Author Archives: ఎన్.వేణుగోపాల్ N Venugopal

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.

భారత్ – చైనా యుద్ధం 1962 – నిజానిజాలు

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం  దేశ అంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడ విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అబద్ధాలే అని కచ్చితంగా నమ్మేవాళ్లు కూడ, విదేశాల విషయంలో, ముఖ్యంగా యుద్ధాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు, … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | 1 Comment

వాద్రా, గడ్కరీ…బందిపోట్లదే ఈ రాజ్యం!

వీక్షణం నవంబర్ 2012 సంపాదకీయం ప్రస్తుత అధికార కూటమి అధ్యక్షురాలు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఎన్ని అక్రమ లావాదేవీలతో, కుంభకోణాలతో సంబంధం ఉన్నదో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఎన్ని వందల ఎకరాలు, వందలకోట్ల రూపాయల ఆస్తులు పోగుచేసుకున్నాడో బైటపడుతున్నది. అంతకు ముందు కాంగ్రెస్ కు చెందిన కేంద్ర, … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు?

వీక్షణం నవంబర్ 2012 సంచిక కోసం తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో సెప్టెంబర్ 30న విజయవంతమైన  తెలంగాణ మార్చ్ మరొకసారి తేటతెల్లం చేసింది. ప్రభుత్వం వైపు నుంచీ, పోలీసుల వైపు నుంచీ పెద్ద ఎత్తున నిర్బంధకాండ అమలయినా, ప్రధాన తెలంగాణ పార్టీ సంపూర్ణంగా సహకరించకపోయినా, అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

సంస్కరణల మొదటి దశ పెనం మీద, రెండో దశ పొయ్యిలోకా, చితి మీదికా?

ఈభూమి నవంబర్ 2012 సంచిక కోసం దేశ రాజకీయార్థిక విధానాలలో సంస్కరణల పేరుతో జరుగుతున్న బందిపోటు దోపిడీ మొదటి దశ ఇరవై సంవత్సరాలు గడిచి, ఇప్పుడు రెండో దశ ప్రారంభించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా రెండో దశ సంస్కరణలు ప్రారంభించాలని బహుళజాతి సంస్థలు, దేశదేశాల సంపన్నులు, దేశంలోని దళారీలు, వారి ప్రచార … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం … Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana | 2 Comments

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవడానికి పాలకవర్గాలు అన్నిరకాల కుటిల ప్రయత్నాలూ సాగిస్తున్నాయి. అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవరోధాలు ఒక్క పాలకపక్షం నుంచి మాత్రమే కాదు, పాలకవర్గ భావజాలాన్ని తెలిసో తెలియకో నింపుకున్న అన్ని రాజకీయపక్షాలూ, అధికారవర్గమూ, బుద్ధిజీవులూ కూడ … Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana | Leave a comment

యాభై ఏళ్లు కనుమరుగై దొరికిన మావో రచన

వీక్షణం అక్టోబర్ 2012 సంచిక కోసం నవ జనచైనా నిర్మాత మావో సే టుంగ్ విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా ఎన్నో ప్రాంతాలలో గ్రామ అధ్యయనాలు జరిపి దాదాపు ప్రతి అధ్యయనం మీద నివేదికలు తయారు చేశారు. ఆయన సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల గురించి విస్తృతంగా రాసిన వందలాది వ్యాసాలలో ఎన్నోచోట్ల వ్యవసాయ, … Continue reading

Posted in Telugu, Veekshanam | 1 Comment

గ్రామ అధ్యయనాల పద్ధతులు

సామాజిక శాస్త్రాల అధ్యయనాలు గ్రామాలను అధ్యయనం చేసే పద్ధతులు, పరికరాలు సామాజిక శాస్త్రాలలో గత శతాబ్దంలో విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి. యూరపియన్ వలసవాద ప్రభుత్వాల పాలనా అవసరాల కొద్దీ కొంత, విశ్వవిద్యాలయాల విద్యా పరిశీలనలలో భాగంగా కొంత వివిధ దేశాలలోని ఆదిమ జాతులను పరిశీలించే మానవ శాస్త్రం (ఆంత్రొపాలజీ), సమాజ నిర్మాణాన్ని పరిశీలించే సమాజ శాస్త్రం … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

వీక్షణం – జూలై 2012 సంపాదకీయం

వానలు లేవు, విత్తనాలు లేవు, మద్యం మాత్రం పుష్కలం!   ఇది రాసే సమయానికి వానకాలం ప్రవేశించి ఇరవై రోజులు అవుతున్నది. అంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడి, వాగులూ వంకలూ పారి, చెరువులు నిండి, ఏరువాక సాగి, దుక్కులు దున్ని, విత్తనాలు చల్లి, ముమ్మరంగా వ్యవసాయ పనులు నడుస్తుండవలసిన స్థితి. కాని … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

మళ్లీ 1991, మళ్లీ మన్మోహన మాయాజాలం!

ఈభూమి జూలై 2012 కోసం  ఆర్థిక సంస్కరణలకు, నూతన ఆర్థిక విధానాలకు దారితీసిన 1991 సంక్షోభం పునరావృతమవుతోందా? దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా విధానాలలో పెనుమార్పులకు నాంది పలికిన 1991 నాటి కాలం మళ్లీ వస్తోందా? ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రపంచ బ్యాంకు ఏజెంటును నియమించవలసిందే అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment