హైదరాబాద్ అభివృద్ధి – నిజానిజాలు

ఉస్మానియా విద్యార్థుల బులెటిన్ కోసం…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని కేంద్ర హోంమంత్రి డిసెంబర్ 9న ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో చిత్రవిచిత్రమైన సన్నివేశాలు కనబడుతున్నాయి, వాదనలు వినబడుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాటమార్చి కుట్రలు సాగిస్తున్నా, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో రాష్ట్ర సాధన వాంఛ నానాటికీ ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది. ఇంత విశాల ప్రజా ఉద్యమాన్ని దమననీతి ద్వారా అణచివేయగలుగుతానని ప్రభుత్వం పగటికలలు కంటున్నది. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపడానికి, వాయిదా వేయించడానికి, ఒకవేళ తప్పకపోతే, తెలంగాణను ధ్వంసం చేసి ఇవ్వడానికి కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున కుట్రలు ప్రారంభించారు. ఆ నాయకులలో ఎక్కువమంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గనుక వారిలో హైదరాబాద్ లోని తమ ఆస్తులకు, వ్యాపారాలకు ఏమి జరుగుతుందోననే ఆందోళన ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమలలోని మామూలు ప్రజలకేమో, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండే మహానగరం తమకు దూరమైపోతుందేమోననీ, అటువంటి మహానగరాన్ని తాము నిర్మించుకోవడానికి ఒక తరమయినా పడుతుందనీ, ఈలోగా తమ అవసరాలు తీర్చే నగరం ఉండదేమోననీ అనుమానాలు ఉన్నాయి.

ప్రజలలోని ఈ అనుమానాల్ని ఆసరా చేసుకుని, తమ స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కొరకు రాజకీయ నాయకులు అనేక అబద్ధాలు, భ్రమలు ప్రచారం చేస్తున్నారు. తమవల్లనే హైదరాబాదు అభివృద్ధి అయిందని అంటున్నారు. తాము రాకముందు హైదరాబాదులో తొండలు గుడ్లు పెట్టేవని ఒక నాయకుడు అనగా, తాము హైదరాబాదులో చేసిన అభివృద్ధికి తమకు లక్షకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని మరొక నేత అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953 అక్టోబర్ 1 నుంచి 1956 అక్టోబర్ 31 దాకా రాజధానిగా ఉన్న కర్నూలు స్థాయిని త్యాగం చేసి, హైదరాబాద్ ను రాజధాని చేశామని, ఆ త్యాగానికి ప్రతిఫలంగా తమకు లక్ష కోట్ల రూపాయలు ఇవ్వాలని మరొకనేత అన్నారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కొందరు, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తమకు దక్కకపోతే ఇతరులకు కూడ దక్కకుండా పాడుచేస్తామని అనే ధూర్తుల లాగ కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకులు హైదరాబాద్ చరిత్ర గురించీ, హైదరాబాద్ అభివృద్ధి గురించీ నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, హైదరాబాద్ లేకుండా చేస్తామని పగటి కలలు కంటున్నారు.

హైదరాబాదు చరిత్రను పరిశీలిస్తే ఆ రాజకీయ నాయకుల అబద్ధాలలోని కుటిలనీతి, దుర్మార్గపు ఆలోచనలు తేటతెల్లమవుతాయి.

గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహి పాలన 1512లో మొదలయ్యే నాటికి ఇవాళ్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాయి. 1565లో విజయనగర సామ్రాజ్యం కూలిపోయినతర్వాత మాత్రమే ఆ ప్రాంతాలు గోల్కొండ ఏలుబడిలోకి వచ్చాయి. మరొక ముప్పై ఏళ్ల తర్వాత 1591లో హైదరాబాద్ నగర నిర్మాణం ప్రారంభమయింది గాని అప్పటికి అది రాజధాని కాదు. ఔరంగజేబు దండయాత్ర వల్ల, కుతుబ్ షాహి పాలన అంతమయి, సంధి దశ ఏర్పడడం వల్ల 1687లో అసలు రాజధానే గోల్కొండ నుంచి ఔరంగాబాదుకు తరలిపోయింది. మళ్లీ అసఫ్ జాహీ పాలకులలో రెండో నిజాం, నిజాం అలీఖాన్ 1763లో రాజధానిని హైదరాబాదుకు మార్చాడు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకే (1766) కోస్తాంధ్రలో కొంత భాగం, తర్వాత ఇరవై సంవత్సరాలకు (1787) కోస్తాంధ్రలో మిగిలిన భాగం, ఆ తర్వాత ముప్పై సంవత్సరాలలో (1799) రాయలసీమ మొత్తం నిజాం సంస్థానం నుంచి బ్రిటిష్ వారికి దఖలయిపోయాయి. ఆ తర్వాత కోస్తాంధ్ర, రాయలసీమలు హైదరాబాదు రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చినది 1956 నవంబర్ 1న మాత్రమే.

అంటే, 1591 నుంచి 1687 వరకు హైదరాబాద్ రాజధాని కాదు. రాజధాని శివార్లలోని ఒక పట్టణం మాత్రమే. ఆనాడు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు గోల్కొండ రాజ్యంలో భాగమే అయినా ఆ ప్రాంతాల నుంచి చెప్పుకోదగిన ఆదాయం వచ్చిందనే దాఖలాలు గాని, దాన్ని హైదరాబాదుకు ఖర్చుపెట్టిన దాఖలాలు గాని లేవు. ఆ తర్వాత ఏడు దశాబ్దాల పాటు ఈ ప్రాంతాలన్నీ ఔరంగాబాదు రాజధాని కిందికి వెళ్లాయి గనుక అప్పుడు కూడ హైదరాబాదు అభివృద్ధి ఏమీ జరగలేదు. ఇక 1763లో హైదరాబాదు రాజధాని అయినప్పటికీ ఇవాళ్టి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు, ఆ రాజధాని పాలనలో మూడేళ్ల నుంచి ముప్పై ఏళ్లకన్న ఎక్కువకాలం లేవు. నిజానికి హైదరాబాదు ఆధునిక నగరంగా ఎదిగినది 1850ల తర్వాత ప్రధానిగా సాలార్ జంగ్ అమలు చేసిన సంస్కరణల కాలంలో. అప్పటికి కోస్తాంధ్ర, రాయలసీమలు హైదరాబాదు రాజ్యంలో భాగం కావు గనుక వాటికి ఆ అభివృద్ధిలో ఏ భాగమూ లేదు. ఇక 1956 నవంబర్ 1 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ కలిసిన ప్రాంతానికి హైదరాబాదు రాజధానిగా ఉంది గనుక ఈ యాభై నాలుగు సంవత్సరాలలో హైదరాబాదులో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, వాటికి ఏ ప్రాంతం వాటా ఎంత అనే విషయం లెక్కలు వేసుకోవచ్చు. మొత్తంగా మూడు ప్రాంతాల నుంచి వచ్చిన ఆదాయం ఎంత, ఆయా ప్రాంతాలలో జరిగిన ప్రభుత్వ వ్యయం ఎంత అని కూడ లెక్కలు తేల్చవచ్చు.

ఇక ప్రైవేటు పెట్టుబడుల విషయానికి వస్తే నాలుగు శతాబ్దాల హైదరాబాదు చరిత్రలో ఇరానియన్లు, కాయస్తులు, సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, తమిళులు మొదలయిన అనేక జాతులు ఇక్కడికి వచ్చి తమ పెట్టుబడులు పెట్టారు. నగరానికి తాము ఇవ్వగలిగింది ఇచ్చారు. ఏ ఒక్కరూ ఈ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని గాని, తమ వాటా తమకు ఇమ్మని గాని అడగలేదు. అసలు ప్రపంచచరిత్రలోనే అన్ని నగరాలూ అనేక జాతుల, ప్రజాసమూహాల కృషితో నిర్మాణమయ్యాయి గాని ఈ నగరం అభివృద్ధి మావల్లనే అయింది, కాబట్టి వదిలి వెళ్లాలంటే నష్టపరిహారం ఇవ్వండి అని ఎవరూ అడగలేదు. ఏ నగరమయినా భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతానికే చారిత్రకంగా, సాంస్కృతికంగా చెంది ఉంటుంది. తెలుగు వాళ్లు ఎంత అడిగినా మద్రాసు విషయంలో అదే జరిగింది. గుజరాతీలు ఎంత అడిగినా బొంబాయి విషయంలో అదే జరిగింది. ఆమాటకొస్తే ఇంగ్లండ్ భారతదేశాన్ని వలసగా ఆక్రమించకుండా ఉండి ఉంటే, భారత సంపదను దోచుకోక పోయి ఉంటే లండన్ నగరం అభివృద్ధి చెంది ఉండేదే కాదు. కాని భారత జాతీయోద్యమం లండన్ అభివృద్ధిలో తమ వాటా గురించి ఎన్నడూ అడగలేదు.

అంతేకాదు, నిజాం రాజవంశం, ముఖ్యంగా 1913 నుంచి 1948 దాకా పాలించిన ఏడవ నిజాం నిరంకుశ భూస్వామ్యం పునాదిగా పాలించారు గనుక హైదరాబాద్ రాజ్య ప్రజల గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసి హైదరాబాదును అభివృద్ధి చేశారు. అంటే హైదరాబాదు నిండా ఉన్నది హైదరాబాదు రాజ్య ప్రజల నెత్తురూ చెమటా. అందులో ఐదు మరాఠ్వాడా జిల్లాల, మూడు కన్నడ జిల్లాల ప్రజల భాగస్వామ్యమయినా ఉంది గాని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజల పాత్ర లేదు. అలాగే, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సర్ఫ్ ఎ ఖాస్ అనే పేరు మీద తనకు తానే సొంత భూమి రాసుకున్నాడు. రాజ్యంలోని ఐదు కోట్ల ఎకరాలలో యాభైలక్షల ఎకరాల భూమి ఇలా ఆయన సొంత ఆస్తిగా ఉండేది. అందులో ఇవాళ హైదరాబాదులో చేరిన ఆరు వందల గ్రామాల భూములు ఉన్నాయి. ఆ లక్షలాది ఎకరాల భూమి నిజానికి హైదరాబాద్ రాజ్య ప్రజల శ్రమ ఫలితం. దాన్ని లీజులకు ఇచ్చి, అమ్మి, అన్యాక్రాంతం చేసి, రియల్ ఎస్టేట్ గా మార్చి ఆ డబ్బుతో హైదరాబాద్ ను “అభివృద్ధి” చేసి, మేమే అభివృద్ధి చేశామని అనడం అనైతికం.

ఈ చరిత్రను, వాదనలను కాసేపు పక్కన పెట్టి ఈ సమస్యను మరొకవైపు నుంచి కూడ ఆలోచించవలసి ఉంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఏ ప్రమాణాలు ప్రాతిపదికగా అభివృద్ధిని లెక్కిస్తున్నారు? హైదరాబాద్ అభివృద్ధి అంటే హైదరాబాద్ లో నివసించే ప్రజల అభివృద్ధా, లేక హైదరాబాద్ లో కొన్ని భవనాలు, ఫ్లై ఓవర్లు, విమానాశ్రయం వంటి హంగులు రావడమా? అభివృద్ధి అంటే ప్రజల నిత్యజీవిత జీవన ప్రమాణాలలో కనబడే మెరుగుదలా, కేవలం కొన్ని సగటు అంకెలలో కనబడే పెరుగుదలా? అభివృద్ధి అంటే జీవనోపాధి అవకాశాలు పెరగడమా, జన జీవనంతో సంబంధం లేని తళుకుబెళుకులు పెరగడమా?

హైదరాబాద్ అభివృద్ధి గురించి అటూ ఇటూ సాగుతున్న వాదనలన్నీ ప్రజాజీవితంలోని అభివృద్ధిని కాక, హంగులనే అభివృద్ధిగా చూస్తున్నట్టు కనబడుతున్నది. నిజానికి గత ఐదు దశాబ్దాలలో హైదరాబాద్ లో మురికివాడల సంఖ్య వందలరెట్లు పెరిగింది. హైదరాబాద్ అప్పుడూ ఇప్పుడూ కూడ దేశంలో ఐదవ స్థానంలోనే ఉన్నది. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా పౌరసౌకర్యాలు పెరగలేదు. విద్యా, వైద్య, ఆరోగ్య, రవాణా, పారిశుధ్య, వినోద, విహార సౌకర్యాలలో ఏ ఒక్కటి చూసినా గత ఐదు దశాబ్దాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా సౌకర్యాలు పెరగలేదని స్పష్టమవుతుంది. కనుక ఈ పెరుగుదలను అభివృద్ధి అనడం మొదటి తప్పు. ఇది అంకెలలో పెరుగుదలే తప్ప ప్రజల అభివృద్ధి కాదు.

హైదరాబాద్ అభివృద్ధి గురించి సగటు అంకెలు మాత్రం చూపుతూ, అంకెల గారడీ చేస్తూ, ఇతర సామాజిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం అంతకన్న మించిన తప్పు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిగా ఉండిన, పాత సర్ఫ్ ఎ ఖాస్ భూమి మీద ఉమ్మడి యాజమాన్యమైనా ఉండాలి, లేదా ఆ భూమిని ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్య ప్రజల నుంచి కొల్లగొట్టాడు గనుక దాన్ని తిరిగి వారి వారసులకైనా అప్పగించాలి. కాని 1956 నుంచి కూడ అన్ని ప్రభుత్వాలూ ఆ భూమిని జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు, ప్రైవేటు పెట్టుబడిదారులకు, సినిమా పరిశ్రమకు, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులకు లీజు పేరుమీదనో, అతి చౌక ధరలకో, ఉచితంగానో అప్పగించాయి. అలా అన్యాక్రాంతమైన భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉంటుంది.

అలా హైదరాబాద్ భూమిని వాడుకుని ఏర్పాటు చేసిన జాతీయ, అంతర్జాతీయ, ప్రభుత్వ రంగ సంస్థలలో భూమిపుత్రులకు కనీసం న్యాయమైన వాటా ఉద్యోగకల్పన కూడ జరగలేదు. అంటే భూమి విషయంలో హైదరాబాద్ లో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధి ఏమయినా ఉంటే అది తెలంగాణ ప్రజలకు మాత్రం దక్కలేదు. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగానే జరిగింది. పైగా ఇటువంటి వికృత అభివృద్ధి వల్ల రియల్ ఎస్టేట్ ధరలు కృత్రిమంగా విపరీతంగా పెరిగిపోయి, ఇరుగుపొరుగు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడదలచిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు కనీసం చారెడు భూమి దక్కని పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ అభివృద్ధిలో ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారులు చూపుతున్నవి తాము పెట్టిన పరిశ్రమలు. రెడ్డి లాబ్స్, అరబిందో ఫార్మా, సత్యం కంప్యూటర్, నాట్కో, మాట్రిక్స్, శాంతా బయోటెక్, సిరిస్, రాంకీ, రామోజీ ఫిల్మ్ సిటీ, జయభేరి, లాంకో వగైరా అనేక కోస్తాంధ్ర, రాయలసీమ పెట్టుబడిదారుల పరిశ్రమలు, వ్యాపారాలు వచ్చిన మాట నిజమే. కాని ఈ పరిశ్రమలు, వ్యాపారాలు వాడుకున్నది హైదరాబాద్ భూములను. ఉద్యోగాలు కల్పించినది మాత్రం కోస్తాంధ్ర, రాయలసీమ నుంచి వచ్చిన ప్రజలకు. ఆ పరిశ్రమల కాలుష్యం వల్ల నష్టపోయినది హైదరాబాద్ సాధారణ ప్రజలు తాగేనీరు, పీల్చే గాలి, కుంటో సెంటో వ్యవసాయం చేసుకునే భూమి. రసాయన, ఔషధ పరిశ్రమలను అభివృద్ధి చేసి హైదరాబాద్ ను అంతర్జాతీయ చిత్రపటం మీద చేర్చామని గొప్పలు చెపుతున్న వారి అసలు ఉద్దేశ్యం హైదరాబాద్ వనరులను, ప్రజాజీవితాన్ని ధ్వంసంచేసి తాము ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సంపాదించడమేనని, వారు తిరిగి హైదరాబాద్ కు గాని, తెలంగాణకు గాని ఇచ్చినది ఏమీ లేదని గత ఐదు దశాబ్దాల చరిత్ర చెపుతుంది.

