తర్కం లోపించిన తీర్పు

భారత న్యాయవ్యవస్థ వెలువరించిన తీర్పులలో అన్యాయమైనవీ, చట్టనిబంధనలను వక్రీకిరించినవీ, తమ పరిధిని అతిక్రమించినవీ ఎన్నో ఉన్నాయి. కింది కోర్టులు అటువంటి అన్యాయమైన తీర్పులు ఇచ్చినప్పుడు పై కోర్టులు సవరించిన సందర్భాలు కూడ ఎన్నో ఉన్నాయి. మరణశిక్షతో సహా కింది కోర్టులు వేసిన ఎన్నో శిక్షలను పై కోర్టులు కొట్టివేసిన సందర్భాలకు కూడ లెక్కలేదు.

కనుక ఒక తీర్పు న్యాయమైనదా, అన్యాయమైనదా, చట్టాని కి లోబడి ఇచ్చినదా, చట్టాన్ని అధిగమించి ఇచ్చినదా అని చర్చించే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఆ చర్చను హైకోర్టుకు, అన్ని కోర్టులకూ పైన ఉండే సమాజం ముందరికి తీసుకుపోయే అధికారం ప్రతి పౌరుడికీ ఉంది. పౌరులకు సహజంగా ఉండే ఆ హక్కుతో చూసినప్పుడు బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు స్పెషల్‌ఫుల్ బెంచి సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పు అన్యాయమైనదని, చరిత్రకు వ్యతిరేకమైనదని, తార్కికంగా కూడ సరయినదికాదని చెప్పవలసి ఉంటుంది.

మొట్ట మొదట ఈ కోర్టు పరిష్కరించవలసిన వ్యాజ్యం అయోధ్యలోని ఆ 2.77 ఎకరాల భూమి మీద పట్టా హక్కు ఎవరిదనే సాంకేతిక అంశం మాత్రమే. బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదానికి సంబంధించిన మిగిలిన విషయాలు చట్ట పరిధిలోనివి. ఈ న్యాయస్థాన పరిధిలోనివి కావు. అవి చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక అంశాలు. వాటిలోనైనా న్యాయస్థానపు జోక్యం ఉండవచ్చు గాని ఆ జోక్యం సాక్ష్యాధారాలకు, చట్టానికి, హేతుబద్ధతలకు లోబడి ఉండాలి. విశ్వాసానికి, రుజువులులేని వాదనలకు ప్రమేయం లేదు.

కాని ప్రస్తుత తీర్పులో ఈ న్యాయస్థానం తన పరిధిలోకి రాని అనేక విషయాల మీద వ్యాఖ్యానాలు చేసింది. ఆ వ్యాఖ్యానాలు సరయినవా కావా అనే ప్రశ్న అలా ఉంచి అసలు ఆ వ్యాఖ్యానాలు చేసే అధికారం న్యాయస్థానానికి లేదు. ప్రస్తుత న్యాయస్థానపు తీర్పు చారిత్రకంగా కూడ తప్పు. నూట ఇరవై ఐదు సంవత్సరాల కింద వలస పాలనలోని న్యాయస్థానాలు చూపినంత విజ్ఞతను కూడ ప్రస్తుత న్యాయస్థానం చూపలేదు.

ఈ స్థల యాజమాన్య వివాదం ఇప్పుడు మన రాజకీయ, సామాజిక అవకాశవాదం వల్ల, స్వార్థపర, మతోన్మాద శక్తుల వల్ల అరవై సంవత్సరాలు సాగిందిగాని, బ్రిటిష్ వలసపాలనా కాలంలో ఏడాదిన్నరలో మూడు స్థాయిల న్యాయస్థానాలలో విచారణ పూర్తయింది. మొట్ట మొదట రామజన్మస్థాన పూజారి రఘువరదాస్ చేసిన ఫిర్యా దు 1885 జనవరి 19న అప్పటి పైజాబాద్ సబ్ జడ్జి పండిట్ హరికిషన్ ముందర విచారణకు వచ్చింది.

బాబ్రీమసీదు రామజన్మభూమి అని, అందువల్ల ఆ ఆవరణలోని గద్దె మీద ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వమని ఫిర్యాది కోరారు. ఫిర్యాది వాదనను అంగీకరించినప్పటికీ, ఆలయ నిర్మాణం కోసం కోరుతున్న స్థలం మసీదుకు సమీపంలోఉన్నందున అనుమతి ఇవ్వడం కుదరదు అని ఫిబ్రవరి 24న పండిట్ హరికిషన్ తీర్పు చెప్పారు. ఫిర్యాది పై కోర్టుకు అప్పీలు చేసుకుంటే జిల్లా జడ్జి జెఇఎ బాంబియర్ ఆ అప్పీలును కొట్టివేస్తూ మార్చి 26న ఇచ్చిన తీర్పులో ‘హిందువులు పవిత్రంగా ఎంచే ప్రత్యేక స్థలం పైననే ఒక మసీదు నిర్మించబడడం దురదృష్టకరం.

కాని ఆ సంఘటన 356 సంవత్సరాల కింద జరిగిపోయింది గనుక, ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి చాల ఆలస్యమయిపోయింది. ఇప్పుడు చేయగలిగినదల్లా అన్ని పక్షాలనూ యథాస్థితిలో కొనసాగించడమే’ అన్నారు. ఫిర్యాది ఇంకా పై న్యాయస్థానానికి -అవధ్ జుడిషియల్ కమిషనర్ ముందరికి-అప్పీలుకు వెళ్ళారు. జుడిషియల్ కమిషనర్ డబ్ల్యు యంగ్ 1886 నవంబర్ 1న ఆ అప్పీలును కొట్టివేశారు.

నిజానికి ఈ మూడు స్థాయిల తీర్పుల తరువాత ఆ స్థల వివా దం సమసిపోయి ఉండవలసింది. కాని ‘విభజించి పాలించే’ కుటిలనీతి ప్రకారం హిందూ, ముస్లింల మధ్య బ్రిటిష్ పాలకులు పెంచి పోషించిన శత్రుత్వం వల్ల, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారానే రాజకీయ లబ్ధి పొందగలమని అనుకునే రాజకీయ పక్షాల పెరుగుదల వల్ల ఈ వివాదం ఆరకుండా రగులుతూ వచ్చింది.

‘1949 డిసెంబర్‌లో ఆ ఆవరణలో అఖిల భారతీయ రామాయ ణ మహాసభ తొమ్మిది రోజుల రామచరిత మానస్ పఠనాన్ని నిర్వహించింది. ఆ పఠనం చివరిరోజు అయిన డిసెంబర్ 22 రాత్రి, బాబ్రీ మసీదు నిర్జనంగా ఉన్నప్పుడు, ఒక గుంపు గోడ దూకి లోపలికి వెళ్లి లోపల విగ్రహాలు పెట్టి అలంకారాలు చేసింది’ అని అయో ధ్య పోలీస్ స్టేషన్‌లో మాతాప్రసాద్ అనే కానిస్టేబుల్ 1949 డిసెంబర్ 23న ఇచ్చిన ఎఫ్ఐఆర్ చెపుతున్నది.

ఈ దౌర్జన్యాన్ని నాటి ఫైజాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అక్షయ బ్రహ్మచారి నిరసించా రు. రెండు సార్లు నిరాహారదీక్ష కూడ చేశారు. ఇవాళ ఏ రాంలాలా విగ్రహాలకు మూడో వంతు స్థలం మీద అధికారం ఉందని న్యాయస్థానం చెపుతున్నదో ఆ విగ్రహాలు అక్కడికి చేరినది ఈ దౌర్జన్యం వల్ల మాత్రమే. నిజానికి అరవై ఏళ్లుగా స్థల వివాదంలో రామభక్తులకు ప్రవేశం దొరికినదే ఈ దౌర్జన్యం వల్ల. కాని న్యాయస్థానం ఈ దౌర్జన్యం గురించి మాట్లాడలేదు.

