Archives
Visitors
- 65,497 hits
When
Themes
Monthly Archives: July 2012
గ్రామ అధ్యయనాల పద్ధతులు
సామాజిక శాస్త్రాల అధ్యయనాలు గ్రామాలను అధ్యయనం చేసే పద్ధతులు, పరికరాలు సామాజిక శాస్త్రాలలో గత శతాబ్దంలో విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి. యూరపియన్ వలసవాద ప్రభుత్వాల పాలనా అవసరాల కొద్దీ కొంత, విశ్వవిద్యాలయాల విద్యా పరిశీలనలలో భాగంగా కొంత వివిధ దేశాలలోని ఆదిమ జాతులను పరిశీలించే మానవ శాస్త్రం (ఆంత్రొపాలజీ), సమాజ నిర్మాణాన్ని పరిశీలించే సమాజ శాస్త్రం … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
వీక్షణం – జూలై 2012 సంపాదకీయం
వానలు లేవు, విత్తనాలు లేవు, మద్యం మాత్రం పుష్కలం! ఇది రాసే సమయానికి వానకాలం ప్రవేశించి ఇరవై రోజులు అవుతున్నది. అంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడి, వాగులూ వంకలూ పారి, చెరువులు నిండి, ఏరువాక సాగి, దుక్కులు దున్ని, విత్తనాలు చల్లి, ముమ్మరంగా వ్యవసాయ పనులు నడుస్తుండవలసిన స్థితి. కాని … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
Leave a comment
మళ్లీ 1991, మళ్లీ మన్మోహన మాయాజాలం!
ఈభూమి జూలై 2012 కోసం ఆర్థిక సంస్కరణలకు, నూతన ఆర్థిక విధానాలకు దారితీసిన 1991 సంక్షోభం పునరావృతమవుతోందా? దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా విధానాలలో పెనుమార్పులకు నాంది పలికిన 1991 నాటి కాలం మళ్లీ వస్తోందా? ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రపంచ బ్యాంకు ఏజెంటును నియమించవలసిందే అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు … Continue reading
Posted in వ్యాసాలు, Ee Bhoomi
Leave a comment
ఆలోచనల గూటికి పుల్లా పుడకా
వీక్షణం జూలై2012 సంచికకోసం సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా … Continue reading
Posted in వ్యాసాలు, Veekshanam
1 Comment
తెలంగాణ నవల – విప్లవోద్యమం
సామాజిక సంచలనాలు సాహిత్యానికి ముడిసరుకును అందించడం, సాహిత్యంలో వస్తుశిల్పాల విస్తరణకూ అభివృద్ధికీ దోహదం చేయడం, తిరిగి ఆ సాహిత్యరచనలు సామాజిక సంచలనాలకు ప్రేరణగా నిలవడం, ఈ పరస్పర ప్రభావాల, అన్యోన్య చర్య-ప్రతిచర్యల పరిణామం సామాజిక సాహిత్య చరిత్రలో సాధారణమైన విషయమే. ఈ సాధారణ నిర్ధారణకు ఒక ప్రతిఫలనంగా తెలంగాణలో సాగిన విప్లవోద్యమానికీ, తెలంగాణ నవలకూ మధ్యగల … Continue reading
Posted in వ్యాసాలు, Telugu
3 Comments