ఆలోచనల గూటికి పుల్లా పుడకా

వీక్షణం జూలై2012 సంచికకోసం

సమాజంలోనూ, పుస్తకాలలోనూ, పత్రికలలోనూ, ఇతర ప్రచార సాధనాలలోనూ ఎన్నెన్నో తెలుసుకోవలసిన, ఆలోచించవలసిన విషయాలు ఉన్నప్పటికీ, వెలువడుతున్నప్పటికీ ప్రత్యేకంగా ఎత్తిచూపకపోవడం వల్ల వెలుగులోకి రాకుండా, ఆలోచనాపరుల దృష్టికి రాకుండా పోతున్నాయి. అటువంటి తెలుసుకోవలసిన విషయాలను మా దృష్టికి వచ్చినంతవరకు సేకరించి అందించడం ఈ శీర్షిక లక్ష్యం. ప్రజల అవగాహనల గూడును సుస్థిరంగా నిర్మించడానికే ఈ పుల్లా పుడకా.  Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | 1 Comment

తెలంగాణ నవల – విప్లవోద్యమం

సామాజిక సంచలనాలు సాహిత్యానికి ముడిసరుకును అందించడం, సాహిత్యంలో వస్తుశిల్పాల  విస్తరణకూ అభివృద్ధికీ దోహదం చేయడం, తిరిగి ఆ సాహిత్యరచనలు సామాజిక సంచలనాలకు ప్రేరణగా నిలవడం, ఈ పరస్పర ప్రభావాల, అన్యోన్య చర్య-ప్రతిచర్యల పరిణామం సామాజిక సాహిత్య చరిత్రలో సాధారణమైన విషయమే. ఈ సాధారణ నిర్ధారణకు ఒక ప్రతిఫలనంగా తెలంగాణలో సాగిన విప్లవోద్యమానికీ, తెలంగాణ నవలకూ మధ్యగల అంతస్సంబంధాన్ని పరిశీలించడం ఈ వ్యాస లక్ష్యం. Continue reading

Posted in వ్యాసాలు, Telugu | 3 Comments

రాష్ట్రపతి ఎన్నిక – తెలంగాణ ప్రబోధం

నమస్తే తెలంగాణ కోసం

రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి వోటు వెయ్యవద్దని, స్వతంత్ర అభ్యర్థి వి వి గిరికి వేయమని కాంగ్రెస్ శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు కాంగ్రెస్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1969లో పిలుపునిచ్చారు. పార్టీ ప్రతినిధిని తిరస్కరించి, అంతరాత్మ ప్రబోధానికి అనుకూలంగా వోటు వెయ్యమని సహచర పార్టీ సభ్యులను రెచ్చగొట్టారు. అధికారిక అభ్యర్థిని ఓడించి, తన ప్రతినిధిని గెలిపించుకున్నారు. అంతరాత్మ ప్రబోధం కోసం పార్టీ అదేశాన్ని ధిక్కరించవచ్చునని, Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana, Telugu | Leave a comment

ఒకవైపు వాగాడంబరం మరొకవైపు ప్రజావ్యతిరేకత

సాక్షి దినపత్రిక కోసం

అర్థశాస్త్రవేత్తలు ఒకేవాక్యంలో ఒకవంక అని ఒక విషయం, మరొకవంక అని మరొక విషయం చెపుతారని అర్థశాస్త్రం మీద ఒక ప్రఖ్యాత పరిహాసం ఉంది. భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అర్థశాస్త్రం తెలుసునో లేదో గాని ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒకవంక వాగాడంబరమూ, మరొకవంక ప్రజావ్యతిరేకతా నిండా ఉన్నాయి.

శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2012-13 బడ్జెట్ యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ విధానాల అచ్చమైన కొనసాగింపుగా ఉంది. ఆమాటకొస్తే 1991-92 బడ్జెట్ నాటినుంచీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ శక్తుల మద్దతుతో సాగుతున్న ప్రజావ్యతిరేక బడ్జెట్ల పరంపరలో భాగంగానే ఉంది. నిజానికి యుపిఎ మాత్రమే కాదు, ఈ ఇరవై సంవత్సరాలలో కేంద్రంలో అధికారం చలాయించిన ఇప్పటి ప్రతిపక్షాల కూటమి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అయినా, Continue reading

Posted in వ్యాసాలు, Sakshi | Leave a comment

ప్రపంచానికి మేడేనిచ్చిన నేల…

For Namasthe Telangana

నూట ఇరవై ఆరు సంవత్సరాల కింద మొట్టమొదటిసారి ఎనిమిది గంటల పని దినం కోరుతూ పోలీసు కాల్పులలో మరణించిన కార్మికుల నెత్తుటితో తడిసిన నేల.

ఒరిగిపోయిన వీరుడి చొక్కానే ధిక్కార పతాకగా ఎగరేసి ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన నేల.

వాక్సభాస్వాతంత్ర్యాలను అణచదలచిన అధికారవర్గాల మీద బాంబులతో సవాల్ విసిరిన నేల. Continue reading

Posted in వ్యాసాలు, Namasthe Telangana | Leave a comment

యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి

వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం

 యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి అరవై సంవత్సరాలకు పైగా రచయితగా, పత్రికారచయితగా ఉన్నారు. భారతదేశం, చైనా, అఫ్ఘనిస్తాన్, ఇరాన్, క్యూబా, అమెరికా వంటి అనేక దేశాలు పర్యటించారు, చాల పుస్తకాలు రాశారు. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి, ఆధిపత్యానికీ, నిరంకుశత్వానికీ, దాడికీ, హింసకూ దారితీసిన కాలం ఇది. వ్యక్తిగత అభిరుచులను, సాంస్కృతిక సంప్రదాయాలను, తరతరాల ఆహారపుటలవాట్లను, స్వాభిమాన ప్రకటనను శాసించదలచిన గుత్తాధిపత్య, అగ్రవర్ణ, మతోన్మాద, హింసా రాజకీయ భావజాలపు సందర్భం ఇది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ సందర్భంగా ఇతరుల ఆహార హక్కు పట్ల హిందూత్వ వాదులు ప్రదర్శించిన అసహనాన్ని, చేసిన హింసాత్మకమైన దాడిని, ఆ అసహనం వెనుక రాజకీయాలను నిశితంగా పరిశీలించవలసిన సమయం ఇది. Continue reading

Posted in వ్యాసాలు | 4 Comments

గ్రామాల అధ్యయనాల చరిత్ర – 2

వీక్షణం ఏప్రిల్ 2012 సంచిక కోసం

ఆధునిక కాలంలో జరిగిన గ్రామ అధ్యయనాలలో ప్రధానమైనవి గ్రామ కైఫియత్తులు. బ్రిటిష్ పాలనా కాలంలో తయారయిన గ్రామ కైఫియత్తులలో ఎక్కువ భాగం మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు భాషా ప్రాంతాలలో జరిగినవే. ఈ గ్రామ కైఫియత్తుల రచన శాస్త్రీయ ప్రమాణాలను పూర్తిగా సంతరించుకోకపోయినా, లోపభూయిష్టంగానే ఉన్నా, గ్రామాల అధ్యయనాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా జరిగిన ఆ కృషిని గురించి కొంచెం వివరంగానే తెలుసుకోవాలి. Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

చిరుమొగ్గల మరణాలు – ఎవరు చేసిన హత్యలివి?

ఈభూమి ఏప్రిల్ 2012 సంచిక కోసం

ఖమ్మం జిల్లా వేపలగడ్డ లోని డా. ఎల్ వి రెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులను తీసుకుపోతున్న బస్సు రాఘవాపురం దగ్గర వాగులో పడి ఎనిమిది మంది చిన్నారులు మరణించిన సంఘటన మార్చ్ 20న జరిగింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, అందరికందరూ ఐదారేడుల శైశవగీతాలు ఆ దారుణ ప్రమాదంలో మరణించడం ఎంతటి కర్కోటకులనయినా కంటతడి పెట్టిస్తుంది. అందుకే ఆ సంఘటన జరిగిన మరుక్షణం నుంచీ అనేక ఖండనలు, నిరసనలు, హాహాకారాలు, తప్పులు వెదికే ప్రయత్నాలు, నేరస్తులను శిక్షించాలనే ప్రకటనలు చాల వెలువడ్డాయి. పైపై కారణాలను, కారకులను గురించి ఎంతో కొంత చర్చ జరిగింది. Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | Leave a comment

Talk at Telanagana Resource Centre

http://www.youtube.com/watch?v=HkPq4R2Ta50

http://www.youtube.com/watch?v=sYA5hIFmxOE&feature=relmfu

Posted in Videos | Leave a comment