పైగా 1528లో మీర్ బాఖీ చేశాడని చెపుతున్న ఏ ఒక్క చారిత్రక, సాహిత్య, పురావస్తు ఆధారమూలేని ‘దౌర్జన్యం’ గురించి మాత్రం మాట్లాడింది. రాముడి గురించీ, సర్వాంతర్యామి అయిన భగవంతుడి గురించీ ఒక లౌకిక రాజ్యాంగపు న్యాయవ్యవస్థ రాయగూడని పద్ధతిలో ఎంతో రాసింది. బాబ ర్ విధ్వంసం జరిపించే ఉంటే, ఆ విధ్వంసం జరిగిందని చెపుతున్న నాలుగు ఏళ్లకు ఆ అయోధ్యలోనే పరిసరాల్లోనే పుట్టి రామచరిత మానస్ రాసిన పరమ రామభక్తుడు తులసీదాస్ ఆ విధ్వంసం గురించి ప్రస్తావన అయినా ఎందుకు చేయలేదో చెప్పాలి.

అక్కడ ఆలయం ఉండి దాన్ని కూల్చి మసీదు నిర్మాణం జరిగిందనుకున్నా ప్రాచీన, మధ్యయుగాలలో అన్ని మతాలూ చేసిన పని అదే. వందలాది బౌద్ధ, జైన ప్రార్థనా స్థలాలను కూల్చి హిందూ ఆలయాలు వచ్చాయి. ఇవాళ ఆ సుదీర్ఘ విధ్వంసాల, పునర్నిర్మాణా ల చరిత్రలోకి వెళ్లడం సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు.

నిజానికి అక్కడ ఆలయం ఉండి ఉన్నా అది శిథిలమైపోయి ఆ శిథిలపు రాళ్లతో మరొక నిర్మాణం జరిగి ఉండవచ్చు. మన కళ్ల ముందర అటువంటి శిథిలాలను వాడుకుని నిర్మాణం జరిగిన భవనాలెన్నో ఉన్నాయి. ప్రతి కొత్త భవనమూ పాత భవనాన్ని కూల్చి వచ్చిందేననుకోవడం అర్థరహితం. ఆ

ర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చగలిగినదీ, తేల్చినదీ కూడ విధ్వంసం జరిగిందనో, అది బాబర్ చేయించాడనో, మీర్ బాఖీ చేశాడనో కాదు. బాబ్రీ మసీదు నిర్మాణంలో ఇస్లామిక్ నిర్మాణ శైలికి సంబంధంలేని, అంత కు ముందరి మతాల నిర్మాణ శైలికి సంబంధించిన స్తంభాలు, రాళ్లు ఉన్నాయని మాత్రమే.

అది రాముడి గుడే అయినా అక్కడే రాముడు జన్మించాడని అనడం విశ్వాసమే తప్ప ఎవరూ ‘నిశ్చితమైన సాక్ష్యాధారాలతో’ చెప్పగలిగిన నిజం కాదు. న్యాయస్థానాలకు నిశ్చితమైన సాక్ష్యాధారాలతోనే పని తప్ప విశ్వాసాలతో కాదు. అంతే కాదు, అయోధ్య లో ఇవాళ్టికీ కనీసం డజను ఆలయాల పూజారులు రాముడు తమ గుడిలోనే పుట్టాడని నమ్మకంగా చెపుతారు.

ఈ తీర్పు మీద వివరంగా చర్చించవలసిన అంశాలు మరెన్నో ఉన్నాయి. కనీసం తార్కికంగా చూసినా ఈ తీర్పు సంబద్ధంగా లేదు. రాముడు అక్కడే పుట్టాడని, ఆ స్థలం రామ్ లాలాకు చెందుతుందని నిర్ధారించి, అందువల్ల సున్నీ వక్ఫ్ బోర్డ్ ఫిర్యాదును న్యాయస్థానం కొట్టివేసింది.

