శూద్ర కులాలను. ద్విజులుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు సకల సౌకర్యాలనూ, సంపదనూ, విద్యనూ రిజర్వ్‌ చేసిన మనువు శూద్రకులాలకు విద్యను నిషేధించాడు. ఇతర వర్ణాలతో కలవడాన్ని నిషేధించాడు. చిన్న తప్పులకు కూడా కఠిన శిక్షలు ప్రతిపాదిం చాడు. నిజానికి వీరు వ్యవసాయదారులు, చేతివృత్తులవారు. సకల ఉత్పత్తికులాల, సేవాకులాల వారు. శరీరకష్టం మీద ఆధారపడే సహస్రవృత్తుల వారు. ఎవరి కృషి వల్ల, నిత్యజీవితాచరణవల్ల, ప్రయోగాలవల్ల, ఉత్పత్తివల్ల వేల సంవత్సరాలుగా భారత సమాజం తల ఎత్తుకుని నిలబడ్డదో వాళ్లపేరు ఇవాళ వెనుకబడిన కులాలు.

దేశంలో వారి జనాభా ఎంతో 1931 తర్వాత ప్రత్యేక జనగణన జరగలేదు కాబట్టి తెలియదనడం నిజమే. కానీ, 1931లో వెనుకబడిన కులాల జనాభా మొత్తం దేశ జనాభాలో 52 శాతంగా ఉండింది. ఆ తర్వాత గడిచిన డెబ్బై సంవత్సరాలలో మిగిలినవర్గాలన్నిటి జనాభా నిష్పత్తి అదే విధంగా ఉన్నందువల్ల వెనుకబడిన కులాల జనాభా ఇవాళకూడా 52 శాతమే ఉండవచ్చు. లేదా మూడునాలుగు శాతం ఎక్కు వో తక్కువో ఉండవచ్చు. 1953లో ఏర్పాటయిన కాకా కాలేల్కర్‌ కమిషన్‌ (1953 -55), 2399 వెనుకబడిన కులాల జాబితా తయారుచేసి, రిజర్వేషన్ల కల్పనకు, వెనుకబాటుతనానికి ఒక సూచికగా కులాన్ని గుర్తించాలని సూచించింది. కాలేల్కర్‌ సిఫారసులను ప్రభుత్వం చెత్తబుట్టకు దాఖలు చేసింది. ఆ తర్వాత ఏర్పాటయిన బిపి మండల్‌ కమిషన్‌ (1979-80) దేశంలో వెనుకబడిన కులాల జనాభా 52 శాతం అని చెబుతూనే వారికి 27 శాతం రిజర్వేషన్లు మాత్రం కల్పించాలని సిఫారసు చేసిం ది. ఆ నివేదికను ప్రభుత్వాలు పది సంవత్సరాలు తొక్కిపెట్టి తర్వాత, అమలు చేయడానికి విపి సింగ్‌ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు దేశంలో అగ్రవర్ణ యువకులు ఏ విధంగా స్పందించారో అందరికీ తెలుసు.

ఈ మొత్తం చరిత్రలో తెలుస్తున్నదేమంటే, ఈ దేశంలో కనీసమైన సామాజిక న్యా యకల్పనకు మన ఆలోచనలు ఇంకా సిద్ధంగా లేవు. ఇంకా మనువే మన మనుసుల మీద విలయనాట్యం చేస్తున్నాడు. లేకపోతే, ఇరవై శాతానికి మించని అగ్రవర్ణాల చేతిలో అరవై శాతం విద్యావకాశాలు, ఉద్యోగాలు, సంపద, అధికారం ఉండడమేమిటి? యాభై శాతానికి మించిన వెనుకబడిన కులాలకు ఇరవై శాతం వాటాకూడా దక్కకపోవడమేమిటి? వారి జనాభాలో కనీసం సగం నిష్పత్తిలోనైనా రిజర్వేషన్‌ కల్పించాలంటే ఇంత వ్యతిరేకత ఏమిటి? ఎవరికైనా వారి జనాభాను బట్టి, దేశ ఉత్పత్తి క్రమంలో వారి భాగస్వామ్యాన్నిబట్టి ఫలాలు దక్కవలసి ఉండగా ఇంత అసమానత ఏమిటి? తమను తాము విద్యావంతులమనీ, బుద్ధిమంతులమనీ, సంస్కారులమనీ అనుకునేవారు ఆలోచించనవసరం లేదా?

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu, Vartamaanam. Bookmark the permalink.

7 Responses to మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు

 1. నాకు కొన్ని చోట్ల మీ తర్కం అర్ధమే కాలేదు. మీరు రిజర్వ్షేషన్లను సమర్ధించండి. కాని, మీరు ఆశించిన ప్రయోజనం ఎవరికో ఒక్క సారి ఆలోచించండి. అగ్రవర్ణాలని తప్పు బట్టడం, సుప్రీమ్ కోర్టుని ఒక అకడమిక్ ప్రక్రియ లాగా దుయ్యబట్టడం వల్ల ఏం ఆశిస్తున్నారో? ఉదా. రాజ్యంగం వెనుక బడిన తరగతులు అంది, వెనుక బడిన కులాలు అని, అంటే శూద్రులని దాని ఉద్దేశ్యం అన్నారు. శూద్రులు అంటే- మిరు వ్యాసంలో చెప్పినట్లు- మన కమ్మవారు, కాపువారు, నాయుళ్ళూ వగైరా కులాలు శూద్రులే అవుతారు, తెలుసనుకొంటాను. వాళ్లకి కూడా రిజర్వేషన్లు కల్పించాలనా మీ వాదమ్. తరగతి వేరు, కులం వేరు. కులం కులం అని ఎంత కాలం దాన్ని ఆరకుండా ఉంచుదామనుకోంటున్నారు. రిజర్వేషన్ల ఉద్దేశ్యం మనువాదాన్ని రివర్సు లో అమలుచేద్దామనా? ఎప్పుడో ఒక వర్గం వారు వేరే వాళ్ళని అణగదొక్కితే (వారెవ్వరు ఇప్పుడు బతికి లేరు, ఇప్పుడు బతికున్న వాళ్ళు కోరి ఆయా కులాల్లో పుట్టలేదు, వాళ్ళమీద కత్తి కట్టడం ఏరకమైన సామాజిక న్యాయం?), ఇపుడు వీళ్ళు వాళ్ళని అణగదొక్కడం, మాళ్ళీ చరిత్ర పునరావృతం అవడమ్- దీన్నించి మన దేశానికి ఎప్పుడు నిష్కృతి? మాతాతలు నేతులు తాగారో, మూతులు నాకారో నాకు తెలియదు. మా తరం మాత్రం ఈ కులం మతం అంటే రోత పుట్టిన వాళ్ళం. దేశ ముందుకు పోవాలనే ఢోరణిలో ఉన్న వాళ్ళం- ఎందుకంటే, మేం ప్రపంచాన్నిచూస్తున్నాం. మేం కూడా దానితో పాటే ప్రయాణీంచాలనుకొనే వాళ్ళం. అభివృద్ధికోసం పోటీ పడవల్సిన అవసరం ఉన్న వాళ్ళం. వెనుకబడడం మాకిష్టం లేదు.

  నిజంగా రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం చేరాల్సిన వాళ్ళకి చేరుతోందా? నా ఎరికలో రిజర్వేషన్ల వల్ల ప్రతీ సామాజిక తరగతిలోనూ ఒక చిన్న వర్ణవ్యవస్థ ఏర్పడింది. ప్రతీ కులంలోనూ ‘అగ్రవర్ణాలవారు’ పుట్టుకొచ్చారు. వారు వారి వారి తర్గతుల్లోని మిగిలిన వారి కన్నా ఒక మెట్టు పైన ఉండి తమ ప్రత్యేకతను నిలబెట్టుకోంటూ, ప్రయోజనాలను కిందికి చేరనీయ్యరు. ఇంకోక పరిణామం ఏమిటంటే, అనేక పోస్టుల్లో వెనుకబడిన తరగతులవారిని వేయడం వల్ల, ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రులు, ఇతర ప్రజా సంబంధమైన సేవా సంస్థల్లోనూ, వెనుకబడిన, గ్రామీణ ప్రజానీకానికే చాలా నష్టం కలుగుతోంది. పైన చెప్పిన ‘నవ అగ్రవర్ణాలవారు’ కానీ, మిగిలిన వారు కాని ప్రభుత్వాసుపత్రులకి ఈరోజుల్లో వెడుతున్నారా? మా చిన్నప్పుడు ప్రభుత్వాసుపత్రికే వెళ్ళేవాళ్ళం, ప్రభుత్వ సేవలే తిసుకొనేవాళ్ళం. ఇప్పుడు అలా జరగట్లేదు. ఒక చిన్న సవాలు. రిజర్వేషన్లు ప్రతిపాదించేవారు, రాజకీయనాయకులు, వారి కుటుంబాలతో సహా ఒక నియమంగా కేవలం ప్రభుత్వాసుపత్రులకే వెళ్ళాలి. ప్రభుత్వ రంగ సేవాలే వినియోగించుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే, ఒక వెనుకబడిన కులాని (నేను తరగతి అంటాను)కి చెందిన వైద్యుడు, నర్సు, టెక్నీసియన్ల సేవలు మాత్రమే పొందాలి. ఎవరూ ఒప్పుకోరు- ఎందుకంటే అందరికీ తెలుసు లోగుట్టు. ఈ రిజర్వేషన్ల మీద ఎవరికీ చిత్తశుద్ధిలేదు. రిజర్వేషను కల్పించి ఒక ఉన్నత విద్య, ఒక ఉద్యోగం కల్పిస్తే దాని వల్ల ప్రయోజనం ఉంటుందా? అలా కల్పించ బడ్డవాళ్లని empower చేయాల్సిన పనిలేదా. వాళ్ళు నిరంతరం మిగిలిన వాళ్ళ వద్ద న్యూనతగా ఉండాలా? వాళ్ళల్లో కొంతమందే తరాలుగా ఈ ప్రయోజనాలు పోందుతూ ఉంటే మిగిలిన వాళ్ళ పనేమి కాను.
  చిత్త శుద్ధి ఉంటే ఇన్నేళ్ళ తర్వాత కూడా వెనుకబడిన తనమ్ ఎందుకుంటుంది? అంటే ఏవో అవసరమైన పధకాలు, అమలు చెయ్యాల్సిన విధంగా చేయబడట్లేదు అనే కద? వాటిని మనం సమిక్షించాలి. మీరు ఆలోచించగల్గిన వాళ్ళు. మీరుకూడా గుంపుతో గోవిందా అనకుండా ఏ కారణంగా మనం మన ధ్యేయాన్ని సాధించలేక పొయామో బేరీజు వేసి ఒక వ్యూహాన్ని ప్రతిపాదిస్తే బాగుంటుంది. పదే పదే ఏదో ఒక వర్గాన్ని తప్పు పడుతో కూచొంటే ఏం ఒరుగుతుంది?

 2. నా ప్రశ్నలు :

  1.ఒక వ్యక్తి తన కులవృత్తిని అనుసరించడంలో తప్పేంటి ? అందులో అంత అవమానపడాల్సింది ఏముంది ? అలా తన కులవృత్తిని అనుసరించిన ప్రతి వ్యక్తీ వెనకబడినట్లా ? అన్యాయనికి దోపిడీకి గురైనట్లా ? మనం మనుషుల్లో పెంపొందించాల్సింది ప్రోత్సహించాల్సింది దేన్ని ? Dignity of labour నా ? లేక అందరూ అన్ని ఉద్యోగాలకి ఎగబడడాన్నా ? రెండోదే మీ అభిప్రాయమైతే వృత్తులు చేసుకునే వారందరినీ అవి మానెయ్యండని చెప్పి ఉద్యోగాల్లోకి ఆహ్వానించగల సత్తా ఈ ఆర్థిక వ్యవస్థకి ఉందా ?

  2.ఉద్యోగాన్ని (దాన్ని నిర్వహించగల) సమర్థులకి ఇవ్వాలా ? లేక సామాజిక న్యాయం పేరుతో తలలు లెక్కగట్టి మెజారిటీ వర్గాలకి చెందుతారనే ఏకైక కారణంతో వోట్ బ్యాంకుల కోసం ఎవడికి పడితే వాడికి ధారాదత్తం చేసి దేశం నిలువునా మునగాలా ? ఒక వర్గానికి చెందడం ఒక వ్యక్తిని ఒక ఉద్యోగానికి అర్హుణ్ణి చేసే పక్షంలో పూర్వకాలంలో అగ్రకులాలు అన్ని ఉద్యోగాలనీ కైవసం చేసుకుని ఉంటే అందులో తప్పేంటి ? ఆ వ్యవస్థ ఇప్పుడు మళ్ళీ పునరావృతమైతే మీకు బాధేంటి ? ఇక్కడ కులాల పేర్లు మారుతున్నాయి.పాత్రధారులు మారుతున్నారు. victims and tormentors అటువారు ఇటు, ఇటువారు అటు అయ్యారంతే ! ఆలోచనా ధోరణి మాత్రం అలాగే ఉంది. ఇదేం సామాజిక న్యాయమో వివరించండి.

 3. lalitha says:

  This is a very sensitive issue and so I have been keeping myself away from it.
  I do have some questions though. I hope to find answers.
  1. Is entire “manusmriti” available for reference today? Or is it only selected “quotes” that are left?
  2. “Dignity of labor” sounds very interesting. I debated justifying caste system based on such ideas in my mind. But I began thinking, what if I were born in a caste destined do manual labor by caste system? Would I be trying to justify that kind of a system? Try and think of it this way – if I was born poor and I was to live and die poor because a system that mandates it, is it justifiable?
  3. Are caste system and Hinduism the same? Does Hinduism need the caste system for its identity? Or is it something beyond this once upon a time social system?
  4. If there was no inequality in nature /society by way of predator and prey in animal world or by way of economic or social stature in human society and everybody could learn and earn, can we survive? How do we come to terms with there having to be somebody to do some menial jobs for the society to maintain its overall health?

  lalitha.

 4. My questions were not answered. In stead new questions were raised. ha ha ha.

  No problem, madam. Even if you are unable to answer my questions, I can answer yours. But, mind you, I have nothing aganist caste unlike you, though I hold it anachronistic and therefore unjustifiable today. But it was absolutely justifiable in the framework of the society of the old.

  1. Entire manusmruti is available.

  2. Caste was not a system. it used to be a lifestyle with a practical mundane purpose. Now caste was reduced to something like a religious belief without any functional value. Castes came into existence for various reasons. No particular person or class created or imposed them. They were codified with caste rules long after they have settled down on the land of India.

  (a) As trade guilds comprising artisans and workers pursuing a similar trade or profession. This we witness even in present times in the form of unions. Here comes the question of the dignity of labour, raised by me. Caste is not automatically synonymous with dirty work. In fact such professions are few and far between even in ancient times. But I don’t see any harm or sense of humiliation in having such professions. Society and civilization fail to survive unless there is somebody to shoulder menial tasks. I refuse to discredit such jobs and I don’t think they are an imposed disability on anybody. It may fall to the lot of you or me or somebody else. No other go. Machines are not available all the time. Take into account the fact that they were absolutely non-existent in the days of the old.

  Your problem (or rather it’s mental barrier impeding you from thinking further) is you wish to look at the construct of caste as an “oppressive system” with no room for the exercise of free will by an individual. I disagree with you. This concept was popularised through 20th century by some political activists for mobilising non-Brahmins against Brahmins. Sorry, I refuse to subscribe to this unhistorical propaganda motivated by pure political vendetta. No body could make anybody work against his will, especially in ancient India. There were Brahmins who failed to make priests. There were low-castesmen who joined army. Study the history of Mouryan empire, Gupta empire and Vijayanagar empire to know this.

  (b) As the groupings of foreign tribes which migrated to India in ancient times through its porous borders.

  (c) As hybrids of the-then existing castes, catering to the new growing needs of a progressive civilization.

  (d) As a voluntary choice of profession by some individuals who were skilled/or not skilled in some trades.

  3. Hinduism and caste are two different things. Hinduism is a religion dealing with the questions of God. soul, life after death and salvation. Caste is a professional/occupational grouping. Again this confusion is the creation of the 20 century political activists.

  4. All advocates of equality make the most common mistake of applying the 20th century concepts and social conditions to the ancient Indian society. I will attempt to tell you why it is ridiculous.

  (a) For everybody to get educated, you need a universal public instruction policy by the government. Private individuals can not conceive it.