ఈ పెట్టుబడిదారులకు సర్ఫ్ ఎ ఖాస్ భూమి కూడ చాలక, హైదరాబాద్ లో ఉండిన వందలాది చెరువులను పూడ్చి రియల్ ఎస్టేట్ చేశారు. మూసీనది, నక్కవాగు వంటి సహజసిద్ధమైన సెలయేళ్లను విషపదార్థాల ప్రవాహాలుగా మార్చారు. లక్షల ఏళ్లుగా ఉన్న కొండలను పిండి చేసి, భవంతులు కట్టుకున్నారు. నగరమంతా వ్యాపించి ఉన్న తోటలను ధ్వంసంచేసి నగరంలో స్వచ్ఛమైన ప్రాణవాయువు లేకుండా చేశారు. వందల సంవత్సరాలుగా ఉన్న కుతుబ్ షాహి, అసఫ్ జాహి భవనాలను ధ్వంసం చేశారు. నేలమట్టం చేశారు. హైదరాబాద్ తెహజీబ్ గా ప్రఖ్యాతమైన సహజీవన సంస్కృతిని, స్నేహ సౌభ్రాతృత్వాలు విలసిల్లిన సంస్కృతిని ధ్వంసంచేసి కొనుగోలు – అమ్మకాల మార్కెట్ సంస్కృతిని ప్రవేశపెట్టారు.

కనుక హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారిన తర్వాత నిజంగా అభివృద్ధి అయిందా, ధ్వంసం అయిందా లెక్కలు వేయాలంటే, కేవలం పెట్టుబడులు, లాభాలు, జనాభా పెరుగుదల అంకెలు మాత్రమే కాదు. కాలుష్యం, భూమి అక్రమ వినియోగం, పర్యావరణ విధ్వంసం, జనజీవన కాలుష్యం, సంస్కృతీ విధ్వంసం మొదలయిన అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ పరిణామాలను కూడ లెక్కలోకి తీసుకోవాలి. అవి లెక్కించడం మొదలు పెడితే హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పాలకులు, కోస్తాంధ్ర, రాయలసీమ సంపన్నులు చెల్లించవలసిన నష్టపరిహారం నిర్ధారించడానికి సూపర్ కంప్యూటర్లు కూడ సరిపోవు. జరిగిన విధ్వంసాన్ని సవరించాలంటే ఎన్ని లక్షల కోట్లు చెల్లించవలసి ఉంటుందో చెప్పలేం. వాళ్లు చేసిన నిజమైన అభివృద్ధి కూడ ఏమైనా ఉంటే అది లెక్కవేసి, ఈ నష్టపరిహారం నుంచి మినహాయించవచ్చు.