అలాంటి తీర్పు ఇచ్చినప్పుడు మరి మూడోవంతు స్థలానికి మాత్రం సున్నీ వక్ఫ్ బోర్డుకు అధికారం ఎక్కడినుంచి వస్తుంది? రెండు పక్షాలలో ఒకరు ఆ భూమి యజమానులు, మరొకరు దురాక్రమణదారులు అయినప్పుడు నిజమైన యజమానులను గుర్తించి వారికే ఆ భూమి మీద అధికారం ఇచ్చి, దురాక్రమణ దారులను తొలగించవలసిన బాధ్యత న్యాయస్థానాని ది. కాని ఈ న్యాయస్థానం మాత్రం 1949లో ఆ భూమిని దురాక్రమించిన వారిని యజమానులని ప్రకటిస్తూనే, 1528లో దురాక్రమణ చేశారని తాను అంటున్న వారికి మూడోవంతు భూమి ఇచ్చింది.

నిజానికి 1528 నుంచి 1992 దాకా అక్కడ నిలిచిఉన్న ఈ దేశ పు సంకీర్ణ సంస్కృతి చారిత్రక చిహ్నాన్ని దుర్మార్గంగా, దౌర్జన్యంగా కూల్చిన నేరస్తుల మీద ఇప్పటిదాకా శిక్ష పడనే లేదు. ఈ లోగా ఆ చారిత్రక చిహ్నపు ప్రతినిధులు దురాక్రమణదారులని న్యాయస్థానం తన విజ్ఞతతో నిర్ధారించింది.

ఇంత అసమంజసమయిన తీర్పును శాంతి సామరసస్యాల తీర్పు అని, ఘర్షణలను నివారించిన తీర్పు అని ప్రశంసిస్తున్నారు. అంటే కక్షిదారులలో ఒకరికి వ్యతిరేకంగా తీర్పు చెపితే వారు దౌర్జ న్యం చేస్తారేమోననే భయంతో వారికి అనుకూలంగా తీర్పు చెపితే అది ఘర్షణను నివారించే తీర్పు అవుతుందన్న మాట. న్యాయాన్యాయాల ప్రాతిపదిక లేదు, సాక్ష్యాధారాలు అక్కరలేదు. ‘ దౌర్జన్యపరులదే ఒప్పు’ అంటే ఇక సమాజంలో దౌర్జన్యాలే ఉండవు. ఎంత గొప్ప న్యాయవిచక్షణ?!

-ఎన్. వేణుగోపాల్

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in Andhra Jyothy, వ్యాసాలు. Bookmark the permalink.

16 Responses to తర్కం లోపించిన తీర్పు

 1. Ranjith says:

  Must read article.

 2. SIVARAMAPRASAD KAPPAGANTU says:

  “…..నిజానికి 1528 నుంచి 1992 దాకా అక్కడ నిలిచిఉన్న ఈ దేశ పు సంకీర్ణ సంస్కృతి చారిత్రక చిహ్నాన్ని….” with what authority and evidence you have come to know that its a Historical monument and not an eye sore constructed by invading marauders?

 3. RamuduBheemuDu says:

  భలే భలే బాగా చెప్పావ్, కాని అందుకు మనమేం చేయాలో అదికూడా నీవే చెప్పూ

 4. (మళ్లీ అంతా వ్రాసే వోపిక లేక, “తెలుగిల్లు” వారికిచ్చిన కామెంట్ నే ఇక్కడ వ్రాస్తున్నాను)

