Category Archives: Telugu

Telugu

సకల జనుల సమ్మె కర్తవ్యం ప్రతిఘటన

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో కీలకఘట్టంగా ఈ వారంలో సకల జనుల సమ్మె ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ మొదటి వారం నుంచీ సాగుతున్న వేరువేరు పోరాట రూపాల కొనసాగింపూ, ఉన్నతీకరణా ఈ సకల జనుల సమ్మె. తెలంగాణ ప్రజల పోరాట శీలాన్నీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఆకాంక్ష బలాన్నీ ప్రదర్శించగల ఉజ్వల … Continue reading

Posted in Telugu | 1 Comment

ఇరవై ఏళ్ల ప్రపంచీకరణ

ఈభూమి ఆగస్ట్ 2011 ఇది ఒక విష విషాద గాథ. ఇది ఈ దేశం మరోసారి మోసపోయిన జాడ. ఇది మన ప్రియ భారత జనయిత్రి మూలుగులు పీల్చడానికి చెప్పన్నారు దేశాల గద్దలూ రాబందులూ గండభేరుండాలూ కలిసి వాలిన బీభత్స గాథ. మన రాజకీయ పక్షాలన్నీ తోడేళ్లలా నక్కల్లా తమ నిజరూపాలు చూపుకుని జనాలను పీక్కు … Continue reading

Posted in Telugu | 3 Comments

ప్రజల పాటకు ప్రతిఫలం మరణశిక్ష!

వీక్షణం ఆగస్ట్ 2011 జార్ఖండ్ ప్రజా కళాకారుడు, పదిహేను సంవత్సరాలకు పైగా ఖొత్తా, సంథాలీ, నాగ్ పురి, హిందీ భాషలలో ప్రజా చైతన్య గీతాలు ఆలపిస్తూ తిరుగుతున్న ప్రముఖ గాయకుడు జీతన్ మరాండీకి ఒక అబద్ధపు కేసులో, దొంగ సాక్ష్యాల ఆధారంగా గిరిది న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఈ కేసు వివరాలు చూస్తే ఈ … Continue reading

Posted in Telugu | 1 Comment

సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులు

వీక్షణం ఆగస్ట్ 2011   భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూలై మొదటివారంలో రెండు చరిత్రాత్మకమైన తీర్పులు ప్రకటించింది. తమముందు సంవత్సరాలుగా విచారణ జరుగుతున్న రెండు కేసులలో జూలై 4న, 5న తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సురిందర్ సింగ్ నిజ్జర్ దేశ రాజకీయార్థిక వ్యవస్థ గురించీ, పాలన గురించీ, … Continue reading

Posted in Telugu | Leave a comment

నెల్లూరు గుండెలపై కుంపట్లు

వీక్షణం ఆగస్ట్ 2011   నెల్లూరు జిల్లా సముద్రతీరంలోని ముత్తుకూరు మండలంలో, దానికి ఆనుకుని ఉన్న చిల్లకూరు, వెంకటాచలం మండలాలలో ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఆరు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యుత్ కేంద్రాలలో ప్రైవేటు రంగంలో 25, ప్రభుత్వ రంగంలో ఒకటి రాబోతున్నాయి. వీటిలో కొన్ని ఆగిపోయాయని, … Continue reading

Posted in Telugu | Leave a comment

ఎప్పటికైనా రాజపక్షను శిక్షిస్తారా?

సంపాదకీయ వ్యాఖ్యలు 2 శ్రీలంకలో స్వతంత్ర ఈలం స్థాపించుకోవాలనే తమిళ జాతి ఆకాంక్ష సాయుధపోరాట రూపం తీసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఇరవై సంవత్సరాలు నిరాఘాటంగా కొనసాగి, అతి భయంకరమైన అణచివేతకు గురై ఓడిపోయి రెండు సంవత్సరాలయింది. 2009 మేలో శ్రీలంక ప్రభుత్వం, భారత ప్రభుత్వ సహాయంతో అతి దుర్మార్గమైన దాడులు జరిపి అత్యంత కిరాతకంగా … Continue reading

Posted in Telugu | 2 Comments

అసలు సమస్యలను మసకబార్చే ‘అవినీతి వ్యతిరేకత’

సంపాదకీయ వ్యాఖ్యలు 1 ద్వంద్వాలుగా కనబడేవన్నీ, ద్వంద్వాలుగా చూపబడేవన్నీ ద్వంద్వాలు కావు. ఎదురెదురుగా ఉన్నట్టు, తీవ్రమైన ఘర్షణ పడుతున్నట్టు కనబడుతున్నవన్నీ నిజంగా ప్రత్యర్థి శక్తులు కావు. పాలకవర్గ ముఠాల మధ్య కూడ తమ స్వార్థ ప్రయోజనాల కోసం భీకరమైన ఘర్షణలే జరుగుతాయి. అన్నా హజారే – కపిల్ సిబాల్, బాబా రాందేవ్ – ప్రభుత్వం, యుపిఎ … Continue reading

Posted in Telugu | 1 Comment

ప్రజల పట్ల శ్రద్ధ లేని పాలకులు

వీక్షణం – జూలై 2011 సంపాదకీయం   తమను తాము ప్రజాస్వామిక అవతారాలమని, అత్యధిక వోట్లు తెచ్చుకున్న ప్రజాప్రతినిధులమని, తమ పనులకన్నిటికీ ప్రజామోదం ఉన్నట్టేనని చెప్పుకుంటున్న పాలకులకు ప్రజల పట్ల కనీస శ్రద్ధ లేదని రోజురోజూ రుజువవుతున్నది. ప్రత్యేకించి రాష్ట్రం సమస్యల సుడిగుండంలో నానాటికీ దిగజారిపోతుండగా, ఈ అగ్నిపర్వతం ఎప్పుడు పేలిపోతుందోననిపించే స్థితి ఉండగా పాలకులకు … Continue reading

Posted in Telugu | Leave a comment

అదృశ్యమైన ధృవతార ఆర్ ఎస్ రావు

మనకాలపు మహామేధావి, సునిశితమైన మార్క్సిస్టు విశ్లేషకుడు ఆర్ ఎస్ రావు కన్నుమూశారు. ముప్పై సంవత్సరాలుగా ఆయనతో సాగిన అనుబంధంలో కలిసి చేసిన ఆలోచనలు, పనులు, ప్రయాణాలు, కలిసి కన్న కలలు, పొందిన విజయాలు, వైఫల్యాలు అన్నీ ముగింపుకు వచ్చినట్టు గుండె పగిలే మౌనం. మహానిశ్శబ్దం. ‘చలనం మాత్రమే ఉంది. విశ్రాంతి, విరామం లేవు, విశ్రాంతి, విరామాల … Continue reading

Posted in Telugu | Leave a comment

క్షమించండి, కొన్నాళ్లు తప్పులు భరించాలి

ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను గనుక ఈ తప్పటడుగుల్ని పెద్దమనసుతో క్షమించండి. కొంతకాలం ఇవ్వండి.

Posted in Telugu | Leave a comment