  (b) For the government to formulate such a policy, first of all, it should have a vested interest in educating everybody. Modern governments are duty-bound to educate everybody because there is an innate fear that democracy might stand failed by large uneducated masses. This was not the case with ancient monarchies. Public awareness was not needed as a guarantee for their survival. So they never had a department of public instruction in their governmental setup.

  (c) Besides, Governements in ancient India were unstable and always under threat from enemies.

  (d) There was no possible upward social mobility coming with education in those days. That is, education was not perceived as a promising investment with any chance of high returns as today. Except for army postings, there were no jobs anywhere. So people relied much upon their family trade. Clamour for universal education and access to jobs grew hoarse in British India after the British destroyed the traditional economic fabric of India’s rural hinterland for the benefit of their country’s industrial revolution back home.

  Even the so-called highly educated Brahmins used to study what was relevant to their own caste profession only. The typical syllabi of a Brahmin Gurukulam used to consist of :

  (i) Amara-kosam
  (ii) Ashtaadhyaayi (Grammar)
  (iii) Alamkaara saastram (rhetorics)
  (iv) Pancha kaavyas
  (v) Veda

  Clearly, none of the above books catered to the professional requirements of an artisan or craftsman. It had absolutely no use for a non-Brahmin. So, why would they demand that they be educated like Brahmins ? Do you think they did not know better than the modern non-Brahmins ?

  Let’s emerge out of these standard cliches and rhetorics popularised by 20 the century political activists. There is a wholly different perspective to caste. Caste was blamed and maligned and somebody was made responsible for it. But, we are still deep into casteism. Why ? Because this narrow contemporary-centric political approach to caste has failed to broaden our outlook well after a century. Let’s accept the fact of caste and its legitimacy first and then explore things.

 5. Rajesh says:

  I believe that suprem court is doing good and well.

 6. lalitha says:

  Balasubrahmanyam gaaru,

  my purpose is served for now. I wanted it to come out that Hinduism as a religion is not related to caste concept.

  You also mentioned in another comment that you will be writing about Manusmriti on your blog. I would like to read that.

  Thank you for the elaborate explanation. I am looking for answers to questions. I would like to know better so that my kids can be better informed and have pride in their heritage for the right reasons.

  Regards,
  lalitha.

 7. మిత్రులారా,
  ప్రత్యేకించి మిత్రులు సత్యసాయి గారు,
  టి బాలసుబ్రహ్మణ్యం గారు,
  లలిత గారు,
  రాజేశ్ గారు,
  ఆంధ్రజ్యొతిలో నా మంగళవారం శీర్షిక ‘వర్తమానం’ లో ఏప్రిల్ మొదటివారంలో రాసిన ‘మనుస్మృతికి న్యాయవ్యవస్థ వత్తాసు’ మీద మీరు చేసిన వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. జవాబివ్వడానికి చాల ఆలస్యం చేసినందుకు క్షమించండి. పనుల ఒత్తిడి వల్ల కొంత, చర్చించవలసిన విషయాలు చాల లోతయినవి కావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది.
  ఇప్పటికైనా మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్కదానికి జవాబు చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. మనం తీసుకునే కొన్ని సామాజిక వైఖరులు మన పుట్టుక వల్ల, పెంపకం వల్ల, అనుభవం వల్ల, అధ్యయనం వల్ల, విలువల వల్ల — ఒక్కమాటలో చెప్పాలంటే సోషలైజేషన్ వల్ల — ఏర్పడతాయి. అంత లోతయిన కారణాలవల్ల రూపొందే వైఖరులను ఏదో ఒక వ్యాసంతోనో, ఒక చర్చతోనో మార్చడం కుదరదు. రిజర్వేషన్లను సమర్థించే నా వైఖరి అయినా, వ్యతిరేకించేవారి వైఖరి అయినా అంతే. అందువల్ల మీరు లేవనెత్తిన ప్రశ్నలలో కొన్ని అసంబద్ధమయినవని నేను అనుకుంటున్నప్పటికీ, వాటిమీద చర్చచేయాలని నాకేమీ కోరిక లేదు.
  కాని మీ దృష్టికి కొన్ని అంశాలు తేదలచుకున్నాను:

  Click here to read complete Response

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s