  యెంత సింపుల్ గా అనేశారు–”నమ్మకాలమీద ఆథారపడిన తీర్పు” అని!!!
  ములాయం లాంటి కుహనా సెక్యులరిస్టులూ, చిదంబరం లాంటి ఓవరాక్షన్ గాళ్లూ ప్రచారం చేస్తున్న అబధ్ధాల వలలో పడకండి.
  “నమ్మకాల” ప్రస్తావన వచ్చింది, “రాం లాలా విరాజ్ మాన్” అంటే బాల రాముడి విగ్రహం స్వయం గా దాఖలు చేసిన కేసులో! ఈ కేసులో, ఆ విగ్రహం “చట్టం కంటిలో” ఒక వ్యక్తేననీ, ఆ వ్యక్తి “మైనర్” (బాలుడు–ఇంకా వ్యక్తిత్వం సంతరించుకోనివాడు) అనీ, ఆయన తరుఫున “సమ్‌రక్షకుడు” దాఖలు చేసినదీ కేసు.
  మీరు టీవీలో గమనించలేదేమో–తీర్పు ముఖ్యాంశాలు ఇంకా యెవరికీ (వెబ్ సైట్ తో సహా) తెలియని క్షణాల్లో, ఈ కేసు వాదించిన న్యాయ వాది “రాం లాలా విరాజ్మాన్” కేసు గెలిచాడు…..అది మసీదు కాదు….అక్కడి విగ్రహాలని తొలగించడానికి వీలు లేదు…..పూజలు కొనసాగుతాయి…..మూడు నెలలపాటు అక్కడ “యథాతథ స్థితి” కొనసాగాలి……” అని చెప్పారు.
  ఇది పూర్తిగా “చట్టబధ్ధమైన”, “న్యాయ బధ్ధమైన” తీర్పే–అందులో సందేహం లేదు. నమ్మకాలపై ఆథారపడడం అనేది “లా వొక్కింతయు” లేనివాళ్లు చేస్తున్న ప్రచారం మాత్రమే.
  యోగేశ్వర్ ఖాందేశ్, శాలివాహన కొంత అవగాహనతో చక్కగా వ్యాఖ్యానించారు.
  “మీ అబిప్పాయమే మా అబిప్పాయం” అనేవాళ్ల వ్యాఖ్యలు పరిగణనలోకి రావు.
  జవాబు

  Posted by కృష్ణశ్రీ on అక్టోబర్ 7, 2010 at 8:20 ఏ ఎమ్
  ముఖ్యంగా–హారం లో బాగా ప్రాచుర్యం లో వున్న బ్లాగు–”తెలుగిల్లు”–ఓ జర్నలిస్ట్ నిర్వహిస్తున్నాడనుకుంటా–లాంటివాళ్లు ఇలాంటి టపాలు వ్రాసే ముందు అవగాహన పెంచుకోవాలి. “తొందర పనికి రాదు”.

 5. తర్కం, తప్పొప్పులను పక్కన పెడితే, కామన్వెల్త్ గేమ్స్ సమయంలో వర్గాలన్నీ రోడ్డుపై పడి, పరువు పోగొట్టుకోకుండా కాపాడింది ఈ తీర్పు. అందుకు మనం తప్పకుండా సంతోషించాలి.

 6. Informer says:

  You are a total fake. Are you saying that you are a better judge than the three judges who scanned, scrutinized and thoroughly went through the evidences presented to them!! So sick of you to just put across your own bias and vague theories.

  Some 500 odd years ago some people brought down a structure and made another, now after 500 years the same thing happened, in future there is no guarantee it wont repeat again, it is connected to faith and sentiments.

  Better bow to the sane and prudent judgment mooted out by the court and stop your sick cribs!! people like you love and live on controversy. Shame!

 7. “ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చగలిగినదీ, తేల్చినదీ కూడ విధ్వంసం జరిగిందనో, అది బాబర్ చేయించాడనో, మీర్ బాఖీ చేశాడనో కాదు. బాబ్రీ మసీదు నిర్మాణంలో ఇస్లామిక్ నిర్మాణ శైలికి సంబంధంలేని, అంతకు ముందరి మతాల నిర్మాణ శైలికి సంబంధించిన స్తంభాలు, రాళ్లు ఉన్నాయని మాత్రమే.” – అంతకు ముందరి మతాలంటే ఏవవి? మీకు తెలియక రాయలేదా లేక తెలిసీ రాయకుండా వదిలేసారా?

