తల్లికోసం వెతుకులాట

అందరూ కలిసే ఉండి ఎవరికి వాళ్లయిన నేల

ఎవరికి వాళ్ళు తమ ఆటలే ఆడుతున్నవేళ

సంతలో కాటగలిసిన దిక్కుతోచని పసిపిల్లడు

గారడీవాడి మాయలో ఒక్కక్షణం ఏమరి

తల్లివేలు చెయిజారి దారితప్పిన బాటసారి

అందరూ మనుషులే తన మనిషి లేదు

అన్నీ ముఖాలే అమ్మ ముఖం లేదు

ఎడతెగని వెతుకులాట…

అమ్మలేదు

ఉందో లేదో తెలియదు చిటికెనవేలు అందడం లేదు

చుట్టూ పొంచిన శత్రువులు సరేసరి,

అదునుకోసం చూస్తున్న దాయాదుల వేట

నవ్వులాటల వెటకారాల రంపపు కోట

నిన్నటిదాకా

అమ్మకు దగ్గరయినందుకు అసూయతో రగిలినవాళ్లు

అమ్మకు అల్లారుముద్దు బిడ్డయినందుకు

అంతులేని కసి పెంచుకున్నవాళ్లు

అమ్మచేతుల్లో చెయ్యయి కంట్లో కన్నయి

అమ్మనవ్వును ప్రతిఫలించినందుకు ద్వేషంతో ఉడికిపోయినవాళ్లు

అమ్మ తమకు దూరమేమో అని అనుమానించినవాళ్లు

అమ్మను వదిలేశావోచ్ అని గేలి చేస్తున్నారు

అమ్మ నిన్నింక తనదగ్గరికి రానివ్వదు చూడు అని

తిట్లూ నిందలూ దుర్భాషలూ శాపనార్దాలూ

యుగాలు పొగిలే ఒక పొరపాటు చేశాడు

ఏం చేస్తాడు పాపం ఒక్కక్షణం పొరపడిన పిల్లడు

ప్రతి కణంలోనూ అమ్మ రక్తమాంసాలే నిండినవాడు

ప్రతి అక్షరం ఒంపులో అమ్మ వెంటే నడిచినవాడు

ప్రతి స్వరం ఒణుకులో అమ్మ పిలుపే వినిపించినవాడు

పెదవి కదిపితే అమ్మ చిరునవ్వునే వెలిగించినవాడు

ప్రతి అడుగూ అమ్మకోసమే మునుసాగినవాడు

ఏంచేస్తాడు పాపం

దేహమంతా కన్నీటిబొట్టయి

సంతనిండా దుఃఖం ప్రవహిస్తున్న దృశ్యం

అమ్మా అమ్మా రావూ మళ్లీ చెయి అందించవూ

జ్వలిత లలిత కరుణామహితా ఈ తప్పు కాయవూ…

సెప్టెంబర్ 6 – 29, 2009

విజయవాడ సాహితీమిత్రులు నిర్వహించే కవితా! – సమకాలీన కవితల కాలనాళిక, నవంబర్ 2009 లో ప్రచురితం

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Telugu. Bookmark the permalink.

One Response to తల్లికోసం వెతుకులాట

  1. bhasker.k says:

    kavita gundelotulni taakindi. chaalaa adhbutanga undi. kanta tadi pettinchindi. venu is essentially a poet.hats off to him.
    bhasker.k

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s