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

10 Responses to హైదరాబాద్ అభివృద్ధి – నిజానిజాలు

 1. Sindu says:

  (1)One basic question to you if Hyderabad is not the capital of AP the kosta,rayalseema people will come and invest or not in Hyderabad?
  (2)Why people of Kosta and rayalseema started investing in Hyderabd only after it made it as common capital of AP?
  (3)Why Land Kabja not happening in the other part of Telangna or other part of state why only in Hyderabad?
  (4) whether land kabja only done by non Telangana people in Hyderabad?
  (5)Why Kosta people will not grab Rayalaseema’s people Govt jobs why only Telangna Govtjobs?

 2. Rakesh says:

  Once again – excellent article sir!!

 3. ఓబుల్ రెడ్డి says:

  వాదాలకేముంది ? ఎన్నయినా చెయ్యొచ్చు. కానీ ఈరోజు హైదరాబాదులో Ground situation ఏమిటి ? ఈరోజున హైదరాబాదుకు, ఆ నగరప్రజానీకానికీ మహారాజపోషకులు కోస్తా-సీమల జనం. వారు తెలంగాణకి బహువిలువైన కస్టమర్లు. వారు కాదంటే అక్కడ రియల్ ఎస్టేట్ కూలిపోతుంది. దానితో పాటు అనేక వ్యాపారాలూ, జీవనోపాధులూ కూడా కూలిపోతాయి. వాస్తవానికి 2009 డిసెంబరు పరిణామాల తరువాత హైదరాబాదులో ప్రస్తుతం నింపాదిగా జఱుగుతున్నది ఇదే. మీరు హైదరాబాదులో ఆస్తులున్నవారిని (అది తెలంగాణవారు కావచ్చు, తదితరులు కావచ్చు) ఎవఱినడిగినా చెబుతారు, ఈ ఉద్యమం వల్ల చాలా బాధపడుతున్నామని. ఈ ఉద్యమం విఫలమైతే తప్ప తమకు భవిష్యత్తు లేదని. కొత్త వెంచర్లు చేసేవారు లేరు. ఉన్న వెంచర్లని అమ్ముకోవడం కష్టంగా ఉంది. కారణాలేమైనా గానీ కోస్తా-సీమల జనం మాదిరి తెలంగాణ ప్రజలకి ప్రపంచస్థాయి మెట్రో అయిన హైదరాబాద్ ఆర్థికవ్యవస్థ యొక్క ఖర్చుల్ని భరించే శక్తి లేదు. గృహయజమానులు మిలియన్లాదిగా అప్పులు చేసి ఇళ్ళు కడితే వాటిల్లోకి అడిగినంత అద్దె ఇచ్చి వచ్చేవారు లేరు. హౌస్‌లోన్లు తీసుకునేవారు లేక హైదరాబాద్ బ్యాంకింగ్ వ్యవస్థ దివాలా ఎత్తే పరిస్థితికొచ్చింది. చరిత్ర పక్కన పెట్టండి. మీరు పేర్కొంటున్న చరిత్రకాలమంతా హైదరాబాద్ ఒక పనికిమాలిన టౌన్ గానే ఉంది. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కోస్తా-సీమ జనాల చెయ్యిపడ్డాకనే అది కేవలం రెండున్నఱ దశాబ్దాల వ్యవధిలోఒక మహా మెట్రోపాలిటన్ గా, ఒక మెగాలోపాలిటన్ గా అవతరించింది. మీరు వారితో కలిపి పేర్కొంటున్న గుజరాతీలూ, మరాఠిల పాత్ర కోస్తా-సీమల పెట్టుబడిదారుల పాత్రతో పోలిస్తే ఒక పెద్ద జీరో. నిజాయితీగా కళ్ళు తెఱిచి చూడండి. హైదరాబాద్ ఈ రోజు నిజంగా, ఆచరణాత్మకంగా ఏ ప్రజల మీద ఆధారపడి ఉందో !

  హైదరాబాద్ అభివృద్ధి వల్ల తెలంగాణవారికి ఏ మేలూ జఱగలేదనడం పచ్చి అవాస్తవం. అంతేకాదు, ఆంధ్రవారు పెటిన పరిశ్రమల్లో, సంస్థల్లో తెలంగాణవారికి ఉద్యోగాలు లేవని చెప్పడం అసత్యవాద దుష్ప్రచారం. ఇలా చెప్పేవారి దగ్గఱ ఒక్కొక్క సంస్థవారీగా ప్రామాణికమైన గణాంకాలు ఉన్నాయా ? అని సవాలు చేయకతప్పదు. దీనికి మఱో కోణం ఉంది. హైదరాబాద్ అభివృద్ధి వల్ల స్థానిక తెలంగాణవారు తమ యాజమాన్యంలో ఉన్న చిన్నచిన్న భూఖండాల్ని కూడా కోట్లాది రూపాయలకి కోస్తావారికి అమ్ముకొని పెద్ద టైకూన్ లుగా మారారు. ముఖ్యంగా అంతకుముందు స్థానికంగా బీసీలుగా గుర్తింపు పొందిన తెలంగాణ యాదవులూ, తెలంగాణ గౌడ్‌లూ రెడ్లతోను, వెలమలతోను సమానంగా అగ్రకులాలుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయనాయకులుగా అవతరించారు.

  ఈ ఉద్యమం వల్ల తెలంగాణ ప్రజల జీవగఱ్ఱ అయిన హైదరాబాదుకు చాలా చెఱుపు జఱిగిన మాట వాస్తవం. అనేకమంది మదుపుదారులు తమ హైదరాబాద్ ప్రణాళికల్ని శాశ్వతంగా రద్దుచేసుకొని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు మళ్ళారు. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధినంతా కాకినాడ తినేసేలా తయారవుతున్నది. అక్కడ పదిలక్షలు పెట్టి కొన్న ప్లాట్లు మూడేళ్లలో 30 లక్షలుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ బిల్డర్స్ అంతా ఒక్కొక్కఱే కాకినాడకు వలసపోతున్నారు. అక్కడ 40 చ.కి.మీ.ల ఏరియాలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లు కట్త్టడానికి కోస్తా పెట్టుబడిదారులు నడుం బిగించారు. తెలంగాణవాదుల అత్యుత్సాహం చివఱికి తెలంగాణవారి భవిష్యద్ వివేక విచక్షణల మీద ఉన్నతవర్గాలవారికి నమ్మకం నశించేలా చేసింది. ఆ నమ్మకాన్ని మళ్ళీ పాదుకొల్పాలంటే తెలంగాణవారు చాలా చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎంత శ్రమించినా మానసికంగా గాయపడ్డ కోస్తా-సీమల జనానికి తగిలిన దెబ్బ దెబ్బే. అది మానడం ఇప్పట్లో చాలా కష్టం.

 4. Rakesh says:

  Those who feel they are concerned for telugu unity, this is a question for them:

  “IF THE STATE IS NOT DEVIDED ON A CONDITION THAT, HYDERABAD SHOULD NOT BE THE CAPITAL ANY MORE, LET THAT BE SHIFTED TO A NEW LOCATION (with in 50km radius from geographic intersection point of Seema-Andhra-Telangana) AND IN RETURN NO TELANGANA DEMAND FOREVER..”

