Author Archives: ఎన్.వేణుగోపాల్ N Venugopal

About ఎన్.వేణుగోపాల్ N Venugopal

Poet, literary critic, journalist, public speaker, commentator and columnist on political, economic and social issues.

అసలు నీటి కోసమేనా ఈ వివాదాలు?

నవ తెలంగాణ దినపత్రిక ఆగస్ట్ 4, 2021 కోసం – తెలంగాణార్థం కొద్ది నెలలుగా జల వివాదాలు అనే పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలు, ఖండన మండనలు జరుగుతున్నాయి. శ్ర్రీశైలం రిజర్వాయర్ నుంచి మూడు టిఎంసి ల నీటిని రాయలసీమకు తీసుకుపోయే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే మొదటి … Continue reading

Posted in Telugu | Leave a comment

మహాప్రస్థానం మహాప్రచురణ – ఒక ఉత్సవ సందర్భం

శ్రీశ్రీ విశ్వేశ్వరరావు ఆలోచనాచరణతో వెలువడిన మహాప్రస్థానం మహా ప్రచురణ నిజంగా తెలుగు సమాజమూ సాహిత్యలోకమూ జరుపుకోవలసిన ఒక ఉజ్వల ఉత్సవ సందర్భం. నిన్న ఉదయం ఆ పుస్తకం నా చేతికి అందగానే నా సంతోషం మీతో పంచుకున్నాను. నిన్నంతా ఆ పుస్తకంతోనే గడిచింది. ఇవాళ విశ్వేశ్వరరావు గారిని కలిశాను. మహాప్రస్థానం మహా ప్రతిలో ప్రతి పేజీనీ … Continue reading

Posted in Telugu | Leave a comment

హంతక అసహనం – దభోల్కర్ నుంచి రోహిత్ దాకా

సంఘ్ పరివార్ ఫాసిజానికీ, హంతక అసహనానికీ మరొక స్వతంత్ర ఆలోచనాపరుడు బలయ్యాడు. సంఘ్ పరివార్ లో భాగమైన భారతీయ జనతా పార్టీ, అందులోనూ గుజరాత్ నరమేధపు నెత్తురంటిన చేతుల నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత పెట్రేగి పోతున్న హిందూ మతోన్మాద శక్తుల దాడులలో బలి అయిపోయిన జాబితాలో మరొక పేరుగా రోహిత్ వేముల … Continue reading

Posted in Telugu, Veekshanam | Tagged , | Leave a comment

ఒక కన్నీటి చుక్క, ఒక కొవ్వొత్తి, ఒక ప్రతీకార ప్రకటన సరిపోతాయా? ఎన్ని పాతర్ల లోతు నుంచి మారాలి మనం?!

ఈభూమి జనవరి 2013 సంచిక కోసం డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అమానుష కృత్యం, ఇరవై మూడేళ్ల యువతిపై ఆమె స్నేహితుడి ముందే బస్సులో జరిగిన సామూహిక అత్యాచారం, ఆమెపై, ఆమె స్నేహితుడిపై దౌర్జన్యం, ఇనుప చువ్వలతో, ఇతర సాధనాలతో ఆమె కడుపు మీద, మర్మావయవాలలో పొడిచిన భయంకరమైన హింస, ఇద్దరినీ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 2 Comments

2012 in review

The WordPress.com stats helper monkeys prepared a 2012 annual report for this blog. Here’s an excerpt: 600 people reached the top of Mt. Everest in 2012. This blog got about 6,000 views in 2012. If every person who reached the … Continue reading

Posted in Telugu | Leave a comment

నేపాల్ మావోయిస్టుల దారి ఎటు?

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం పది సంవత్సరాల సాయుధ పోరాటంతో దేశవ్యాప్త అధికారానికి చేరువ అయిన నేపాల్ మావోయిస్టుల పట్ల ప్రపంచవ్యాప్తంగానే ఆసక్తి, ఆదరణ వెల్లువెత్తాయి. భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ కూడ చాల మంది ప్రగతిశీలవాదులు, విప్లవ సానుభూతిపరులు నేపాల్ విప్లవాన్ని సగౌరవంగా ప్రశంసించారు. పదహారు వేలమంది కార్యకర్తలు, ప్రజలు అమరులైనప్పటికీ, వెనుకబడిన దేశాలలో … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | 1 Comment

పాలస్తీనా రక్తాశ్రుసిక్త విషాద గాథ

పాలస్తీనా లోని గాజా నగరం మీద ఇజ్రాయెల్ వైమానిక దళం నవంబర్ 14న జరిపిన దాడిలో గాజాను ప్రస్తుతం పాలిస్తున్న హమస్ సైనిక నాయకుడు అహ్మద్ జబారీ మరణించాడు. అప్పటినుంచి నవంబర్ 21 న ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగేవరకూ వారం రోజుల పాటు ఇజ్రాయెల్ దాడులు, హమస్ ప్రతిదాడులతో గాజా దద్దరిల్లిపోయింది. ఈ … Continue reading

Posted in వ్యాసాలు, Ee Bhoomi | 1 Comment

ఒబామా గెలుపు ఎవరికి మేలు?

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం అమెరికా అధ్యక్షుడుగా బారక్ హుసేన్ ఒబామా మొదటిసారి గెలిచినప్పుడు వీక్షణం 2008 డిసెంబర్ సంచికలో ‘ఒబామా మార్పు తేగలడా?’ అని సంపాదకీయ వ్యాఖ్య రాశారు. ఇప్పుడు ఒబామా రెండోసారి గెలిచిన సందర్భంగా ఆ వ్యాఖ్యను యథాతథంగా గుర్తు తెచ్చుకోవడం అవసరం. “రెండువందల ముప్పై సంవత్సరాల తర్వాత, నలభైముగ్గురు అధ్యక్షులతర్వాత … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment

On Telangana March

 

Posted in Videos | Leave a comment

నేరం – శిక్ష – బాల్ ఠాక్రే – అజ్మల్ కసబ్

వీక్షణం డిసెంబర్ 2012 సంచిక కోసం ముంబైలో నాలుగు సంవత్సరాల కింద 2008 నవంబర్ 26 నుంచి 29 వరకు “పాకిస్తాన్-ప్రేరేపిత తీవ్రవాదులు” జరిపిన బాంబు దాడులలో, కాల్పులలో 164 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఆ నేరానికి పాల్పడిన వారిలో సజీవంగా దొరికిన ఒకే ఒక్క వ్యక్తి అజ్మల్ కసబ్ అనే … Continue reading

Posted in వ్యాసాలు, Veekshanam | Leave a comment