  “పైగా 1528లో మీర్ బాఖీ చేశాడని చెపుతున్న ఏ ఒక్క చారిత్రక, సాహిత్య, పురావస్తు ఆధారమూలేని ‘దౌర్జన్యం’ గురించి మాత్రం మాట్లాడింది. ” – పురావస్తు ఆధారం లేదని చెప్పడం తప్పు, వాస్తవాల వక్రీకరణ. మసీదు స్థలం కింద ఉత్తరభారత దేవాలయ నిర్మాణ శైలిలో ఉన్న నిర్మాణపు శిథిలాలు లభించాయి. మీరు రాసిన, నేను పై పేరాలో ఉదహరించిన వాక్యాలు మీ టపాలోని ద్వైధీభావాన్ని, తార్కికతలేమినీ చూపిస్తున్నాయి.

  న్యాయస్థానపు నిర్ధారణలో విజ్ఞత ఉంది. తీర్పులో తార్కికత ఉంది. ఈ టపాలోని వాదనలో ఉందో లేదో ఆలోచించండి.

 8. Sravya Vattikuti says:

  నిజానికి 1528 నుంచి 1992 దాకా అక్కడ నిలిచిఉన్న ఈ దేశ పు సంకీర్ణ సంస్కృతి చారిత్రక చిహ్నాన్ని
  ——————————————————————
  ఈ ఒక్క ముక్క చాలు మీరెంత సిక్ అనేది తెలుసుకోవటానికి .

 9. balu says:

  “నిజానికి 1528 నుంచి 1992 దాకా అక్కడ నిలిచిఉన్న ఈ దేశ పు సంకీర్ణ సంస్కృతి చారిత్రక చిహ్నాన్ని దుర్మార్గంగా, దౌర్జన్యంగా కూల్చిన నేరస్తుల మీద ఇప్పటిదాకా శిక్ష పడనే లేదు. ఈ లోగా ఆ చారిత్రక చిహ్నపు ప్రతినిధులు దురాక్రమణదారులని న్యాయస్థానం తన విజ్ఞతతో నిర్ధారించింది.”

  సంకీర్ణ సంస్కృతి చారిత్రక చిహ్నం… కాదండీ, హిందువుల పరమతసహనానికి చిహ్నం.
  దాన్న కొందరు అతివాదులు కూలగొట్టారు. అది మాత్రం తప్పే… కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాల్సింది.

  ఆ చారిత్రక చిహ్నపు ప్రతినిధులు దురాక్రమణదారులని… కోర్టు అలా ఏమీ నిర్ధరించలేదే?

  గొడవలు జరగకూడదని ఇలాంటి సామరస్యపూర్వకమైన తీర్పు ఇచ్చింది.

  ఒకిరికే చెందేలా తీర్పునిస్తే ఆ తర్వాత జరిగే గొడవలను ఈ చవట, చచ్చు, సన్నాసి, దద్దమ్మ ప్రభుత్వాలు(కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు(ఇవి మరీ సన్నాసివి)) ఆపలేవన్న స్పృహతో ఇచ్చినవి.

  అయినా ముస్లింలే హుందాగా పై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పాక, మధ్యలో మీ గోలేంటండీ?
  ఎవర్ని రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్న మాటలివి?

  నాదృష్టిలో … కొద్దిపాటి సహనం లేక బాబ్రీ మసీదును కూల్చిన దుర్మార్గులకీ(ఇది మీమాటే) అసహనంతో కోర్టు తీర్పుకి వక్రభాష్యాలు పలికి సహనంగా వ్యవహరిస్తున్న వర్గాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మీకూ పెద్ద తేడాలేదు.