  ‘INSTEAD OF DEMANDING 1 LAC CRORES FOR SEEMA OR TELAGANA SPEACIAL PACKAGE, THIS CAN BE DONE IN 10 TO 20% OF THAT M0NEY AND A BIG SAVING FOR THE COUNTRY”

  But – here the true face telugu unity will come out because, the imperialistic thinkings would say that, the true interest in NOT telugu unity, BUT to exploit telangana in every aspect, and every PLACE (every inch..)
  If a new capital is made out side/bordering telangana, as a solution to this long-drawn battle – are there neutralists who would consider this option?
  Or will they feel that – how can they gradually occupy, Warangal ,Karimnagar, NZB, Adilabad Dist (Creation of RR dist was indeed a coup, and all other districts have already lost acre of land in lacs to Greater Hyderabad ; the life in city has already become HELL, the city can not accommodate 9 crore people & we need to have solutions.. )

  ppl who make (pseudo) arguments on TV that “we came and invested in Hyd because it was a capital city” – answer to this: (first point to observe the word “INVEST” and it was for a return 100 times or more; No one came here to develop; why else some colonies have Super markets, but not the slum lower-middle class bastis)

  a. Hyd was 5th largest city in 1950’s – so migrants came
  b. Hyd was int’l popualr city & rich in every aspect (time mag’z published this), so migrants came
  c. Hyd is having geopgraphical advantage of being a central location, so migrants came
  d. Hyd has best climatic condition (Winter, Summer, Rains – all seasons best, even president of india has a holiday home here), so migrants came
  e. Hyd had good cosmopolitan culture and business with guj, marwari, punj will be easy .. so more migrants came
  f. Hyd had every resource – all READY… READY.. so was ANDHRA state merger (apart from telugu unity factor) with Telangana

  If today – Govt is willing to shift seema-andhra businessman’s factory , machinary free of cost to the investors home town, will HE SHFT FOR EMPLOYMNT CREATION AT HIS MOTHER LAND? Are there no people who can / capable of running the plant / business?
  If we really conduct a survey …
  “NOT A SINGLE BUSINESS HOUSE WILL CONSIDER SETTING-UP FACTORIES IN THEIR OWN NATIVE PLACES” and there is NO need / compulsion if they do not want to leave too.
  No one is asking any person to leave Telangana OR Hyderabad. We are only seeking end of COMBINED ruling (In reality it is dominated ruling, chaatipe haath-rakh’ke socho – mere bhaai!!)

  So – any one who says, had Andhra created in 1972 we could have progressed is a half-hearted argument. I f they are really concerned for development of mother land (each district of kostha or Seema), why are they not asking / forcing their leaders for DE-CENTRALIZED development. Telangana has Hyderabad in the middle. So, any expansion of city would eventually accessible to them, than far-away places.
  so-far your ppl never fought with your own leaders, who NEVER cared to develop your region, villages, poor ppl. Today – your sentiment to Hyd is fully understandable and the hope-less position created by leaders for 50 years in turning into an agitation against separation instead of alternatives – that are possible.

  Only those UPPER MIDDLE CLASS, RICH, HIGHLY RICH calsses who can afford houses , plots, properties at both places, want to continue with dual facilities, (BESTOF BOTH WORLDS – crop yeilds / vote banks of andhra and comforts of telangana) are agaisnt state formation..

  GOD SAVE ANDHRA VILLAGERS or SOMEONE LIKE YOU COMES FORWARD!!

 5. Prakash says:

  If you go to some andhra private companies (e.g. Margadarshi), every employee from manager to office boy is not only from andhra but from one caste only. So they were “developing” their own people.

  PS: Nothing wrong in doing this but only to rebut their claim “we gave jobs to Telangana people”

 6. Yedukondalu says:

  Great Article. No one can hide Fact. Go ahead……

 7. just me says:

  Development ayyindi raa ante Murudodlu perigayi antaventi guru…neku malli great points ani support okati…Grow up !!….KCR raka mundu…were where you…

 8. dinesh says:

  Development ayyindi raa ante Murudodlu perigayi antaventi guru…neku malli great points ani support okati…Grow up !!….KCR raka mundu…were where you…

 9. Pingback: 2010 in review « KadaliTaraga : a wave in the Ocean !

 10. Mohan says:

  please dont let prejudice rule sense. Shankar Melkote has been or still is the head of Margadarsi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s