Monthly Archives: April 2012

యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి

వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం  యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి, ఆధిపత్యానికీ, నిరంకుశత్వానికీ, దాడికీ, హింసకూ దారితీసిన కాలం ఇది. వ్యక్తిగత అభిరుచులను, సాంస్కృతిక సంప్రదాయాలను, తరతరాల ఆహారపుటలవాట్లను, స్వాభిమాన ప్రకటనను శాసించదలచిన గుత్తాధిపత్య, అగ్రవర్ణ, మతోన్మాద, హింసా రాజకీయ భావజాలపు సందర్భం … Continue reading

Posted in వ్యాసాలు | 4 Comments

గ్రామాల అధ్యయనాల చరిత్ర – 2

వీక్షణం ఏప్రిల్ 2012 సంచిక కోసం ఆధునిక కాలంలో జరిగిన గ్రామ అధ్యయనాలలో ప్రధానమైనవి గ్రామ కైఫియత్తులు. బ్రిటిష్ పాలనా కాలంలో తయారయిన గ్రామ కైఫియత్తులలో ఎక్కువ భాగం మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు భాషా ప్రాంతాలలో జరిగినవే. ఈ గ్రామ కైఫియత్తుల రచన శాస్త్రీయ ప్రమాణాలను పూర్తిగా సంతరించుకోకపోయినా, లోపభూయిష్టంగానే ఉన్నా, గ్రామాల అధ్యయనాల చరిత్రలో … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

చిరుమొగ్గల మరణాలు – ఎవరు చేసిన హత్యలివి?

ఈభూమి ఏప్రిల్ 2012 సంచిక కోసం ఖమ్మం జిల్లా వేపలగడ్డ లోని డా. ఎల్ వి రెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులను తీసుకుపోతున్న బస్సు రాఘవాపురం దగ్గర వాగులో పడి ఎనిమిది మంది చిన్నారులు మరణించిన సంఘటన మార్చ్ 20న జరిగింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, అందరికందరూ ఐదారేడుల శైశవగీతాలు ఆ దారుణ ప్రమాదంలో మరణించడం ఎంతటి … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

Talk at Telanagana Resource Centre

http://www.youtube.com/watch?v=HkPq4R2Ta50 http://www.youtube.com/watch?v=sYA5hIFmxOE&feature=relmfu

Posted in Videos | Leave a comment

ప్రపంచీకరణ పర్యవసానాలు – ఆత్మహత్యలు, వలసలు, హత్యలు, అంతర్యుద్ధం

ఈభూమి ఫిబ్రవరి 2012 కోసం భారత దేశంలో నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమై ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ విధానాలు ఏ పర్యవసానాలకు దారి తీశాయో మందిపు వేయడం, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఊహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విధానాలు ఇరవై ఏళ్లుగా సాగుతున్నాయి గనుక, కేంద్ర ప్రభుత్వం ద్వారానూ, … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 2 Comments

గ్రామాల అధ్యయనం ఎందుకు?

వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం ఇవాళ భారత సమాజ స్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. అత్యధిక సంఖ్యాక ప్రజల జీవనం ఉండవలసినట్టుగా లేదు. కోట్లాది ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. విజ్ఞాన, వినోద అవసరాలు ఎంతో కొంత తీరినట్టు కనబడుతున్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీరడం లేదు. విజ్ఞానం, వినోదం పేరిట వికృతమైన, అసహజమైన, సమాజవ్యతిరేకమైన … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment