భారత్ – చైనా యుద్ధం 1962 – నిజానిజాలు

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం

 దేశ అంతర్గత విధానాల గురించి ప్రభుత్వాలను, పాలకవర్గాలను ఎంతో తీవ్రంగా విమర్శించే వారికి కూడ విదేశాంగ విధానం దగ్గరికి వచ్చేసరికి ఎక్కడలేని దేశభక్తీ ఆవరిస్తుంది. అంతర్గత విధానాలలో ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అబద్ధాలే అని కచ్చితంగా నమ్మేవాళ్లు కూడ, విదేశాల విషయంలో, ముఖ్యంగా యుద్ధాల విషయంలో మాత్రం ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెప్పేవన్నీ అక్షర సత్యాలేనని నమ్ముతారు, వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించడం కాకుండా, మన పాలకవర్గాలు చెప్పేదంతా నిజమన్నట్టు, విదేశీ పాలకులు చెప్పేదంతా అబద్ధమన్నట్టు తమను తాము వంచించుకుంటారు, ఇతరులను వంచిస్తారు. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | 1 Comment

వాద్రా, గడ్కరీ…బందిపోట్లదే ఈ రాజ్యం!

వీక్షణం నవంబర్ 2012 సంపాదకీయం

ప్రస్తుత అధికార కూటమి అధ్యక్షురాలు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఎన్ని అక్రమ లావాదేవీలతో, కుంభకోణాలతో సంబంధం ఉన్నదో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఎన్ని వందల ఎకరాలు, వందలకోట్ల రూపాయల ఆస్తులు పోగుచేసుకున్నాడో బైటపడుతున్నది. అంతకు ముందు కాంగ్రెస్ కు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు పాలుపంచుకున్న కుంభకోణాలెన్నో బయటపడ్డాయి. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ఎన్ని అక్రమ వ్యాపారాలున్నాయో, ఎన్ని కుంభకోణాలలో భాగం ఉందో కూడ బైటపడుతున్నది. భాజపా కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రాలలో అధికారాలలో ఉన్నచోట్ల కూడ ఇటువంటి అవినీతి ఉదంతాలెన్నో బైటపడ్డాయి. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

చౌరస్తాలో తెలంగాణ ఇంకెన్నాళ్లు?

వీక్షణం నవంబర్ 2012 సంచిక కోసం

తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో సెప్టెంబర్ 30న విజయవంతమైన  తెలంగాణ మార్చ్ మరొకసారి తేటతెల్లం చేసింది. ప్రభుత్వం వైపు నుంచీ, పోలీసుల వైపు నుంచీ పెద్ద ఎత్తున నిర్బంధకాండ అమలయినా, ప్రధాన తెలంగాణ పార్టీ సంపూర్ణంగా సహకరించకపోయినా, అడుగడుగునా ఆటంకాలు ఎదురైనా లక్షలాదిగా ప్రజలు ఆ ప్రదర్శనకు తరలివచ్చారు. ప్రభుత్వ, పోలీసు బలగాల వ్యతిరేకత, అనుమతిపై అనిశ్చితి, ప్రదర్శనాస్థలం మార్పు, కుదింపు, రాజకీయ పక్షాల అవకాశవాదం, నిర్లిప్తత, రవాణా సౌకర్యాల తొలగింపు, బెదిరింపులు, గృహ నిర్బంధాలు, అరెస్టులు, మధ్యదారిలో అడ్డంకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ దిగ్బంధనం, లాఠీచార్జిలు, బాష్పవాయుగోళాల ప్రయోగాలు వంటి అసంఖ్యాక అవరోధాలను దాటుకుని తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షను, ఐక్యతను సహజంగా, స్వచ్ఛందంగా, అసాధారణంగా ప్రకటించారు. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

సంస్కరణల మొదటి దశ పెనం మీద, రెండో దశ పొయ్యిలోకా, చితి మీదికా?

ఈభూమి నవంబర్ 2012 సంచిక కోసం

దేశ రాజకీయార్థిక విధానాలలో సంస్కరణల పేరుతో జరుగుతున్న బందిపోటు దోపిడీ మొదటి దశ ఇరవై సంవత్సరాలు గడిచి, ఇప్పుడు రెండో దశ ప్రారంభించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు పది సంవత్సరాలుగా రెండో దశ సంస్కరణలు ప్రారంభించాలని బహుళజాతి సంస్థలు, దేశదేశాల సంపన్నులు, దేశంలోని దళారీలు, వారి ప్రచార సాధనాలు పెద్ద ఎత్తున చర్చలు, ప్రచారాలు సాగిస్తున్నా, తీవ్రమైన ప్రజా వ్యతిరేక వెల్లువ వల్ల ప్రభుత్వాలకు అది సాధ్యం కాలేదు. కాని ఆ ఒత్తిడి నానాటికీ మరింత పెరిగి, దేశ పాలకవర్గాలలో కనీస సిగ్గుబిళ్లలు కూడ ఊడిపోతూ, ఏ నీతి నియమాలు లేని శక్తులదే పై చేయి కావడంతో రెండో దశ సంస్కరణలు మొదలయ్యాయి Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

