జన్మభూమి

మహమూద్‌ దర్వీష్‌ (తెలుగు: ఎన్‌.వేణుగోపాల్‌)

Janma Bhumi
Janma Bhumi

నేనొచ్చింది అక్కడి నుంచే
నా మదినిండా అక్కడి జ్ఞాపకాలే
మనుషులందరికీ ఉన్నట్టే నాకూ
జన్మనిచ్చిన తల్లీ కిటికీలు తెరుచుకున్న ఇల్లూ
రెక్కల్లో రెక్కలయిన అన్నదమ్ములూ
మనసు నిండిన సావాసగాళ్లూ

అక్కడ చల్లని కిటికీతో ఒక బందీఖానా కూడ
సముద్ర విహంగాలు ఎత్తుకుపోయిన కెరటం నాది
నాదయిన ఒక దృశ్యం నాదయిన ఒక గడ్డిపరక
ఈ పదాల చివరి అంచున వెలిగే చందమామా నాదే
అంతులేని పక్షుల గుంపులు నావే
ఎన్నటికీ చావులేని ఆలివ్‌ వృక్షమూ నాదే
సజీవమైన నా జన్మభూమి దేహాన్ని
వాళ్ల కత్తులు ముక్కలుగా కోసే బల్లగా మార్చకముందు
ఆ భూమి భూమంతా నా పాదముద్రలు
నేనొచ్చింది అక్కడి నుంచే
ఆకాశం తన తల్లి కోసం ఏడ్చేటప్పుడు
నేను ఆకాశాన్ని తల్లికి అందిస్తాను
తరలిపోతున్న మేఘానికి నన్ను నేను తెలుపుకునేందుకు
భోరున విలపిస్తాను
నెత్తుటి న్యాయస్థానాల్లో
యోగ్యమైన పదాలన్నీ నేను నేర్చుకున్నాను
న్యాయస్థానాల సూత్రాలు బద్దలు కొట్టడానికి
నేనన్ని పదాలూ నేర్చుకున్నాను
అన్ని పదాలనూ బద్దలు కొట్టాను
ఒకేఒక్క పదాన్ని తయారుచేయడానికి-
జన్మభూమి అనే పదాన్ని తయారు చేయడానికి

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, Telugu and tagged , , , , , . Bookmark the permalink.

2 Responses to జన్మభూమి

  1. Beautiful. Good and powerful translation.
    What language was the original in?

  2. It was translated from English. Darwish originally wrote in Arabic .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s