 10. balu says:

  సారీ, ‘నేరస్థులకీ’ అని రాయబోయి ‘దుర్మార్గులకీ’ అని రాసేశాను

 11. satya says:

  >> వందలాది బౌద్ధ, జైన ప్రార్థనా స్థలాలను కూల్చి హిందూ ఆలయాలు వచ్చాయి. ఇవాళ ఆ సుదీర్ఘ విధ్వంసాల, పునర్నిర్మాణా ల చరిత్రలోకి వెళ్లడం సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు.

  Can you please give examples of some 50 in thosse hundreds? Dont write blanket statements as if you witness the history.

 12. srinivas says:

  *వందలాది బౌద్ధ, జైన ప్రార్థనా స్థలాలను కూల్చి హిందూ ఆలయాలు వచ్చాయి. ఇవాళ ఆ సుదీర్ఘ విధ్వంసాల, పునర్నిర్మాణా ల చరిత్రలోకి వెళ్లడం సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు.*
  వేణుగోపాల్ గారు, ప్రజలను ఇప్పటి వరకు చేదగొట్టింది చాలు. మీరు పోరాడె పేద,కార్మిక ప్రజలు ఎవ్వరు బ్లాగులు చదవరు. కనుక చరిత్ర గురించి తెలియని మీలాంటి వారు రాసే వ్యాసాలను చూసి విసుగొస్తున్నాది. మిమ్మల్ని మేము ప్రశ్నించటం, పని పాటా లేని మీరేదో చాలా బిజిగా ఉన్నట్టు వాటికి ఎక్కడ వివరణ ఇవ్వరు. మీ ఎర్ర అజెండా చరిత్రకారుడైన కౌసంబి గారు అసలికి బుద్ద విహారలు మూలబడటానికి కారణం చెప్పారు అది కూడా మీకు తెలిసినట్లు లేదు. కొంచెం చదువుకొనేది.
  యునివర్సిటిలో చేరి పి.హెచ్డి పేరు తో చరిత్రను వక్రీకరిస్తూ ప్రభుత్వ ధనాన్ని ఎలా తిన్నది, తింట్టున్నది అందరికి తెలుసు. కావాలంటే అరుణ్ శౌరి పుస్తకం చదువు కొనేది. మేము ఆ డబ్బులు తినలేదు అని ఆయన రాసిన పుస్తకంలో పేర్కొన్న ఒక్క చరిత్రకారుడు ఖండించలేదు. అటువంటి నీజాయితి కలిగిన వారు రాసిన చరిత్రను మీరు నమ్మిన్ చాలని చూస్తే మేము గమ్ముగా ఉండాలా? మీరు మటుకు భారత సైనికులు కాశ్మీర్ లో అత్యాచారాలు, అన్యాయాలు చేస్తున్నాదని “రాజ్య హింస” అని పెద్ద పెద్ద పదాలతో చేటడంత అక్షరాల తో రాస్తారు. మరి ముస్లిం రాజులు 500 స|| క్రితం ఏ హింసా చేయకుండా భారత దేశ ప్రజలకు రాజులైనారా? భారత స్రీ లన వారు చెరచ లేద? మహిళలు,పిల్లలు మీద వారు ఎటువంటి దాడులు చేయలేదా? ఇది మేము నమ్మాలా? ముస్లిం రాజులు చేసిన నేరాలు ఘొరాలు తమరి ఎర్ర చరిత్రకారులు ఏ పుస్తకంలో రాశారో ఒక్క సారి చెపితె మేము చదువు కొని ఆనందిస్తాము.
  ——————————————————————————————————————
  How Allahabad HC exposed ‘experts’ espousing Masjid cause
  The Times of India

  http://timesofindia.indiatimes.com/india/How-Allahabad-HC-exposed-experts-espousing-Masjid-cause/articleshow/6716643.cms#ixzz11trBP3Jl

  NEW DELHI: The role played by “independent experts” — historians and archaeologists who appeared on behalf of the Waqf Board to support its claim — has come in for criticism by one of the Allahabad High Court judges in the Ayodhya verdict.

  While the special bench of three judges unanimously dismissed objections raised by the experts to the presence of a temple, it was Justice Sudhir Agarwal who put their claims to extended judicial scrutiny.

  Most of these experts deposed twice. Before the ASI excavations, they said there was no temple beneath the mosque and, after the site had been dug up, they claimed what was unearthed was a mosque or a stupa. During lengthy cross-examination spread over several pages and recorded by Justice Agarwal, the historians and experts were subjected to pointed queries about their expertise, background and basis for their opinions.

  To the court’s astonishment, some who had written signed articles and issued pamphlets, found themselves withering under scrutiny and the judge said they were displaying an “ostrich-like attitude” to facts.

  He also pointed out how the independent witnesses were all connected — one had done a PhD under the other, another had contributed an article to a book penned by a witness.

  Some instances underlined by the judge are: Suvira Jaiswal deposed “whatever knowledge I gained with respect
  to disputed site is based on newspaper reports or what others told” (other experts). She said she prepared a report on the Babri dispute “after reading newspaper reports and on basis of discussions with medieval history expert in my department.” Supriya Verma, another expert who challenged the ASI excavations, had not
  read the ground penetration radar survey report that led the court to order an excavation. She did her PhD under another expert Shireen F Ratnagar.

  Verma and Jaya Menon alleged that pillar bases at the excavated site had been planted but HC found they were not present at the time the actual excavation took place.

  Archaeologist Shereen F Ratnagar has written the “introduction” to the book of another expert who deposed, Professor Mandal. She admitted she had no field experience.

  “Normally, courts do not make adverse comments on the deposition of a witness and suffice it to consider whether it is credible or not, but we find it difficult to resist ourselves in this particular case considering the sensitivity and nature of dispute and also the reckless and irresponsible kind of statements…” the judge has noted.

  He said opinions had been offered without making a proper investigation, research or study in the subject. The judge said he was “startled and puzzled” by contradictory statements. When expert witness Suraj Bhan deposed on the Babri mosque, the weight of his evidence was contradicted by anotherexpert for Muslim parties, Shirin Musavi, who told the court that Bhan “is an archaeologist and not an expert on medieval history”.

  Justice Agarwal referred to signed statements issued by experts and noted that “instead of helping in making a cordial atmosphere it tends to create more complications, conflict and controversy.” He pointed out that experts carry weight with public opinion. “One cannot say that though I had made a statement but I am not responsible for its authenticity since it is not based on my study or research but what I have learnt from what others have uttered,” Justice Aggarwal has said, emphasising the need for thorough original research before concurring with what someone else

 13. Sudarsan says:

  >>Stay updated via RSS >>
  I saw this on top right, beside Voltair. Are you from RSS? Voltair quote is not approriate here, he was not refering to stupids.

 14. Ranjith says:

  RSS (most commonly expanded as Really Simple Syndication) is a family of web feed formats used to publish frequently updated works—such as blog entries, news headlines, audio, and video—in a standardized format

  Anyway back to my comment:

  After reading above all comments may be Arundhati Roy is right as she says “India is Corporate Hindu State” at least for upper middle class and above.

  I guess majority of people who benefit from the society based on the exploitation, from environmental destruction and from religious fundamentalism are on the internet replying or criticizing the work of intellectuals who wants reveal the truths but majority of the people who dream for better world where there is no injustice are on the streets, jungles, slums, mountains, in the fields…..and I believe the hope comes from them and do not you people never ever think you are majority.

  • Sudarsan says:

   Arudhati Roy is publicity savvy. She would be present wherever there is some controversy. No one get benefit from her blabberings upper or lower or middle.

 15. Pingback: 2010 in review « KadaliTaraga : a wave in the Ocean !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s