మహాజనాద్భుతం సాగరహారం

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపువూతుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.ఆదివారం సాయంకాలం హుస్సే న్ సాగరతీరంలో అనేక ఆంక్షలనూ, Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana | 2 Comments

న్యాయాన్వేషణకే, హింసను ఆపడానికే సాగరహారం

నమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రకటనకు మరొక మహత్తర చరివూతాత్మక రూపంగా రోజురోజుకూ బలపడుతున్న సాగరహారం ఆలోచనను, జనజీవనాచరణను అడ్డుకోవడానికి పాలకవర్గాలు అన్నిరకాల కుటిల ప్రయత్నాలూ సాగిస్తున్నాయి. అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ అవరోధాలు ఒక్క పాలకపక్షం నుంచి మాత్రమే కాదు, పాలకవర్గ భావజాలాన్ని తెలిసో తెలియకో నింపుకున్న అన్ని రాజకీయపక్షాలూ, అధికారవర్గమూ, బుద్ధిజీవులూ కూడ ఆ దారిలోనే ఉన్నారు. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీల Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana | Leave a comment

యాభై ఏళ్లు కనుమరుగై దొరికిన మావో రచన

వీక్షణం అక్టోబర్ 2012 సంచిక కోసం

నవ జనచైనా నిర్మాత మావో సే టుంగ్ విప్లవోద్యమ నిర్మాణంలో భాగంగా ఎన్నో ప్రాంతాలలో గ్రామ అధ్యయనాలు జరిపి దాదాపు ప్రతి అధ్యయనం మీద నివేదికలు తయారు చేశారు. ఆయన సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల గురించి విస్తృతంగా రాసిన వందలాది వ్యాసాలలో ఎన్నోచోట్ల వ్యవసాయ, గ్రామీణ అధ్యయనాలను ప్రస్తావించడంతో పాటు, ప్రత్యేకంగా వ్యవసాయ, గ్రామీణ విశ్లేషణలతో కనీసం ఇరవై నివేదికలు, వ్యాసాలు రాశారు. వాటిలో కొన్ని ఆయాకాలాలలో జరిగిన దమనకాండల లోనో, జాగ్రత్త చేయవలసిన వారి నిర్లక్ష్యం వల్లనో మాయమైపోయాయి. కొన్ని మాత్రమే మిగిలి, అచ్చుకెక్కి ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. అలా 1930లో ఆయన చైనా ఆగ్నేయ ప్రాంతంలోని జియాంగ్సీ రాష్ట్రంలో క్సున్ వు కౌంటీని Continue reading

Posted in Telugu, Veekshanam | 1 Comment

గ్రామ అధ్యయనాల పద్ధతులు

సామాజిక శాస్త్రాల అధ్యయనాలు

గ్రామాలను అధ్యయనం చేసే పద్ధతులు, పరికరాలు సామాజిక శాస్త్రాలలో గత శతాబ్దంలో విస్తృతంగా అభివృద్ధి అయ్యాయి. యూరపియన్ వలసవాద ప్రభుత్వాల పాలనా అవసరాల కొద్దీ కొంత, విశ్వవిద్యాలయాల విద్యా పరిశీలనలలో భాగంగా కొంత వివిధ దేశాలలోని ఆదిమ జాతులను పరిశీలించే మానవ శాస్త్రం (ఆంత్రొపాలజీ), సమాజ నిర్మాణాన్ని పరిశీలించే సమాజ శాస్త్రం (సోషియాలజీ) సామాజిక అధ్యయనాల మీద దృష్టి పెట్టాయి. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

వీక్షణం – జూలై 2012 సంపాదకీయం

వానలు లేవు, విత్తనాలు లేవు, మద్యం మాత్రం పుష్కలం!

  ఇది రాసే సమయానికి వానకాలం ప్రవేశించి ఇరవై రోజులు అవుతున్నది. అంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడి, వాగులూ వంకలూ పారి, చెరువులు నిండి, ఏరువాక సాగి, దుక్కులు దున్ని, విత్తనాలు చల్లి, ముమ్మరంగా వ్యవసాయ పనులు నడుస్తుండవలసిన స్థితి. కాని నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడానికే పది రోజులు ఆలస్యమయింది. ప్రవేశించాక కూడ రెండు మూడు రోజులు వానలు పడి ఆగిపోయాయి. ఇప్పటికి రాష్ట్రంలో కురిసి ఉండవలసిన వర్షపాతంలో సగం కూడ కురవలేదు. మధ్యలో నేల తడిసిందని ఆశతో వేసిన విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేదు. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

మళ్లీ 1991, మళ్లీ మన్మోహన మాయాజాలం!

ఈభూమి జూలై 2012 కోసం

 ఆర్థిక సంస్కరణలకు, నూతన ఆర్థిక విధానాలకు దారితీసిన 1991 సంక్షోభం పునరావృతమవుతోందా?

దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా విధానాలలో పెనుమార్పులకు నాంది పలికిన 1991 నాటి కాలం మళ్లీ వస్తోందా?

ఆర్థిక మంత్రిగా డా. మన్మోహన్ సింగ్ వంటి ప్రపంచ బ్యాంకు ఏజెంటును నియమించవలసిందే అని అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు పట్టుబట్టిన 1991 తిరిగివస్తోందా? Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment