సాక్షి దినపత్రిక కోసం

అర్థశాస్త్రవేత్తలు ఒకేవాక్యంలో ఒకవంక అని ఒక విషయం, మరొకవంక అని మరొక విషయం చెపుతారని అర్థశాస్త్రం మీద ఒక ప్రఖ్యాత పరిహాసం ఉంది. భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అర్థశాస్త్రం తెలుసునో లేదో గాని ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒకవంక వాగాడంబరమూ, మరొకవంక ప్రజావ్యతిరేకతా నిండా ఉన్నాయి.

శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2012-13 బడ్జెట్ యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ విధానాల అచ్చమైన కొనసాగింపుగా ఉంది. ఆమాటకొస్తే 1991-92 బడ్జెట్ నాటినుంచీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ శక్తుల మద్దతుతో సాగుతున్న ప్రజావ్యతిరేక బడ్జెట్ల పరంపరలో భాగంగానే ఉంది. నిజానికి యుపిఎ మాత్రమే కాదు, ఈ ఇరవై సంవత్సరాలలో కేంద్రంలో అధికారం చలాయించిన ఇప్పటి ప్రతిపక్షాల కూటమి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అయినా, Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | May 1, 2012

ప్రపంచానికి మేడేనిచ్చిన నేల…

For Namasthe Telangana

నూట ఇరవై ఆరు సంవత్సరాల కింద మొట్టమొదటిసారి ఎనిమిది గంటల పని దినం కోరుతూ పోలీసు కాల్పులలో మరణించిన కార్మికుల నెత్తుటితో తడిసిన నేల.

ఒరిగిపోయిన వీరుడి చొక్కానే ధిక్కార పతాకగా ఎగరేసి ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన నేల.

వాక్సభాస్వాతంత్ర్యాలను అణచదలచిన అధికారవర్గాల మీద బాంబులతో సవాల్ విసిరిన నేల. Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | April 26, 2012

యాన్ మిర్డాల్ తో ఇష్టాగోష్ఠి

వీక్షణం ఏప్రిల్ 2012 సంచికకోసం

 యాన్ (ఇంగ్లిష్ లో జె ఎ ఎన్ అని రాస్తారు గాని స్వీడిష్ లో యాన్ అని ఉచ్చరిస్తారు) మిర్డాల్ భారత ప్రజలకు చిరకాల మిత్రుడు. స్వీడన్ లోని స్టాక్ హోం లో 1927లో పుట్టిన యాన్ మిర్డాల్ యువకుడిగా నాజీ వ్యతిరేక యువజన సంఘాల సభ్యుడిగా, మార్క్సిస్టుగా మారి అరవై సంవత్సరాలకు పైగా రచయితగా, పత్రికారచయితగా ఉన్నారు. భారతదేశం, చైనా, అఫ్ఘనిస్తాన్, ఇరాన్, క్యూబా, అమెరికా వంటి అనేక దేశాలు పర్యటించారు, చాల పుస్తకాలు రాశారు. Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | April 23, 2012

పెద్దకూర పండుగ రాజకీయాలు

ఆహార రాజకీయాల గురించి మాట్లాడవలసిన సమయం ఇది. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఆహారాన్ని స్వేచ్ఛగా తినవచ్చునా లేదా అనేది రాజకీయంగా మారిపోయి, ఆధిపత్యానికీ, నిరంకుశత్వానికీ, దాడికీ, హింసకూ దారితీసిన కాలం ఇది. వ్యక్తిగత అభిరుచులను, సాంస్కృతిక సంప్రదాయాలను, తరతరాల ఆహారపుటలవాట్లను, స్వాభిమాన ప్రకటనను శాసించదలచిన గుత్తాధిపత్య, అగ్రవర్ణ, మతోన్మాద, హింసా రాజకీయ భావజాలపు సందర్భం ఇది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్దకూర పండుగ సందర్భంగా ఇతరుల ఆహార హక్కు పట్ల హిందూత్వ వాదులు ప్రదర్శించిన అసహనాన్ని, చేసిన హింసాత్మకమైన దాడిని, ఆ అసహనం వెనుక రాజకీయాలను నిశితంగా పరిశీలించవలసిన సమయం ఇది. Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | April 23, 2012

