Category Archives: Ee Bhoomi

ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!

ఈభూమి జనవరి 2013 సంచిక కోసం డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 2 Comments

పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ

పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 1 Comment

సంస్కరణల మొదటి దశ పెనం మీద, రెండో దశ పొయ్యిలోకా, చితి మీదికా?

ఈభూమి నవంబర్ 2012 సంచిక కోసం దేశ రాజకీయార్థిక విధానాలలో సంస్కరణల పేరుతో జరుగుతున్న బందిపోటు దోపిడీ మొదటి దశ ఇరవై సంవత్సరాలు గడిచి, ఇప్పుడు రెండో దశ ప్రారంభించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా రెండో దశ సంస్కరణలు ప్రారంభించాలని బహుళజాతి సంస్థలు, దేశదేశాల సంపన్నులు, దేశంలోని దళారీలు, వారి ప్రచార … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

మళ్లీ 1991, మళ్లీ మన్మోహన మాయాజాలం!

ఈభూమి జూలై 2012 కోసం  ఆర్థిక సంస్కరణలకు, నూతన ఆర్థిక విధానాలకు దారితీసిన 1991 సంక్షోభం పునరావృతమవుతోందా? దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా విధానాలలో పెనుమార్పులకు నాంది పలికిన 1991 నాటి కాలం మళ్లీ వస్తోందా? ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రపంచ బ్యాంకు ఏజెంటును నియమించవలసిందే అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

చిరుమొగ్గల మరణాలు – ఎవరు చేసిన హత్యలివి?

ఈభూమి ఏప్రిల్ 2012 సంచిక కోసం ఖమ్మం జిల్లా వేపలగడ్డ లోని డా. ఎల్ వి రెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులను తీసుకుపోతున్న బస్సు రాఘవాపురం దగ్గర వాగులో పడి ఎనిమిది మంది చిన్నారులు మరణించిన సంఘటన మార్చ్ 20న జరిగింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, అందరికందరూ ఐదారేడుల శైశవగీతాలు ఆ దారుణ ప్రమాదంలో మరణించడం ఎంతటి … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

ప్రపంచీకరణ పర్యవసానాలు – ఆత్మహత్యలు, వలసలు, హత్యలు, అంతర్యుద్ధం

ఈభూమి ఫిబ్రవరి 2012 కోసం భారత దేశంలో నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమై ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ విధానాలు ఏ పర్యవసానాలకు దారి తీశాయో మందిపు వేయడం, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఊహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విధానాలు ఇరవై ఏళ్లుగా సాగుతున్నాయి గనుక, కేంద్ర ప్రభుత్వం ద్వారానూ, … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 2 Comments

అల్లకల్లోలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

ఈభూమి జనవరి 2012 సంచిక కోసం రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు తెచ్చుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించింది. ఆ తర్వాత రవి అస్తమించని బహుళ జాతి సంస్థల సామ్రాజ్యంగా సాగుతున్న భూగోళం ఇవాళ రవి అస్తమించని సంక్షోభ ప్రపంచంగా ఉన్నది. ఈ సంవత్సరం దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలోనూ చిన్నవో పెద్దవో ఆర్థిక సంక్షోభాలు … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

పెట్టుబడిని ముట్టడిస్తున్న ‘99 శాతం జనం మనం’

ఈభూమి నవంబర్ 2011 సంచిక కోసం అది అంతిమ పోరాటం కాకపోవచ్చు. అది క్రమబద్ధంగా, క్రమశిక్షణాయుతంగా, ఒకే నాయకత్వం కింద, పాల్గొంటున్న వారందరికీ ఒకే రకమైన విస్పష్టమైన లక్ష్యాలతో నడుస్తున్న పోరాటం కాకపోవచ్చు. కాని దాని విశిష్టత అంతా అది లేవనెత్తుతున్న ప్రశ్నలలో ఉన్నది. అది ప్రకటిస్తున్న నిరసనలో ఉన్నది. అది రూపొందిస్తున్న వినూత్న పోరాట … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

సిబిఐ నమోదు చేసిన ఆజాద్ ‘హత్య’ కేసు

ఈ భూమి జూన్ 2011 సంచిక కోసం ఎప్పుడో ఒకసారైనా తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఎంత ఆలస్యంగానైనా సత్యం బయటపడుతుంది. అధికారమే నేరమై సాగేచోటకూడ, నేరస్తులు ఎప్పటికైనా బోనెక్కక, శిక్ష అనుభవించక తప్పని కాలం వస్తుంది. ఇవి శుష్క సత్యాలు కావని, ఆ దారిలో ఒక చిన్న ముందడుగు వేయడానికైనా అవకాశం ఉందని ఒక తాజా … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi, Telugu | 2 Comments

అన్నా హజారే ఆందోళన – కొంచెం నిప్పూ కొంచెం నీళ్లూ

ఈ భూమి మే 2011 సంచిక కోసం ఏప్రిల్ మొదటివారంలో దేశ రాజధాని ఢిల్లీలో సాధారణంగా ప్రజా నిరసన ప్రదర్శనలు జరిగే జంతర్ మంతర్ దగ్గర ఒక చరిత్రాత్మక సన్నివేశం ప్రారంభమైంది. ఆ సన్నివేశానికి ప్రతిస్పందనగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటితమైంది. దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదపగలంత శక్తివంతమైన ఈ పరిణామం … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment