‘నమస్తే తెలంగాణ’కు తెలంగాణ బిడ్డ నమస్తే

తెలంగాణ హృదయావిష్కరణ వేదికకు స్వాగతం.

తన ప్రజల వైభవోజ్వల జీవితానికీ, చైతన్యానికీ, ధిక్కార సంప్రదాయానికీ ప్రతిబింబంగా, ప్రతిఫలనంగా ఉండే అక్షర రంగస్థలం కోసం, రణస్థలం కోసం తెలంగాణ తరతరాలుగా తండ్లాడుతున్నది. వెయ్యి సంవత్సరాలకు పైబడిన జనజీవన ఘర్షణా వారసత్వానికీ, ఆ ఘర్షణలో వికసించిన అద్భుత సాహిత్య, కళా, సాంస్కృతిక, చారిత్రక చైతన్య వికాసానికీ అద్దం పట్టి అక్షరీకరించవలసి ఉంది. మహత్తర తెలంగాణ జీవితంగా పడుగూపేకలా కలగలిసిపోయిన సబ్బండవర్ణాల జీవనవైవిధ్యాన్ని ఒక పట్టకం ద్వారా సప్తవర్ణాల సమ్మేళనంగా విశ్లేషించి ఒక అక్షర వేదిక మీద ప్రసరింపజేయవలసి ఉంది.

సమ్మక్క, సారలమ్మ, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, సర్వాయి పాపన్నల నుంచి, కొమురం భీం, బందగీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్యల దాకా విస్తరించిన మహోజ్వల వారసత్వ విజయగాథను ఈ తరానికి అందించడానికి ఒక అక్షరవేదిక కావలసి ఉంది. వర్తమానంలో కోస్తాంధ్ర, రాయలసీమ ఆధిపత్యశక్తుల దోపిడీ పీడనలలో నలిగిపోయిన తెలంగాణ విషాదగాథను ప్రజల దృష్టికి తెచ్చి ప్రజలను మేల్కొలపగల వైతాళిక గీతం ఒకటి కావలసి ఉంది. ‘తెలంగాణము ప్రజలదే’ అని నినదించి, భవిష్యత్తు తెలంగాణ ప్రజల సర్వతోముఖ వికాసానికి ఎంతటి ఆదర్శ నమూనా కాగలుగుతుందో ఒక సాకారమయ్యే స్వప్నాన్ని రచించవలసిన మేధో బాధ్యత కావలసి ఉంది. ఆ గత విజయగాథను, వర్తమాన విషాదగాథను, భవిష్యత్ దార్శనిక స్వప్నాన్ని ఆవిష్కరించే కర్తవ్యాన్ని ఆలోచనా స్ఫోరకమైన పత్రిక కాక ఇంకెవరు తీర్చగలరు?

అక్షరాలు నేర్చుకున్న తెలంగాణ బిడ్డలెందరో వంద సంవత్సరాలుగా అటువంటి బాధ్యత నిర్వహించడానికే తండ్లాడుతున్నారు. ఒద్దిరాజు సోదరులు, సురవరం ప్రతాపరెడ్డి, బుక్కపట్నం రామానుజాచార్యులు, మందుముల నరసింగరావు, షోయబుల్లా ఖాన్ వంటి ఎందరో తెలంగాణ పత్రికారంగ వైతాళికులను తలచుకుంటూ, ఆ బాధ్యతను మరింత సమర్థంగా, మరింత జాగరూకతతో, మరింత ప్రజాబలంతో, ప్రజల పట్ల చిత్తశుద్ధితో నిర్వహించడానికి వెలువడుతున్న ‘నమస్తే తెలంగాణ’కు హృదయపూర్వక స్వాగతం.

‘నమస్తే తెలంగాణ’ దినదినాభివృద్ధి సాధించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హృదయాలను ఆవిష్కరించగలగాలి, ఇది నాలుగుకోట్ల తెలంగాణ బిడ్డల ఆలోచనలకు వేదిక కాగలగాలి. ఇది తెలంగాణ ప్రజల ఉజ్వల భవితకు హామీ ఇవ్వగలగాలి. ‘ఇది నా పత్రిక, ఇది మా పత్రిక, ఇది మన పత్రిక’ అని ప్రతి తెలంగాణ బిడ్డా అనుకునేలా రూపు దిద్దుకోవాలి. ఇది పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విషపుత్రికలకు చెంపపెట్టు కాగలగాలి. కాళోజీ అన్నట్టు ఇది బడిపలుకుల పత్రికగా కాక పలుకుబడుల పత్రిక కాగలగాలి. తెలంగాణ పలుకుబడి ఈ పత్రిక బడి కావాలి.

n  ఎన్ వేణుగోపాల్

nసంపాదకుడు,

వీక్షణం, రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక

Advertisements

About ఎన్.వేణుగోపాల్

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues. Has been a journalist
This entry was posted in వ్యాసాలు, Telangana, Telugu. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s