గ్రామాల అధ్యయనాల చరిత్ర – 2

వీక్షణం ఏప్రిల్ 2012 సంచిక కోసం

ఆధునిక కాలంలో జరిగిన గ్రామ అధ్యయనాలలో ప్రధానమైనవి గ్రామ కైఫియత్తులు. బ్రిటిష్ పాలనా కాలంలో తయారయిన గ్రామ కైఫియత్తులలో ఎక్కువ భాగం మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు భాషా ప్రాంతాలలో జరిగినవే. ఈ గ్రామ కైఫియత్తుల రచన శాస్త్రీయ ప్రమాణాలను పూర్తిగా సంతరించుకోకపోయినా, లోపభూయిష్టంగానే ఉన్నా, గ్రామాల అధ్యయనాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా జరిగిన ఆ కృషిని గురించి కొంచెం వివరంగానే తెలుసుకోవాలి. Read More…

ఈభూమి ఏప్రిల్ 2012 సంచిక కోసం

ఖమ్మం జిల్లా వేపలగడ్డ లోని డా. ఎల్ వి రెడ్డి మెమోరియల్ స్కూల్ విద్యార్థులను తీసుకుపోతున్న బస్సు రాఘవాపురం దగ్గర వాగులో పడి ఎనిమిది మంది చిన్నారులు మరణించిన సంఘటన మార్చ్ 20న జరిగింది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, అందరికందరూ ఐదారేడుల శైశవగీతాలు ఆ దారుణ ప్రమాదంలో మరణించడం ఎంతటి కర్కోటకులనయినా కంటతడి పెట్టిస్తుంది. అందుకే ఆ సంఘటన జరిగిన మరుక్షణం నుంచీ అనేక ఖండనలు, నిరసనలు, హాహాకారాలు, తప్పులు వెదికే ప్రయత్నాలు, నేరస్తులను శిక్షించాలనే ప్రకటనలు చాల వెలువడ్డాయి. పైపై కారణాలను, కారకులను గురించి ఎంతో కొంత చర్చ జరిగింది. Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | April 7, 2012

Talk at Telanagana Resource Centre

http://www.youtube.com/watch?v=HkPq4R2Ta50

http://www.youtube.com/watch?v=sYA5hIFmxOE&feature=relmfu

ఈభూమి ఫిబ్రవరి 2012 కోసం

భారత దేశంలో నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమై ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ విధానాలు ఏ పర్యవసానాలకు దారి తీశాయో మందిపు వేయడం, భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండనున్నాయో ఊహించడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విధానాలు ఇరవై ఏళ్లుగా సాగుతున్నాయి గనుక, కేంద్ర ప్రభుత్వం ద్వారానూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానూ అనేక రంగాలలో అమలయ్యాయి గనుక ఆ పర్యవసానాలన్నిటినీ ఒక వ్యాసంలో చర్చించడం సాధ్యం కాదు. కాని దేశ ప్రజాజీవితం మీద తీవ్రమైన ప్రభావం వేసిన ప్రధానమైన పర్యవసానాలు ఏమిటో, అవి ఈ సమాజాన్ని ఏ దిశలో నడిపించనున్నాయో స్థూలంగా చర్చించవచ్చు. Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | April 2, 2012

గ్రామాల అధ్యయనం ఎందుకు?

వీక్షణం ఫిబ్రవరి 2012 సంచిక కోసం

ఇవాళ భారత సమాజ స్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. అత్యధిక సంఖ్యాక ప్రజల జీవనం ఉండవలసినట్టుగా లేదు. కోట్లాది ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. విజ్ఞాన, వినోద అవసరాలు ఎంతో కొంత తీరినట్టు కనబడుతున్నా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీరడం లేదు. విజ్ఞానం, వినోదం పేరిట వికృతమైన, అసహజమైన, సమాజవ్యతిరేకమైన భావజాల అంశాలు మనసుల్లో రుద్దబడుతున్నాయి. అసంఖ్యాక ప్రజానీకానికి మానవ సహజమైన గౌరవం దక్కడం లేదు. రాజ్యాంగ ఆదర్శాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక పాలన, లౌకికత్వం అరకొరగా అమలవుతున్నాయి. Read More…

Posted by: ఎన్.వేణుగోపాల్ | March 26, 2012

Prajakavi Kaloji National Seminar

Older Posts »

Categories

Follow

Get every new post delivered to your Inbox.