Category Archives: Andhra Jyothy

Andhra Jyothy

పాండే మావోయిస్టట! చంపడం ఒప్పట!

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధికార ప్రతినిధి ఆజాద్ (చెరుకూరి రాజకుమార్) తో పాటు జూన్ 30న నాగపూర్ లో పోలీసుల చేత చిక్కి, హత్యకు గురయి, జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్ అడవుల్లో మృతదేహంగా తేలిన ఢిల్లీ జర్నలిస్టు హేమచంద్ర పాండే మావోయిస్టేనని తేల్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హత్యనూ,

Posted in Andhra Jyothy, వ్యాసాలు | 4 Comments

తర్కం లోపించిన తీర్పు

భారత న్యాయవ్యవస్థ వెలువరించిన తీర్పులలో అన్యాయమైనవీ, చట్టనిబంధనలను వక్రీకిరించినవీ, తమ పరిధిని అతిక్రమించినవీ ఎన్నో ఉన్నాయి. కింది కోర్టులు అటువంటి అన్యాయమైన తీర్పులు ఇచ్చినప్పుడు పై కోర్టులు సవరించిన సందర్భాలు కూడ ఎన్నో ఉన్నాయి. మరణశిక్షతో సహా కింది కోర్టులు వేసిన ఎన్నో శిక్షలను పై కోర్టులు కొట్టివేసిన సందర్భాలకు కూడ లెక్కలేదు.

Posted in Andhra Jyothy, వ్యాసాలు | 16 Comments

వార్త అంటే ఏమిటి?

వ్యాసప్రోక్త మహాభారతం సభాపర్వానికి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, పురిపండా అప్పలస్వామి గార్ల తెలుగు వచనానువాదం (ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్, జూన్ 2008) చదువుతుంటే ఒక వాక్యం దిగ్భ్రాంతి కలిగించింది. ఆ దిగ్భ్రాంతినుంచి తేరుకోవడానికి కొంత పరిశోధన సాగిస్తే అది మరింత పెరిగింది గాని తగ్గలేదు. ‘కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత’ అనే నానుడి నిజమేనా … Continue reading

Posted in Andhra Jyothy, వ్యాసాలు | Leave a comment

కొమరయ్య, కుమార్, కొమ్రన్న…

దళిత బహుజన ఆలోచనా స్రవంతిలో కొన్ని వినూత్నమైన, విభిన్నమైన అవగాహనలు ప్రవేశపెట్టిన చిరకాల మిత్రుడు, పేరుతోనే ఎంతోమందికి అన్న అయిన కొమ్రన్న (కేసరాజు కొమరయ్య) యాభై ఏళ్ల వయసుకే, సమయానికి సరయిన వైద్యం అందక కన్నుమూశాడు. ఇటీవల ఎక్కువగా రాస్తూ, సంభాషిస్తూ రచయితగా, సున్నితమైన బహుజన ఆలోచనాపరుడిగా నిలబడతాడని వాగ్దానం వస్తూ ఉండగానే అనారోగ్యం ఆ … Continue reading

Posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu | 1 Comment

నిశాంతపు వెలుగురేఖ ఆజాద్(Updated)

కృష్ణా జిల్లాలో పుట్టి, ఈ దేశపు దక్షిణ, పశ్చిమ, మధ్య రాష్ట్రాలలో బహుశా మరెవరికన్నా ఎక్కువగా నడయాడిన చెరుకూరి రాజకుమార్ అతి దుర్మార్గంగా హత్యకు గురయ్యాడు. నూజివీడు బిడ్డ కాజీపేట, హనుమకొండ, వరంగల్, విశాఖపట్నం, బెంగళూరు రహదారుల మీదినుంచి పడమటి కనుమలనూ తూర్పు కనుమలనూ కలిపిన దండకారణ్యమంతా విస్తరించాడు.

Posted in Andhra Jyothy, వ్యాసాలు | 30 Comments

రాజోళి, అలంపురం విషాదం

(అక్టోబర్ 19, 2009, ఆంధ్రజ్యోతి దినపత్రిక) తుంగభద్ర – కృష్ణ వరద బీభత్సంలో కకావికలయిన ప్రజాజీవనానికి సహాయ సహకారాలు అందించడానికి, దెబ్బతిన్న వేలాది బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి సమాజమంతా పెద్ద ఎత్తున కదులుతున్నట్టు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలన్నీ సహాయ, పునరావాస కార్యక్రమాలలో తలమునకలుగా ఉన్నట్టు ఒక అభిప్రాయం చలామణీలోకి వచ్చింది. పనిచేసే వారినెవరినీ విమర్శించనక్కరలేదేమో. సహాయ, … Continue reading

Posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu | Leave a comment

హోంమంత్రికి బహిరంగలేఖ

(ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మే 11, 2010) పళనియప్పన్ చిదంబరం గారూ, మీరు అగ్రాసనాధిపత్యం వహిస్తున్న మహా ఘనత వహించిన గృహమంత్రిత్వశాఖ మే 6న విడుదల చేసిన ఒక ప్రకటన (బెదిరింపు లేఖ) కు జవాబుగా బహిరంగ లేఖ రాయాలనిపిస్తున్నది. ఆ రెండు పేరాగ్రాఫుల ప్రకటనలో చెప్పినవీ, చెప్పనివీ చాల విషయాలున్నాయి. తమ రాజకీయాలను సమర్థించమని భారత … Continue reading

Posted in Andhra Jyothy, వ్యాసాలు, Telugu | 2 Comments

విమోచన అంటే చరిత్ర నవ్వదా?

సెప్టెంబర్‌ 17, 1948 ని ‘హైదరాబాద్‌ విమోచన దినం’అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలం గాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు Continue reading

Posted in Andhra Jyothy, Telangana, Telugu | Tagged , , | 1 Comment

జన్మభూమి

– మహమూద్‌ దర్వీష్‌ (తెలుగు: ఎన్‌.వేణుగోపాల్‌) Janma Bhumi నేనొచ్చింది అక్కడి నుంచే నా మదినిండా అక్కడి జ్ఞాపకాలే మనుషులందరికీ ఉన్నట్టే నాకూ జన్మనిచ్చిన తల్లీ కిటికీలు తెరుచుకున్న ఇల్లూ రెక్కల్లో రెక్కలయిన అన్నదమ్ములూ మనసు నిండిన సావాసగాళ్లూ

Posted in Andhra Jyothy, Telugu | Tagged , , , , , | 2 Comments

పాలస్తీనా దుఃఖగానం మహమూద్‌ దర్వీష్‌

మహమూద్‌ దర్వీష్‌ చనిపోయాడని చదివినప్పుడు అత్యంత ఆత్మీయుడైన తెలుగు కవి చనిపోయినట్టే అనిపించింది. జీవితమంతా మాతృభూమిలో దుర్మార్గ పరాయి పాలనను అనుభవిస్తూనో, రచనలోనూ ఆచరణలోనూ ఆ పాలకులను ధిక్కరిస్తూ ప్రవాసంలోనో గడిపిన పాలస్తీనియన్‌ మహాకవి మహమూద్‌ దర్వీష్‌ పాడిన పాటలన్నీ మన ఆవేదనకు అక్షర రూపాలేననిపిస్తాయి. ఆ వేలమైళ్ల అవతలి భావుకుడు మనలోలోపలి ఆందోళనలకే కవితారూపమిస్తున్నాడా అనిపిస్తుంది Continue reading

Posted in Andhra Jyothy, Telugu | Tagged , , , | Leave a comment